సబ్ ఫీచర్

సమాజ హితైషులు మేల్కొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా మామూలుగానే ఉంది. ఏదీ క్రొత్తగా లేదు. పెను సంచలనాలు ఏవీ లేవు. సూర్యచంద్రులు గతులు తప్పలేదు. పగలురాత్రి మామూలుగానే వస్తున్నాయి. దొరికినవాడు ముప్పూటలా మేస్తూనే ఉన్నాడు. వాలెంటైన్స్‌డేను ఎవ్వరూ మరచిపోలేదు. వార్తాపత్రికలు నానా చెత్తనూ యథాప్రకారం దేశంపైకి వదుల్తూనే ఉన్నాయి. దృశ్యమాధ్యమాల్లో వేదాంత ప్రవచనాలు నిరాఘాటంగా సాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకుల దినవారీ నిందారోపణలు సాగుతూనే ఉన్నాయి.
అసలు ఏదో జరుగుతుందని ఆశించడంలోనే, జరగాలని కోరుకోవడంలోనే అభారతీయత్వం ఉంది. ‘అంతా మిథ్య’ (నేనూ, నా ఆస్తిపాస్తులు తప్ప) తత్త్వాన్ని తరతరాలుగా పట్టించుకున్న జాతి. ఇదేం క్రొత్తా? ఇంతకుముందు ఎంతమంది రాలేదు? ఎంత వినాశం సృష్టించలేదు? మనం చలించామా? ఎవడి పాపాన వాడేపోతాడు. కాని, ఇప్పుడు జరిగింది కాస్త వింతగానే ఉంది. ఎక్కడో లాహోర్‌లోనో, కరాచీలోనో, ఫైసలాబాద్‌లోనో జరిగుంటే అది నిత్యకృత్యమే. మన దేశంలోనే బారాముల్లాలోనో, జమ్మూలోనో, శ్రీనగర్‌లోనో జరిగినా అంత ఆశ్చర్యం ఏమీ లేదు- ఈమధ్య అలవాటుపడ్డాం కాబట్టి. కాని ఈమారు అలా కాదాయె. మన దేశం నడిబొడ్డు, మన రాజధాని నగరం, మన రాష్టప్రతి, మన ప్రధానమంత్రి, మన దేశ సర్వోన్నత న్యాయస్థానం, అన్ని నిఘా విభాగాల ప్రధాన కార్యాలయాలు కొలువైనచోటు.
అందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్య నాయకుడు తనే అంతా భారం వహించి, దగ్గరుండి మరీ జరిపించిన కార్యక్రమం. ‘అఫ్‌జల్‌గురు సంస్మరణ సభ’. అలాంటి సభను అంత బహిరంగంగా పాకిస్తాన్‌లో సైతం జరపరు. ప్రపంచ సభ్యసమాజం ఏవగించుకుంటుందనే భయమేనా ఉం టుంది. మరి ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అలంటి సభ జరపాలనే ఆలోచన ఎవరిది? సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? పెట్టుబడిదారెవరు?ఇంతకూ అక్కడ వారు చేసిన నినాదాలు ఏవి? ఒక్కసారి వింటేనే శరీరమంతా తేళ్లు పాకినట్లవుతుందే.
ఇంత జరిగాక, ఏదో మీడియా ద్వారా విషయాలు బయటకు వచ్చాక గాని, ప్రభుత్వంలో కదలిక రాలేదు. నిఘా అలవాటు ప్రకారం నిద్దరోతూనే ఉంది. మన నిస్సిగ్గరి రాజకీయ నాయకులు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయ సంఘనపై స్పందిస్తూ ‘‘ఇది తప్పేమీ కాదు. ఏదో పిల్లలు. మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ వాక్‌స్వాతంత్య్రం ఉంది’’- అంటూ సమర్ధిస్తారు. కాని, ఆ విద్యాలయ ప్రాంగణంలో పోలీసుల ప్రవేశం మాత్రం ఫాసిజాన్ని తలపిస్తుందట. అయ్యా! ఏచూరివారూ! మన దేశాన్ని మన భూభాగంపైనుండే సవాలు చేసిన వారిని నిర్బంధించడం ఫాసిజమే అయితే, మాకంతా ఆ ఫాసిజమే కావాలి. అవును. అపుడు ఆ ఫాసిజానే్న మేం స్వాగతిస్తాం. అయినా, భారతదేశంలో ఈ కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు తిరస్కరించారు. కానీ ఆ నాయకులంతా తల్లక్రిందులుగా ప్రయాణిస్తూ, మరో గందరగోళాన్ని సృష్టించడానికి యత్నిస్తున్నారు. అయినా ఫాసిజం అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. దాని స్థానాన్ని స్టాలినిజం, మావోయిజం ఆక్రమించాయి. ఏచూరిగారూ! అందుకు లేటెస్ట్ ప్రత్యామ్నాయం తియాననె్మనిజం. విద్యాలయం వేదికగా దేశద్రోహ నినాదాలు చేయడం ప్రజాస్వామ్య హక్కట. పోలీసులు ప్రవేశించడం మాత్రం అత్యవసర పరిస్థితిని గుర్తుకు తెచ్చిందట. అందుకే ఆ తరువాత కొద్దిసేపటికే ఆ అత్యవసర పరిస్థితి రూపశిల్పి మనుమడితో కలిసి వేదిక పంచుకున్నారు వామపక్ష నాయకులిరువురూ.
ఇంత జరిగినా, ఏవో కొన్ని జాతీయ ఛానళ్లలో తప్ప- దేశంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. ఏ జాతీయ ఐక్యతారాహిత్యం కారణంగా వేల సంవత్సరాలు పరాధీనంలోకి నెట్టబడ్డాయో, ఆ స్థితే మళ్ళీ కన్పించడం లేదా! ఒక అంబి, ఒక జయచంద్రుడు, మరో మాన్‌సింగ్‌లు వేరే రూపాల్లో కన్పించడం లేదా! జరుగుతున్న అనర్థానికి సమాధానం ఇచ్చుకోలేక, ‘‘దేశంలో విద్యాలయాల్లో హిందూ మైథాలజీని చొప్పింపజేయడమే ఈ ప్రభుత్వ ఎజెండా’’ అని తలాతోక లేని సమాధానం చెబుతూ తప్పించుకుపోతున్న ఆ పెద్దమనిషి ‘అసలు తన సహజ స్పృహలో ఉన్నాడా’ అనే అనుమానం కల్గుతుంది. అయ్యా! ఈ దేశంలో 80 శాతం ఉన్న హిందూ విద్యార్థులు- కరికులంలో భాగంగా మైథాలజీని చదువవలసి ఉంటే- హిందూ మైదాలజీని కాకుండా మరి దేన్ని ఎన్నుకుంటారు? మేము- పౌరులము, తల్లిదండ్రులము- మా పిల్లలు ఆ విధంగా చదవాలనే కోరుకుంటున్నాము. ఆ రాముడు, ఆ కృష్ణుడే మాకు ఆరాధ్యులు. మీరు కావలసి వస్తే మీకు తోచిన మరో దేవుడిని, మరో మైదాలజీని చదివించుకోండి మీ పిల్లలతో. మీ సిద్ధాంతానికి ప్రజల్లో ఎంతశాతం మద్దతుఉందో, గడిచిన దశాబ్దకాలంగా జరిగిన అన్ని ఎన్నికలూ రుజువు చేశాయ గదా?
‘‘చెవిటివాడు కూడ వినేట్లు చేయాలనే బాంబులు విసిరాను’’- ఢిల్లీ అసెంబ్లీలో ఉత్తుత్తి (కేవలం శబ్దిస్తాయి గాని, ఎలాంటి ప్రాణహాని చేయవు) బాంబులు పేల్చిన నేరంపై విచారణ ఎదుర్కుంటున్న భగత్‌సింగ్ న్యాయస్థానానికి చెప్పిన విషయం. కాని బ్రిటీష్ ప్రభుత్వం అతనికి మరణశిక్షనే విధించింది. ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం అని నినదించినవారు అష్టకష్టాలు పడ్డారు. మరి మన ప్రజాస్వామ్య దేవాలయంపై దాడి జరిపి, పది మంది దాకా మన వీరుల మృతికి కారకుడైన ముష్కరుడు అఫ్జల్‌గురు. ఏ విచారణా జరపకుండా, బహిరంగంగా కాల్చి చంపినా దేశ ప్రజలంతా వేడుకలు జరుపుకునేవారు. మన దేశంలో- సత్యాన్ని నమ్మిన దేశం కాబట్టి- తాపీగా విచారణ జరిపి, అతను వాడుకోవీలైన అవకాశాలన్నీ ఇచ్చి- తరువాత ఉరితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థుల నినాదం ‘‘అఫ్జల్! వియ్ ఆర్ అషేమ్డ్, యువర్ మర్డరర్స్ ఆర్ స్టిల్ అలైవ్’’.- అంటే ఆ శిక్షను ఖరారుచేసిన న్యాయమూర్తులనుంచి, కేసును నమోదుచేసిన వారివరకూ ఎవ్వరినీ వదలమనే గదా అర్థం.
మేధావులు, విద్యావంతులు! మాకేం పట్టిందని తాపీగా కూర్చోకూడదు. అట్లా చేస్తే ఈ అగ్ని మనల్నూ దహిస్తుంది. పెద్దలు, సమాజ హితైషులు సమాజాన్ని జాగృతం చేయాల్సిన సమయం సరిగ్గా ఇదే. హింసామార్గం అవసరం లేదు. మహాత్ములు మనకు బోధించిన అహింసా మార్గాలెన్నో ఉన్నాయి. మన అసంతృప్తిని ఈ రాజకీయ నాయకుల నషాళానికి తగిలేలా చేస్తేచాలు. తరువాత కార్యం దానికదే జరుగుతుంది.

- ఇంద్రకంటి వేంకటేశ్వర్లు