సబ్ ఫీచర్

అంతరిస్తున్న ‘సుందర్బన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర మట్టం నానాటికీ పెరుగుతూ, తీరప్రాంతం కోతకు గురవుతున్నందున ‘సుందర్బన్ అడవులు’ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్తవ్రేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ అడవులను పరిరక్షించేందుకు భారత, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టలని నిపుణులు చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత-బంగ్లాదేశ్‌లలో సుమారు లక్షా నలభై వేల హెక్టార్ల మేరకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని ‘సుందర్బన్ అడవులు’ అని పిలుస్తారు. దట్టమైన రావిచెట్లతో నిండి ఉన్న ప్రపంచంలోనే పెద్ద అటవీ ప్రాంతం ఇది. ఒకవైపు భారత్ నుండి గంగానది, మరోవైపు బంగ్లాదేశ్ నుండి ఇరావతీ నది పాయలుగా ఈ అడవుల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ అడవులలో ప్రవహించే నదీ జలాల్లో డాల్ఫిన్ చేపలు, మొసళ్ళు తిరుగాడుతూ ఉంటాయి. ‘ఇండియన్ పైథాన్’గా పేరొందిన కొండచిలువలకు ఈ అడవులు ఆలవాలం. ప్రసిద్ధి చెందిన బెంగాల్ టైగర్లు (పెద్ద పులులు) ఈ అడవులలో 500 వరకు ఉన్నాయని ‘యునెస్కో’ పేర్కొంది.
నిత్యం పచ్చదనంతో కళకళలాడే సుందర్బన్ అడవులకు ఇప్పుడొక పర్యావరణ సమస్య వచ్చింది. ఇక్కడి తీరప్రాంతం కోతకు గురౌతుండడం వల్ల, సముద్ర మట్టం పెరుగుతూండడం వల్ల అడవులు క్రమేపి కనుమరుగవుతున్నాయి. పల్లపుప్రాంతాలలో వచ్చే వరదలు, నేలలో పెరుగుతున్న ఆలీకరణ అక్కడి ప్రజల జీవనోపాధిని, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
‘ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర కెరటాలు, తరచుగా వచ్చే తుపానులు, వాతావరణంలో సంభవించే మార్పులు మా జీవితాలపై, వృత్తులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈవాళ మేం వల వేసి పట్టుకుందామంటే ఒక్క చేప కూడా దొరకడం లేదు గనుక మాలో చాలామంది వేరే వృత్తులని ఆశ్రయించాల్సి వస్తోంది’ అని సుందర్బన్ ప్రాంత వాసులు చెబుతుంటారు. ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో జనం కోల్‌కత తదితర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఇలా వలసపోయే ‘వాతావరణ శరణార్థులు’ నగరాల్లో కూలీలుగా పనులు చేసుకుంటున్నారు.
ఇటీవల జరిపిన అధ్యయనం మేరకు తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నందున గత నాలుగేళ్ళలో నాలుగు శాతం అనగా 9,990 హెక్టార్ల వరకూ సుందర్బన్ అడవులు కనుమరుగైపోయాయి. వంద దీవులలో విస్తరించి ఉన్న ఈ అడవులలో కొన్ని దీవులు నీట మునిగిపోయాయి. సముద్ర మట్టం పెరగడంతో చాలా ప్రాంతాల నుండి జనాలు వేరే చోటికి వలస వెళ్లిపోతున్నారు. ‘సుందర్బన్ అడవులలో సగటున ఏడాదికి 200 మీటర్ల వరకు తీర ప్రాంతం కోతకు గురౌతోంది. పర్యావరణంలో మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ అడవులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సంజయ్ గుప్తా సూచిస్తున్నారు. 2015లో ఒక ఆర్థిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం- సుందర్బన్ అడవులు నశిస్తున్నందున ఏడాదికి 170 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇక్కడ పర్యావరణ విధ్వంసంలో మానవ ప్రమేయం లేకపోలేదు. అక్రమ కట్టడాలు, ఇటుకల తయారీ కోసం స్థలాల దురాక్రమణ, రొయ్యల పెంపకం కోసం చెరువులు తవ్వేయడం వంటివి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. 2014 డిసెంబర్‌లో ఒక ఆయిల్ టాంకర్ సముద్రంలో మునిగిపోవడంతో వందలాది లీటర్ల ఫర్నెస్ ఆయిల్ నీటిపాలైంది. దీంతో 250 చదరపు కిలోమీటర్లకు పైగా సముద్ర జలాలు కలుషితమయ్యాయి. ‘సుందర్బన్ అడవులు ఎంతో ప్రాచీనమైనవి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు. అడవులను రక్షించుకునేందుకు యుద్ధ ప్రాతిపదికమీద చర్యలను చేపట్టాలి. లేకపోతే చాలా తొందర్లోనే ఈ అడవులు కనుమరుగైపోతాయి’’ అని ప్రముఖ పర్యావరణ నిపుణుడు డాక్టర్ జయంత బసు హెచ్చరిస్తున్నారు.

- దుగ్గిరాల రాజకిశోర్