సబ్ ఫీచర్

క్రమశిక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్‌పైన ఐదారు యాక్సిడెంట్స్ అవుతాయి. అదే సిలిసినాటి నుంచి ప్రిన్స్‌బర్గ్ వరకు కారులో ప్రయాణం చేశాను. ఆ దారిలో యాక్సిడెంట్లు అంతగా కావు. ఆ రోడ్డుపై కారు 120నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మన జాతీయ రహదారి రోడ్డులాగే అమెరికాలో కూడా అంతే వెడల్పు రోడ్లున్నాయి. నివాస స్థలాల మధ్యనుంచి అక్కడ రోడ్లుండవు. దాన్ని చూసి మన దగ్గర కూడా నివాస స్థలాల మధ్య నుంచి రోడ్లు లేకుండా చేయాలి. అమెరికాలో యాక్సిడెంట్లు కాకపోవటానికి, మనదగ్గర యాక్సిడెంట్లు కావటానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ జీవన శైలిలోనే మార్పు ఉంది. మనదగ్గర సిగ్నల్స్ దగ్గర అడ్డదిడ్డంగా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నారు. అమెరికాలో నిర్దేశించిన వేగాన్ని మించి వేగంగా పోరు. సిగ్నల్స్ ఉన్నప్పుడు అక్కడ ఎవ్వరూ రోడ్‌క్రాస్ చేయరు. చివరకు పశువులు కూడా రోడ్‌క్రాస్ చేయవు. అదే మనకు వారికి తేడా. అక్కడి పౌరులు, డ్రైవర్లు అందరుకూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటారు. అనగా యాక్సిడెంట్లు కారు వేగంలో లేవు. మనుషుల శిక్షణలో ఉన్నాయి. అదే మాదిరిగా ఫిన్లాండ్, సౌత్‌కొరియాలో చదువుకున్న విద్యార్థులు సైన్స్‌లో పరిశోధనల్లో నూతన ఆవిష్కరణలను ఆవిష్కరిస్తున్నారు. మన దేశంలో కొందరు అంతస్తులు ఎక్కుతున్నారు. మరికొందరు ఒక స్థాయిలోనే ఆగిపోతున్నారు. ఎందుకు? మనుషుల శిక్షణలోనే తేడా ఉంది. ఉపాధ్యాయుల శిక్షణలోనూ తేడా ఉంది. విద్యార్థుల నేపథ్యంలోనూ తేడా ఉంది. అందుకే తరగతి గదిలోకూడా అంతస్తులు ఏర్పడుతున్నాయి. పుట్టుకతో ఎవరికీ ప్రమాణాలు రావు. నేపథ్యాల నుంచి అంతస్తుల కొలమానాలనుంచి ప్రమాణాలను గడించటం వ్యవస్థకు ప్రమాదం. టీచర్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఆధీనంలో పకడ్బందీగా నిర్వహిస్తారు. మనం అక్కడే సరిగ్గా వ్యవహరించలేక పోతున్నాం. బి.ఇడి., కాలేజీలకు వెళితే మన దగ్గర పలురకాల చదువులున్నాయి. ఏంకావాలి? అని అడుగుతున్నారు. కాలేజీకి రాకుండా సర్ట్ఫికెట్ కావాలా? క్లాసుకు రాకుండా పరీక్షలు రాస్తారా? ఇలా ఉపాధ్యాయ చదువులోనే అంతస్తులుంటే అంతకంటే దారుణమైనది మరొకటి ఉండదు.
సామాజిక ఆర్థిక అంతస్తులు పిల్లల్లో ఉన్నంతవరకు విద్యాప్రమాణాల్లో కూడా స్పష్టంగా అంతస్తులు ఏర్పడతాయి. దీన్ని సరిచేసుకోకుండా మన విద్యలో ప్రమాణాలు రావు. అపుడు మాత్రమే అందరూ పరిశోధకులవుతారు. సమత్వం అన్నది ప్రజలనుంచి రావాలి. పరిసరాల్లోపల ఉండే పరిస్థితి ఫలితాల్లో కనపడుతూ ఉంటుంది. రోడ్డు వెడల్పుచేయటంకన్నా, కార్లవేగం కన్నా, డ్రైవర్ల శిక్షణ, పౌర సమాజానికావల్సిన జీవన శైలి మారనంతవరకు ఈ ప్రమాదాలు తప్పవు. ఈ రెంటిని మార్చుకుంటేనే మారుతున్న, సమాజం వేగంలో ఇమడగలుగుతాం. రోగం ఎక్కడున్నదో నొప్పి ఎక్కడుందో అక్కడే మందుపెట్టాలి. అనుకరణలతో ప్రమాణాలు రావు.
మనదేశంలో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లు శిక్షణ పొందినవారైనా మద్యం సేవించి నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయ. యువకు లు, విద్యావంతులు, మహిళలతో సహా చాలా మంది మద్యం సేవించి యదేచ్ఛగా వాహనాలను నడుపుతున్నారు. మారిన జీవనశైలి, విపరీతంగా డబ్బు చేతిలో ఉండటం, బాధ్యతారాహిత్యం వెరసి విద్యావంతులైనప్పటికీ మద్యానికి బానిసలు కావడానికి దోహదం చేస్తున్నాయ. ఇంతటి విచ్చల విడితనం రాజ్యమేలుతుంటే క్రమశిక్షణ ఏవిధంగా వస్తుంది? అందువల్లనే పాఠశాలస్థాయ నుంచే విద్యార్థుల్లో జీవనశైలి అంశాలపై కూడా బోధిం చాలి. దీనిపై అవగాహన ఏర్పరచుకున్న పిల్లలు దారితప్పరు. క్రమశిక్షణతో మెలుగుతారు.

- చుక్కా రామయ్య