సబ్ ఫీచర్

అవగాహనతో వ్యాధులపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా మనుషులకు వచ్చే వ్యాధుల్లో రెండు రకాలు. వంశ పారంపర్యంగా సంక్రమించేవి కొన్ని రోగాలైతే, మన నిర్లక్ష్యం కారణంగా అనుకోని రీతిలో వచ్చే వ్యాధులు కొన్ని అని చెప్పుకోవాలి. మానవాళిలో దాదాపు పది శాతం మంది వరకూ తక్కువ స్థాయిలో సంక్రమించినా కొన్ని వ్యాధులు- చికిత్స లేని అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన అరుదైన వ్యాధులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు తలసేమియా, ప్రోజీరియా, ప్రాక్సిమల్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, డిస్లెక్సియా, క్పోసీ సర్కోమా, ఇంపర్ఫెక్టాసియా సిండ్రోమ్, క్రోన్ డిసీజ్, ఆస్టొజెనసిస్ ఇంపర్ఫెక్టా మొదలైనవి.
మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో పెనుమార్పులు, పోషక విలువలున్న ఆహారం అందకపోవడం, విశ్రాంతి లేని జీవన విధానం, ధూమపానం, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, యాంత్రిక జీవనం, మద్యపానం వంటివి అనేక రోగాలకు కారణాలవుతున్నాయి. గాలిలో సెల్‌ఫోన్ తరంగాలు, వాహనాలు, ఫ్యాక్టరీల ద్వారా వెలువడే వ్యర్థ వాయువులు వాతావరణాన్ని కాలుష్య భరితం చేస్తున్నాయి. దీంతో మానవులలో నిగూఢంగా ఉండే క్యాన్సర్ కణాలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. ఫలితంగా జన్యువులలో భారీ మార్పులు సంభవించి, దాదాపు వంద రకాలైన క్యాన్సర్ల బారిన పడేలా మనకుమనమే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం.
ప్రపంచవ్యాప్తంగా సంభవించే క్యాన్సర్లలో మొదటిస్థానంలో సర్వైకల్ క్యాన్సర్ 93 శాతం వరకూ ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ 70 శాతం, నోరు-గొంతు క్యాన్సర్స్ 63 శాతం, ఈసోఫాగల్ క్యాన్సర్ 59 శాతం, కొలొరెక్టల్ క్యాన్సర్ 50 శాతం, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ 33 శాతం, చర్మ సంబంధిత క్యాన్సర్ 80 శాతంగా నమోదవుతున్నది. వేసవి కాలంలో చర్మ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలానుగుణంగా కనిపించే వ్యాధుల పట్ల అప్రమత్తతతో వ్యవహరిస్తూ సకాలంలో వైద్యచికిత్స పొందడం అవసరం.
రోగపీడితుల పట్ల ఇతరులు సహజంగా సానుభూతి చూపుతుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారికి ఇలాంటి సానుభూతి మాటలు ఎలాంటి ఉపశమనం కలిగించవు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసింది స్వయంగా వ్యాధిగ్రస్తులే కాబట్టి రోగాల పట్ల స్వీయ అవగాహన అనేది తప్పనిసరి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడినపుడు రోగులకు వైద్యంతో పాటు సాంత్వన కలిగేలా ఇతరులు సహకరించాలి. వ్యాధులు రాకుండా ముందు నుంచి తగిన ఆహార సూత్రాలు, ఆరోగ్య పద్ధతులు పాటించాలి. పాలకూర, లెట్యూస్, బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటా, గుడ్లు, చేపలు, ఆకుకూరలు మొదలైనవి తరచూ తీసుకోవాలి. శరీరంలో నిరంతరం అన్ని జీవక్రియలు నిర్విఘ్నంగా జరగాలంటే రోజూ కనీసం 3 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి. కాబట్టి సాధ్యమైనంత పరిశుభ్రమైన నీటిని తాగాలి.
ప్రపంచ దేశాలలో లేని చికిత్సా విధానాలు అనాదిగా మన దేశంలో ఎంతో ఆదరణ పొందాయి. వ్యాధి అరుదైనది అయినా, దీర్ఘకాలికమైనా రోగపీడితులు మానసిక ధైర్యంతో తగిన చికిత్సా విధానాన్ని ఆచరించాలి. మన శరీరతత్వంపై మనమే తగిన అవగాహన పెంచుకోవాలి. కొన్ని రకాల అరుదైన వ్యాధుల అంతానికి వేల మంది వైద్య నిపుణులు దేశదేశాల్లో నిరంతర పరిశోధనలు జరుపుతున్నారు. దశాబ్దాల క్రితంతో పోల్చి చూస్తే ఇపుడు చికిత్సల విషయంలో భారీమార్పులు వచ్చాయి. ప్రతి సమస్యకు ఏదోఒక పరిష్కారం ఉంటుంది. అవగాహనే పరిష్కారానికి దారి చూపగలదనే విశ్వాసంతో ముందుకు నడవాలి. మనం అందించే మనోధైర్యం రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

- సూరం అనిల్