సబ్ ఫీచర్

తెలుగుకు ఉన్నతస్థాయి ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ అని మన తెలుగు భాష మాధుర్యాన్ని పొగడుతుంటారు. ఇటాలియన్ భాష చాలా శ్రవణానందంగా ఉంటుందని యూరోపియన్ భాషలతో కాస్త ఎక్కువ పరిచయం ఉన్నవారు అంటారు. తెలుగు భాషకి ఆ మాటకివస్తే భారతీయ భాషలకీ, యూరోపియన్ భాషలకీ పోలికేమిటి? యూరప్‌లో అన్నీ భాష ఆధారంగా రూపొందిన రా జ్యాలు, భాషల ఆధారంగా ఏర్పడిన భిన్నమైన జాతులు, రా ష్ట్రాలు ఉన్నాయి. ‘యూరోపియన్ జాతీయత’ అని ఏమీలేదు. ఆ దేశాలన్నింటినీ కలుపగలిగే పురాతన భాష ‘లేటిన్’ ఉండేది. అన్ని దేశాల వారూ కలసి ఆ భాషను తుడిచిపెట్టేశారు. అందుకు భి న్నంగా భారత్ విలసిల్లుతోంది. అందర్నీ కలిపి ఉంచే అతి పురాతన భాష సంస్కృతం అనే సూత్రంతో ఈ భాషలన్నీ వికసిస్తూ వచ్చాయి. భారతీయ భాషలు సంస్కృత సాహిత్యం వల్ల వికసిస్తూ వచ్చాయి. యూరోపియన్ సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలో సంస్కృతం ‘మృతభాష’గా మారింది. బ్రిటన్ భారత్‌ను పాలిస్తున్న సమయంలో మనల్ని తగ్గించి మాట్లాడే ప్రయత్నం చేసింది. సంస్కృత భాషను మృతభాషయని ప్రచారం చేసి మనస్ఫూర్తి కేంద్రాన్ని మన మన్ఫఃలకాల్నించి తొలగించ ప్రయత్నించింది.
మనకు అతి పురాతనమైన సంస్కృత భాషతో పాటు ఎన్నో శతాబ్దాల చరిత్రగల ఇతర భాషలున్నాయి. సంస్కృతంతోబాటు ఉండే పాలీ, బ్రాహ్మీ వంటి ప్రాకృత భాషలుండగా ఇక్కడ పుట్టి వికసించిన పైశాచిక భాషలు అనేకమున్నాయి. క్రీ.పూ. 2,3 శతాబ్దాలలో తెలుగు భాష వాడబడినట్లు జాడలున్నాయని చరిత్రకారులు చెబుతుంటారు.
క్రీ.శ. 2వ శతాబ్దంలో హాలుడి పాలనలో గుణాఢ్యుడనే పండితుడు రాజాస్థానంలో శర్వవర్మతో వివాదపడి ఆ స్థానాన్ని వదలి అడవులకు పోయి అక్కడ ఆటవికులు వాడుతూండే పైశాచిక భాషలో భూర్జపత్రాలపై గ్రంథాలు వ్రాసేవాడని తెలుస్తోంది. బహుశః తెలుగు భాషకి లిపి అతనితోనే ఆరంభమై ఉండవచ్చు. తెలుగులో ఉత్తమ గ్రంథాలు పదియవ శతాబ్దంలో నన్నయ మహాభారతం నుండి వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’ అనడం కంటే ‘ఇటాలియన్ భాషను తెలుగు ఆఫ్ యూరోప్’ అనడం సముచితం. ఏది ఏమైనా మన భాషను తిరిగి అందరికీ నేర్పి వికసింపజేసినప్పటి మాట. తెలుగులో మనం సృష్టించిన సాహిత్యపు విలువలు, వినడానికి ఆహ్లాదాన్ని కలిగించే సొంపులు దేశంలోను, ఖండాంతరాలలోను విస్తరించి పరభాషీయులను ఆకర్షించగా- వారు అనవలసిన మాట.
మన తెలుగు అచ్చ తెలుగుగా, సంస్కృత భూయిష్టమయిన తెలుగుగా, గ్రాంథిక భాషగా, శిష్టవ్యవహారిక భాషగా, పత్రికలలో మాధ్యమంగా, వేర్వేరు ప్రాంతాలలో అక్కడి మాండలికాల్ని ఇముడ్చుకొని విలసిల్లుతున్న భాషగా వివిధ రూపాలలో ఉన్నా తెలుగు తెలుగే. వైవిధ్యాలను అంగీకరిద్దాం. మన భాషలోని సొగసులను గర్వంతో ఆస్వాదిద్దాం. ఇతర భాషలవారు తెలుగులోని సాహితీ విలువలను గ్రహించి తమ భాషలలోనికి అనువదించుకోవాలనే ఉత్సాహాన్ని చూపినపుడు ఇటాలియన్ భాషయే కాదు. మరిన్ని భాషలను తెలుగు ఆఫ్ ది యూరప్ అని గాని, తెలుగు ఆఫ్ ది గ్లోబ్ అని చెప్పడానికి గర్విస్తారు. ఆ ఉచ్ఛదశ తెలుగుకి ఎవరు కల్పిస్తారు? మనమే కల్పించాలి.

- ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం