సబ్ ఫీచర్

రామమందిర సమస్య అయోధ్య ప్రజలది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలో దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న ‘రామమందిరం సమస్య’ కేవలం అక్కడి ప్రజలదే గానీ, కోర్టులది కాదు. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. నిజానికి అయోధ్య అన్నది ‘రామజన్మభూమి’ అని పురాణాలు, చారిత్రక ఆధారాలు ఘోషిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది ప్రతి హిందువు మనోభీష్టం. అయితే, రామమందిర స్థలాన్ని వివాదాస్పదం చేసి న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ సమస్య మరింత జటిలం అయింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇది ఆచరణ సాధ్యం కాదు.
అయోధ్యలో రాముడిని కొలిచేది రామభక్తులు మాత్రమే! కోర్టులు దేవుడ్ని కొలవవు. కాబట్టి ఈ సమస్యను అయోధ్యలోని ప్రజలే తేల్చుకోవాలి. రామమందిర స్థలానికి, వక్ఫ్‌బోర్డుకు ఏ మాత్రం సంబంధం లేదు. రాముడిని కొలిచేవారు ఏ మతం వారైనా సరే దైవంతో సంబంధాన్ని కొనసాగించవచ్చు. కోర్టులు గానీ, వక్ఫ్‌బోర్డు గానీ ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం సరైంది కాదు. హిందువుల మనోభావాలను గుర్తించి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎలాంటి అవరోధాలు లేకుండా యుపి ప్రభుత్వం సహకరించాలి. ఎప్పటికైనా అయోధ్యలోని ప్రజలే సమస్యను చర్చించుకుని రామాలయ నిర్మాణం చేపడతారు. పురావస్తుశాఖ సర్వే ప్రకారం వివాదాస్పద స్థలంలో ఉన్న అలనాటి రామాలయాన్ని ధ్వంసం చేసి, బాబ్రీ మసీదును నిర్మించినట్టు, మసీదు పునాదుల కింద రామాలయం శిథిలాలు ఉన్నట్టు సర్వేలో తేటతెల్లమైంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు కూడా ఇందుకు చాలా విశదంగా వుంది. ఈ నిదర్శనాలు చాలు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అయోధ్య ప్రజలు రామాలయం నిర్మాణం చేపట్టే తరుణం ఆసన్నమైంది. అభిమానమున్న దేశప్రజలు ఆర్థిక సాయం చేయవచ్చు. రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే హక్కు ఏ ఒక్కరికీ లేదని గ్రహించాలి.
తాజ్‌మహల్ ఒకనాటి శివాలయమా...?
ఆగ్రాలోని తాజ్‌మహల్ ఒకనాటి శివాలయమేనని ఈనాటికీ అక్కడి ఆధారాలు తెలుపుతున్నాయి. తాజ్‌మహల్ సందర్శకులు ఎవరైనా సరే అక్కడి సమాధి చుట్టూ తిరిగితే స్తంభాలపై ఏనుగు తొండము, కింద శివలింగాలున్న ఆధారాలు కనిపిస్తాయి. ఈ చారిత్రక ఆధారాల మేరకు అక్కడ శివాలయం ఉండేదని తెలుస్తుంది. అలనాటి ముస్లిం రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ చనిపోగా ఆమెపై వున్న ప్రేమకు చిహ్నంగా- అక్కడి శివాలయాన్ని ధ్వంసం చేసి భార్య సమాధిని నిర్మించినట్టు అక్కడి ఆధారాలు తెలుపుతున్నాయి. గనుక తాజ్‌మహల్ ఒకనాటి శివాలయమేనన్న వాదనలు ఉన్నాయి.

-జి.శ్రీనివాసులు