సబ్ ఫీచర్

మాల్దీవులు మాయమైపోతాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న దేశమైన ‘రిపబ్లిక్ ఆఫ్ మాల్టీవ్స్’ వెయ్యి కన్నా ఎక్కువ దీవుల సముదాయం. ఇది సముద్ర మట్టానికి ఒక మీటరు ఎత్తులో ఉంటుంది. సముద్రమట్టం నానాటికీ పెరుగుతుండడం వల్ల ఈ శతాబ్దం (2100) అంతానికి ఈ దీవులన్నీ కనుమరుగయ్యే ప్రమాదం వుంది. ఈలోగా అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. ఆకాశం నుండి చూస్తే ఉత్తర మాల్దీవులలోని ‘ఉతీము’ ద్వీపం హిందూ మహాసముద్రంలో తేలియాడుతున్న ‘జెల్లీఫిష్’లా కనిపిస్తుంది. మాల్టీవులలో ఈ ద్వీపం ప్రత్యేకమైంది. పరిశుభ్రంగా వుండే వీధులు, ఎప్పుడు కొత్తగా అందంగా కనిపించే ఇళ్లు,ప్రతి ఇంటి ముందు అందంగా అమర్చిన పూల కుండీలు.. ఇవన్నీ మూడున్నర లక్షల మాల్దీవ్ ప్రజలకు తమ సొంతగడ్డపై ఉన్న మమకారాన్ని తెలుపుతాయి.
ఈ దీవుల్లోని ప్రజలకు అక్కడి సముద్ర జలాలతో విడదీయరాని అనుబంధమేర్పడింది. తమ ఆహార సంపాదనకు సముద్రం మీదనే ఆధారపడతారు. వారి ఆర్థిక వ్యవస్థకు ఆధారం సాగర వనరులే. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో సముద్రమట్టం పెరగడం, తీర ప్రాంతాలు నిరంతరం కోతకు గురి కావడం వంటి పరిణామాలు మాల్టీవుల ప్రజల భవిష్యత్తును, దీవుల భౌగోళిక అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ నివాస యోగ్యమైన భూభాగం తక్కువే. గనుక ప్రజలు ఎక్కువగా తీర ప్రాంతాలలోనే తమ నివాస స్థావరాలను ఏర్పరుచుకున్నారు.
ఏ క్షణంలోనైనా సముద్రం ఉప్పెనగా విరుచుకుపడితే వారి జీవితం ప్రమాదంలోనే పడుతుంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని 2008లో అప్పటి మాల్టీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తమ ప్రజల పునరావాసం కోసం ఇతర దేశాలలో కొంత భూభాగాన్ని కొనే ప్రయత్నాలు చేసారు. ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చకముందే ఆయన పదవిని కోల్పోయారు. దున్యా ముమూన్ మాల్టీవుల ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి. భూ ఉపరితల వాతావరణంలో మార్పులు తమ దేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ఆమె వివరిస్తున్నారు. ‘సముద్రమట్టం పెరగడంతో చాలా చోట్ల భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారిపోయాయి. సముద్ర జలాల్లో మార్పులు మత్స్య సంపదకు నష్టం కలుగచేస్తున్నాయి. సముద్రగర్భంలో ఎన్నో పగడపు వనరులున్నాయి. వాటి విషయంలో కూడా మేం నష్టాన్ని ఎర్కొంటున్నాం. వాతావరణమే మా ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది’ అని అంటారామె. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలను అరికట్టడానికి, ప్రజల సురక్షిత జీవనాధారం కోసం తగు చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. తమ ప్రయత్నాలకు అగ్రరాజ్యాల సహకారం లేకుంటే ఏమీ సాధించలేమన్నారు.
ఇషా మాల్టీవులకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని. ‘మేం సముద్రం మీదనే పెరిగాం. భూగోళంపై పర్యావరణ సంబంధిత విపరిణామాలు మేం భవిష్యత్తులో సముద్రగర్భంలో కలిసిపోతామని సంకేతాలిస్తున్నాయి. ప్రపంచ పటం నుంచి మేం కనుమరుగైపోవాలని మిగతా దేశాలవారు అనుకుంటున్నారా? ఇది పర్యావరణ సమస్య మాత్రమే కాదు. మా అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న కూడా. ఎవరికీ మాపై తగిన శ్రద్ధ లేదు. మమ్మల్ని కాపాడే బాధ్యత ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలదీనూ’ అని ఇషా అంటోంది. తమ జీవనాధారంగా ఉన్న సముద్రమే భవిష్యత్తులో మాల్టీవుల ప్రజలకు పరమ శత్రువు అవుతోంది..!

-దుగ్గిరాల రాజకిశోర్