సబ్ ఫీచర్

పాలన గాడి తప్పితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యు పి, ఉత్తరాఖండ్‌ల్లో భాజపా అఖండ విజయం సాధించడంతో దేశ రాజకీయాల్లో తమకు ఇక ఎదురే లేదని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు. యుపి, ఉత్తరాఖండ్‌ల్లో అద్భుత విజయానికి వారి పనితనం ఎంత కారణమో, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకత కూడా అంతే కారణమన్న విషయాన్ని భాజపా నేతలు విస్మరించరాదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పాలక పక్షాలను ప్రజలు ముక్తకంఠంతో తిరస్కరించారు. భాజపాను విజయపథంలో నడిపిస్తున్న మోదీ-షా ద్వయం ఈ సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం వుంది.
ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఘన విజయానికి అధికార సమాజ్‌వాదీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణం. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ తన కుటుంబంలో ఆధిపత్య పోరును నిరోధించడంలో ఘోరంగా విఫలమయ్యారు. తమ కుటుంబ సమస్యను ప్రజల సమస్యగా మార్చడానికి ఆయన ప్రయత్నించారు. తాము ఏమిచేసినా ప్రజలు ఆదరిస్తారనే భావనతో ఉన్న ఆయనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోయి, రాచరికపు పోకడలు పోయినందుకే సమాజ్‌వాదీ దెబ్బతింది. అదే సమయంలో మోదీ-షా ద్వయం నడిపిన యంత్రాంగం, మంత్రాంగం చక్కగా పనిచేయడంతో బిజెపి దూకుడు కొనసాగింది.
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఒండెత్తు పోకడలు భరించలేక పలువురు సీనియర్ నాయకులు పార్టీని వదిలివేశారు. పాలనాపరమైన అంశాల కన్నా, తన పదవిని కాపాడుకోవడానికే రావత్ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఉత్తరాఖండ్‌లో పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలకపక్షంపై తమ అసంతృప్తిని ప్రజలు ఓట్ల రూపంలో చూపించారు. బిజెపి ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ కూడా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనను చూసి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో జనం తీర్పు ఇవ్వలేదు. అదే నిజమైతే పంజాబ్‌లో బిజెపి-అకాలీదళ్ కూటమి ఘోరంగా ఓడిపోవడం, గోవాలో ‘చావుతప్పి’ కన్ను లొట్టపోయినట్లుగా గెలుపొందటం జరగదు.
2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రధాని మోదీ పనితీరు ఏ విధంగా ఉందని బేరీజు వేసుకుని ఓటుద్వారా తీర్పు ఇస్తారు. పాలనలో విఫలమైతే ఎంతటివారికైనా జనం నుంచి వ్యతిరేకత తప్పదని గతంలో పలుసార్లు రుజువైంది. వచ్చే సంవత్సరం గుజరాత్, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ ‘ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత’ ప్రభావం చూపే అవకాశం ఉంది. కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజల నుంచి నిరసన సెగలు తప్పవని భాజపా నేతలు అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురుకాకుండా భాజపా వారు జాగ్రత్త పడాల్సి ఉంది. ఒకవేళ గుజరాత్‌లో బిజెపి ఓటమి చెందితే- అది ‘ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత’ అని భావించాల్సి ఉంటుంది. కాగా, మరోవైపు పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు ఇప్పటికీ తీరలేదు. దేశ రాజకీయాలలో తమకు ఇక తిరుగులేదని ఏ రాజకీయ పార్టీ కూడా భావించరాదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏర్పడకుండా అధికార పార్టీ వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకుంటే చేదు పరిణామాలు తప్పవు.

- పి.మస్తాన్‌రావు