సబ్ ఫీచర్

జాతి ఐక్యతకు ‘కోటా’తో బీటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగం ఆర్టికల్ 17, 18 ప్రకారం దళితులు, గిరిజనులు విద్యా-ఉద్యోగ-సామాజిక-రాజకీయ రంగాల్లో ఎదుర్కొంటున్న అసమానతలను అంతం చేయడానికి, అంటరానితనాన్ని అరికట్టడానికి ‘రిజర్వేషన్ల’ను చట్టబద్ధం చేశారు. లక్ష్యిత గడువుతో, పునస్సమీక్షలకు అనువుగా అలనాటి రాజ్యాంగ నిపుణులు చట్టాన్ని రూపొందించారు. ప్రతి పదేళ్లకోసారి సమీక్షించి అవసరమైతే రిజర్వేషన్లను ఉపసంహరించేలా చర్యలు చేపట్టవచ్చని ఆర్టికల్ 17లో పేర్కొన్నారు. కాలక్రమంలో రిజర్వేషన్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని, అన్ని పార్టీలకు ‘ఓటుబ్యాంకు’గా మారింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు లక్ష్మణరేఖను దాటిపోతున్నాయని భారత అత్యున్నత న్యాయస్థానం 1992లోనే ప్రత్యేక రూలింగ్ ఇచ్చింది. విద్య, ఉద్యోగాలలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని, ఇలా చేస్తే సమాజంలో మిగతా వర్గాలు నైరాశ్యానికి లోనవుతారని సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించింది. రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో 50 శాతానికి మించిన రిజర్వేషన్లను సాధ్యమైతే కుదించుకోవాలని, లేని పక్షంలో అదనపు పెంపుదలను అనుమతించేది లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఈ పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో పాలకులకు మింగుడుపడని అంశమనే చెప్పవచ్చు. రాష్ట్రాల్లో మితిమీరిన ప్రాంతీయ తత్వాన్ని ఈ రూలింగ్ నిలువరించిందని అప్పటి రాజ్యాంగ నిపుణుల విశే్లషణ.
ఆర్టికల్ 46 ప్రకారం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ఆర్థిక సామాజిక అభివృద్ధి, వెనుకబాటుతనం అనే ప్రాతిపదికపైనే రిజర్వేషన్ల పెంపు, కుదింపు ఉండాలని భారతీయ రాజగ్రంథం విశదీకరించింది. అంతకు మించి ఈ అధికరణలో వేరే నిర్వచనాలు లేవు. సుప్రీం కోర్టు ఆదేశించినట్లు 50 శాతం వరకే రిజర్వేషన్లు అమలు జరగాలి. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల డిమాండ్లు ఇపుడు రాజకీయ ఉద్యమాలకు ఊపిరి పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల చిక్కుముడిని విప్పేందుకు ప్రస్తుతం అక్కడి పాలకులు తెగ కసరత్తు చేస్తున్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటే వారి ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రత్యేక అధ్యయనం చేయాల్సి ఉంది. ఆ తర్వాత బీసీ కులాలల్లోని మిగతా వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరిగాక, 50 శాతానికి లోబడి రిజిర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్రం ఒప్పుకున్నా, సుప్రీం రూలింగ్ ప్రతిబంధకంగా మారే అవకాశం లేకపోలేదు.
ఇక, తెలంగాణలో రిజర్వేషన్లను పూర్తిగా ఓటుబ్యాంకు రాజకీయంగా మార్చినట్టు నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయించి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీర్మానం ఆమోదింప జేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వికలాంగులకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలులో ఉన్నాయి. ముస్లిం మైనార్టీలకు సంబంధించి విద్య, ఉద్యోగాల్లో ఇప్పటికే 4 శాతం కోటా అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు మతం పేరుతో కాకుండా బీసీ-ఇ కేటగిరీగా పరిగణించాలని బిసి కమిషన్ ద్వారా ప్రత్యేక అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆర్టికల్ 46 ప్రకారం మతం పేరుతో రిజర్వేషన్లు చెల్లవని మిగతా రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే వాదన స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కూడా బలంగా ఉంది.
భారతదేశం 1956 నాటికి ‘సర్వసత్తాక గణతంత్ర రా జ్యం’గా ఏర్పడే నాటికే అనేక సామాజిక రుగ్మతలతో సతమతమవుతుండేదని చరిత్ర చెబుతోంది. చాలా ప్రాంతాల్లో అంటరానితనం అనే సామాజిక రుగ్మత కనిపించేది. మన దేశంలో పురాణ కాలం నాడే ‘చాతుర్వర్ణ సిద్ధాంతం’ బహుళ ప్రాచుర్యం పొందింది. క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, శూద్ర కులాలు అనే చాతుర్వర్ణాల జాతులు అమలులో ఉన్నాయి. శూద్రులు అనబడేవారంతా మిగతా కులాల నుంచి వివక్షను ఎదుర్కొంటూ అభివృద్ధికి దూరంగా ఉండేవారు. 1800 శతాబ్దం నాటికి ఈ కులవ్యవస్థ అనేక రకాలుగా రూపాంతరాలు చెందుతూ ‘వృత్తి కులాలు’గా మారిపోయాయని చరిత్ర చెబుతోంది. 1891లో కొల్హాపూర్ మహారాజు సాహు బ్రాహ్మణేతరులు, వెనుకబడిన కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారట. 1901 నాటికి ఈ రిజర్వేషన్లను (50 శాతం మేరకు) వెనుకబడిన కులాల (పూర్వపు శూద్రజాతికి)కు కేటాయించారట. 1932లో బ్రిటిష్ ప్రధాని రాంసే మెక్ డొనాల్డ్ ప్రతిపాదన మేరకు భారత్‌లో అణగారిన వర్గాలవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. కొన్ని రిజర్వుడు నియోజకవర్గాల్లో దళితులు పోటీ చేసే విధంగా, వారికి కేవలం దళిత ఓటర్లే ఓట్లేయాలని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని నిరసిస్తూ మహాత్మాగాంధీ నిరాహార దీక్షకుదిగారు. ఈ నిర్ణయాన్ని అంబేద్కర్ స్వాగతించడంతో భారత స్వాతంత్ర ఉద్యమకారుల్లో చీలిక వచ్చినట్టు ఆనాటి చరిత్ర చెబుతోంది. చివరగా దీన్ని కేవలం దళిత, గిరిజనులకే కాకుండా మూల వాసుల అనే పదం చేర్చే విధంగా గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూణాలో ఒప్పందం జరిగిందట. దీనే్న ‘పూణా ఒడంబడిక’ అంటారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులను రాజకీయ రిజర్వేషన్ల నుంచి దూరం వుంచినట్టు ఆ ఒడంబడిక విశదీకరిస్తుంది. స్వాతంత్రోద్యమ కాలం నాటికి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవనే చెప్పవచ్చు.
సుమారు గత ఆరు దశాబ్దాలుగా దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఆర్టికల్ 17 ప్రకారం కాలానుగుణంగా వీటి అమలుపై సమీక్షలు జరగాలి. జీవన ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్ల కుదింపు, పెంపుదల జరగాల్సి ఉంది. కానీ, రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వీటిని పునస్సమీక్షించిన పరిస్థితులు లేవు. వెనుకబడిన తరగతులకు మండల్ కమిషన్ ఆధారంగా కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లు- ‘50 శాతానికి పైగా ఉన్న జనాభా’కు సరిపడడం లేదన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అగ్రవర్ణాల పేదల పేరుతో ఈబీసి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ కూడా ఇటీవల తెరపైకి వచ్చింది. అత్యధిక కాలం రాజ్యం చేసిన కాంగ్రెస్ ప్రాంతీయ సమీకరణలను రెచ్చగొట్టి రిజర్వేషన్లను పెంపుదల చేసిందనే విమర్శలున్నాయి.
మతపరమైన వెనుకబాటు తనం పేరుతో క్రైస్తవులు, ము స్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం చర్చనీయాంశంగా మారుతోంది. 2012 యుపి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ముస్లింలకు 13.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. 1992 నాటి సుప్రీం రూలింగ్ ప్రకారం అక్కడ రిజర్వేషన్లు కోటా అప్పటికే 50 శాతం దాటిపోయింది. అదనపురిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టసవరణ జరగాలి. దానికి కేంద్రం అంగీకరించాలి. ఇటీవల యుపి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడడంతో ముస్లిం రిజర్వేషన్ల హామీ మూలనపడినట్లే. సాధ్యాసాధ్యాలను బేరీజు వేయకుండా హామీ ఇస్తే కేసిఆర్‌కు కూడా సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి ఎదురవుతుందని విశే్లషణలు వినిపిస్తున్నాయి. కర్నాటకలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అక్కడ కూడా ‘వెనుకబాటు తనం’ అనే పదం కన్నా ‘ముస్లిం రిజర్వేషన్లు’ అని పేర్కొనడం మిగతా మతాల ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తున్నట్టు వుందని రాజకీయ పండితుల విశే్లషణ
ఇక, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తుతం ఇస్తున్న హామీలు ఎన్నికల సంవత్సరాన్ని తలపిస్తున్నాయి. సాధ్యం కాని హామీలతో ఇప్పటికే తలపట్టుకుంటున్న ఆయన 2019 దాటితే దొర ఎవడో? దొంగ ఎవడో? అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి వర్గానికి దగ్గర కావాలని బిసీలు, ముస్లింలు, దళితులు, గిరిజనులు.. ఇలా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు పెంచేస్తానని హామీలు ఇవ్వడం మిగతా వర్గాలను నైరాశ్యానికి గురి చేస్తోంది. రిజర్వేషన్లు పెంచుతానని ఆయన హామీ ఇచ్చినా అది ఆచరణ సాధ్యం కాదు. అందుకు కారణం- బీసీలకు 25 శాతం, ఎస్సీ-15, ఎస్టీ-6, వికలాంగులు-3, మాజీ సైనికులు-1.. అన్నీ కలిపి 50 శాతం. ఇక అన్ని కేటగిరీల్లో మహిళా రిజర్వేషన్లు 33.3 శాతం. మిగిలింది రిజర్వేషన్ లేని పురుషుల విభాగానికి 16.6 శాతం అన్నమాట.
కెసిఆర్ హామీ ఇస్తున్నట్టు ముస్లింకు 12 శాతం, ఎస్టీ ఎస్సీలకు మరో 4 శాతం అదనం అనుకున్నా మొత్తం 16 శాతం ఓసి కేటగిరి నుంచి తొలగించి వీరికి కేటాయించాల్సి ఉంటుంది. అంటే మెరిట్ కోటా లేనట్లే భావించాలి. తెలంగాణలో అంతర్యుద్ధానికి దారితీసే ఈ అంశం పట్ల శ్రద్ధ చూపడానికి బదులు కేసిఆర్ ఓటుబ్యాంకు రాజకీయాల వైపే చూస్తున్నారు. ఒకవేళ బీసీ కులాలకు కోత విధించి ముస్లింలు, దళితుల, గిరిజనుల కోటా పెంచితే ఆయా వర్గాల్లో మరింత అశాంతి చవి చూడక తప్పదు. మొత్తానికి కేసిఆర్ రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపాడు. తేనిటీగల దాడిలో ఆయన అజేయంగా బయటపడతాడా? లేక అఖిలేష్ యాదవ్ తరహాలో బోల్తాకొడతా డో కాలమే నిర్ణయించాలి.

-శివకేశవ్ అముక