సబ్ ఫీచర్

ఉపాధి పథకాలతో ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ‘ఆర్థిక సర్వే 2016-17’ సార్వత్రిక మూల ఆదాయాన్ని ప్రతిపాదించినది. ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో పేదరికం, నిరుద్యోగం ముఖ్యమైనవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దాదాపు 20 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. శ్రామిక శక్తిలో 10 శాతం నిరుద్యోగం, అల్ప ఉద్యోగితకు గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం దారిద్య్ర నిర్మూలనకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమాలనన్నింటికీ బదులుగా ఒకే ఒక్క కార్యక్రమం ‘సార్వత్రిక మూల ఆదాయం’ (సామూఆ) అమలు పరిస్తే బాగుంటుందని ప్రభుత్వ ఆలోచన. ఈ నూతన కార్యక్రమం కింద ఎటువంటి వ్యత్యాసాలు, వివక్ష లేకుండా పనిచేయగల వారందరికీ కనీస ఆదాయం అందుబాటులో వుంటుంది. ఎటువంటి నిబంధనలు వుండవు. పేదల నిర్ణయాత్మక సామర్థ్యానికి తగు గుర్తింపు వుంటుంది. ఈ ప్రతిపాదనను సమర్థవంతంగా అమలుపరిస్తే పేదరికం, నిరుద్యోగితలను నిర్మూలించవచ్చు. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలు అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. ఎందుకంటే, సమాజంలో కనీస ఆదాయానికి ‘సామూఆ’ ఒక హామీ. అంతేకాదు, శ్రామికులలో బేరమాడే శక్తి పెరుగుతుంది. అనవసర నిబంధనలతో పనిచేయవలసిన అవసరం లేదు. కార్మికులు దోపిడీకి గురికారు. ఎటువంటి నిబంధనలు లేని నగదు బదిలీవల్ల అనేక ప్రయోజనాలు వున్నాయి. ముఖ్యంగా, మహిళలు తమ ఆదాయాలను ఏ విధంగా వాడుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. అంటే వారి నిర్ణయాత్మక శక్తి క్రియాశీలంగా మారుతుంది. ప్రస్తుతం పేద ప్రజలు జనధన్ ఖాతా, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు ద్వారా మెరుగైన రీతిలో బ్యాంకు సేవలను పొందుతున్నారు.
ఈ నూతన పథకం అమలులో అనేక ఇబ్బందులు వుండవచ్చు. పనిచేయకుండా డబ్బు ఇవ్వడాన్ని ఆర్థికవేత్తలు ఒప్పుకోరు. కొన్ని మార్పులతో ‘సామూఆ’ను అమలుపరచవచ్చు. ముందుగా ప్రభుత్వం ఉపాధి కల్పనపై దృష్టిపెట్టాలి. అన్ని రంగాల్లో ఉపాధి కల్పనా శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. దీనివల్ల కొన్ని ఆస్తులు (రోడ్ల నిర్మాణం, నీటి పారుదల ప్రాజెక్టులు మొదలైనవి) స్థానిక స్థాయిలో ఏర్పరచుకోవాలి. ఇలా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దీనివల్ల పేద ప్రజల ఉపాధి, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను సక్రమంగా అమలుపరిచినా నిరుద్యోగులు వుండవచ్చు. వీరికి ‘సామూఆ’ పథకం వర్తింపజేయవచ్చు.
గ్రామీణ వలసలను అరికట్టటం కూడా ముఖ్యమే. గ్రామాలే ఉపాధి, ఉత్పత్తి కేంద్రాలుగా మారాలి. పల్లెల్లో వౌలిక సౌకర్యాలు పెరిగినపుడు వలసలు వుండవు. ఈ విషయంలో మన వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించాలి. ఉత్పాదకత పెంచాలి. అధిక విలువగల వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. ఆహార శుద్ధి పరిశ్రమకు ప్రోత్సాహాలు వుండాలి. శ్రామిక శక్తిలో 55 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి వున్నారు. ప్రతి వ్యవసాయదారుడికి కొంత వ్యవసాయేతర ఆదాయం వుండాలి. కొత్త ప్రతిపాదన అమలు చేయడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బాగా పెంచాలి. నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించాలి. అప్పుడే ప్రభుత్వానికి ‘సామూఆ’ అమలుపరచే వీలుంటుంది. వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయడం కష్టం. ఉపాధి కల్పనను, పన్ను ఆదాయాన్ని పెంచితే ఈ పథకం అమలు సులభమవుతుంది. ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ పథకం, మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థను వెంటనే తీసివేయడం వాంఛనీయం కాదు.

-ఇమ్మానేని సత్యసుందరం