సబ్ ఫీచర్

ఉష్ణతాపం పెనుశాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెన్యా దేశానికి వాయువ్యాన వున్న ‘టర్కానా’లో వాతావరణం పొడిగా ఉంటూ కాలం నిడివి పెరుగుతోంది. వర్షాలు లేక ఇక్కడి ప్రజలకు నీటి ఎద్దడి పెనుసమస్యగా మారింది. వాతావరణం మార్పుల వల్ల పంటలు పండక టర్కానా ప్రజల్లో పేదరికం పెరగడం మరో విపరిణామం. ఆహారం, నీరు లభించక వీరు నానా అవస్థలు పడుతున్నారని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నివేదిక పేర్కొంది. ఇతర ప్రాంతాలకంటే టర్కానాలో ఉష్ణోగ్రత 2, 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంటుందనీ, సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ అని, దీంతో వర్షం పడడం అరుదుగా మారిందని పేర్కొన్నారు. ‘హ్యూమన్ రైట్స్ వాచ్’లో పరిశోధకుడు ఫె లిక్స్ హోర్న్ ఈ పరిణామాలపై ఆందోళన చెం దుతూ, ‘రానున్న కాలంలో టర్కానాలో ఆహార భద్రత జటిల సమస్యగా మారుతుంది, ఉష్ణోగ్రతలు పెరగడంతో జలవనరులు తరిగిపోయి కరవు భూతం కాటేస్తోంది, ఈ పరిస్థితులు ఇక్కడి ప్రజల జీవితాలనే నాశనం చేస్తోంది, ఐరాసకు చెందిన ‘ప్రపంచ ఆహార పథకం’, కెనడా చెందిన ‘్ఫడ్ గ్రెయిన్స్ బ్యాంక్’ వంటి సహాయ కార్యక్రమాలపై ఆధారపడాల్సి వస్తోంది’ అని అంటున్నారు.
టర్కానాలో తాండవిస్తున్న కరవు బీభత్సం జిబౌటి, ఇథియోపియా, సోమాలియా వంటి ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఈ ప్రాంత ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఐక్యరాజ్య సమితిలోని ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ నివేదిక ప్రకారం సోమాలియాతో 1.5 మిలియన్ ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇథియోపియాలో 7 మిలియన్ల మంది కరవు కోరల్లో చిక్కుకున్నారు. వీరికి ఆహారం అందించే కార్యక్రమాలను ఐరాస చేపడుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా సగటున ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉండడంతో ఇకపై పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటాయని వాతావరణ శాస్తవ్రేత్తలు అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలు ఎడారులుగా మారే వేగం పెరుగుతోందని ఫెలిక్స్ హోర్నె అంటున్నారు. విశ్వవ్యాప్తంగా పర్యావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దానికి భూ ఉపరితల ఉష్ణోగ్రత మరో 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.
‘గతంలో టర్కానా వంటి ప్రాంతాల్లో ఐదేళ్లకొకసారి మాత్రమే కరవు సంభవించేది. ఇప్పుడు ఎటుచూసినా దుర్భిక్షం తాండవిస్తోంది. సారవంతమైన నేలను కనుగొనడమే కష్టమైపోతోంది. తాగేందుకు నీరు లభించక ఆవులు, గొర్రెలు, మేకలు వంటి పశుసంతతి క్రమంగా అంతరించిపోతోంది. గతంలో ఇక్కడ ఒక్కో కుటుంబానికి వందల్లో ఆవులు, మేకలు ఉండేవి. ఇప్పుడు ఎవరి దగ్గరా రెండు మూడింటికి మించి లేవు. ఇప్పటికైనా సత్వర చర్యలు చేపట్టకపోతే మానవాళికే క్షమించరాని ద్రోహం చేసినవారం అవుతాం’ అని హోర్నె అంటున్నారు.యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌ఇపి)కి సారథ్యం వహిస్తున్న ఆచిమ్ స్టెయినర్- ‘ఏ మార్పులు తీసుకురావాలన్నా పాలకుల వల్లే సాధ్యం అవుతుంది. ఎవరూ వ్యక్తిగతంగా బాధ్యత వహించనంత కాలం కొంచెం కూడా మార్పు రాదు. మన బాధ్యతలకు అనుగుణంగా ఒక శాస్ర్తియమైన అంగీకారానికి రాగలమా? అన్నదే అసలు ప్రశ్న!’ అని అంటున్నారు. వివిధ దేశాధినేతలు పర్యావరణ ఒప్పందాల గురించి తరచూ చర్చలు జరుపుతూండవచ్చు. మరోవైపు- టర్కానా వంటి దుర్భిక్ష ప్రాంతాల ప్రజలు జీవించడానికి పోరాటం చేస్తున్నారు.

-దుగ్గిరాల రాజకిశోర్