సబ్ ఫీచర్

ప్రగతికి పట్టుగొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు విద్యావ్యవస్థ పారిశ్రామిక శక్తులతో రూపొందించబడింది. కానీ, ఈనాడు ఎన్నో శక్తులు ప్రభావితం చేయడంతో అదొక సంక్లిష్ట వ్యవస్తగా మారింది. అది ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. ఎంతోమంది అవసరాలను పూర్తిచేయవలసి ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, యజమానులు, వృత్తిపరమైన సంస్థలు, రాజకీయ నాయకులు ఎంతోమంది అవసరాలను, ఆశయాలను విద్యావ్యవస్థ ద్వారా పూర్తిచేయవలసి ఉంటుంది. ఈ వ్యవస్థలో వైవిధ్యాలు కనపడుతూ ఉంటాయి. ప్రస్తుత డిజిటల్ సాంకేతిక యుగంలో విద్యావ్యవస్థ గణనీయంగా ప్రభావితమవుతోంది. 2014లో ఏడు వందల కోట్లు బిలియన్ల నెట్‌వర్క్‌లుండేవి. 2015 వచ్చేసరికి అది రెట్టింపయ్యింది. 6 మిలియన్ల ఫేస్‌బుక్‌లొచ్చాయి. 2 మిలియన్ల గూగుల్స్ వచ్చాయి. 3 వేల ఫొటోలు అప్‌లోడ్స్ వచ్చాయి. ఒక లక్ష ట్వీట్స్ వచ్చాయి. 1.3 మిలియన్ వీడియోలొచ్చాయి. దీంతో విద్యావ్యవస్థపై ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయో అవగతమవుతున్నాయి. సాంకేతిక రంగంలో ఎక్కువగా ప్రభావితమవుతూ, విద్యారంగంలో వివిధ అంశాలపై, సిలబస్‌పై, పరీక్షా పద్ధతులపై ప్రభావితం చూపిస్తున్నాయి.
తరగతి గది సాంకేతిక రంగంలో ఎంత మార్పుకు గురౌతున్నదో దృష్టిలో పెట్టుకుని మేలైన సంస్కరణలు తీసుకురాకపోతే మన దగ్గర చదువుకున్న విద్యార్థి నిరర్థకుడౌతాడు. అందుకే ఎన్‌సిఆర్‌టి వారు నిరంతర పరిశోధనలు కొనసాగిస్తూనే ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణమైన మానవ సంపద ఉత్పత్తి అవుతుంది. సంస్కరణలు స్వీకరించటానికి కూడా అధ్యాపక వర్గం సిద్ధంగా ఉండకపోతే సమాజం ఆదరణ, విశ్వాసం పొందటం కష్టం. దేశ ప్రగతికి విద్య పట్టుకొమ్మగా మారింది.
కాగా, తరగతి గదిపై మూడు బలమైన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అవి- 1. రాజకీయ శక్తులు 2. సాంకేతికమైన శక్తులు 3.విద్యాపరమైన శక్తులు. ఈ మూడింటి సంయోగమే తరగతి గదిలో అధ్యయనంగా మారుతుంది. ఈ మూడు శక్తుల ప్రభావంతో అభ్యసనంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న దాంతో, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. జ్ఞానసమార్జనకు నిదర్శనం విద్యార్థి తన జ్ఞానాన్ని కొత్త డిజైన్‌లో చూపించటం. ఇదివరకు సాహిత్యంలోని వేరే ప్రక్రియల ద్వారా జ్ఞాన సంపదను చెప్పటం జరిగేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ యుగం. జ్ఞానాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించటం డిజిటల్ యుగ లక్షణంగా మారింది. తరగతి గది పరిధి మునుపటికన్నా పెరిగింది. మీడియా ప్రభావంతో విద్యార్థి డిజైనర్‌గా మారాడు. ఈ ప్రక్రియలో విద్యార్థిలోని క్రిటికల్ థింకింగ్, విశే్లషణ లక్షణం బైటకు వస్తున్నాయి. డిజిటల్ యుగం తరగతి గదికి మెరుపులు ఇచ్చింది. కొత్త మెరుగులు అద్దుతుంది. అందుకే బోధనా కార్యక్రమం మెరుగుపడాల్సి ఉంది. ప్రైవేట్ యాజమాన్యాలతో సరితూగటానికై ప్రభుత్వ స్కూళ్ళలోనూ డిజిటల్ తరగతులు ప్రారంభించారు. 21 శతాబ్దంలో తరగతి గది వెనుకటి తరగతి గదికన్నా భిన్నంగా ఉండటమే కాకుండా కొత్త కళాఖండాల నిర్మాణానికి కారణభూతమవుతుంది. ఈనాడు తరగతి గదిలో మార్పుకు, విద్యార్థులలో క్రియేటివ్ థింకింగ్‌ను మరింత పెంచేందుకు కొత్త ఆవిష్కరణలు తలుపు తడుతున్నాయి.

-చుక్కా రామయ్య