సబ్ ఫీచర్

జోరు తగ్గని మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఉగ్రవాదుల, మావోస్టుల విధ్వంసకాండకు అడ్డుకట్ట వేయవచ్చన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు అడియాసలయ్యాయి. కాశ్మీర్‌లో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పదే పదే చెలరేగిపోతున్నారు. చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని సుకుమా జిల్లా ప్రస్తుతం మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. ఆ జిల్లాలో మొత్తం 146 గ్రామ పంచాయితీలు ఉండగా, 80 గ్రామ పంచాయితీలలో మాత్రమే ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయి. మిగిలిన 66 గ్రామ పంచాయితీలలో మావోయిస్టులదే ఆధిపత్యం. ఈ గ్రామాలలోకి ప్రభుత్వ ఉద్యోగులు రావడానికి మావోయిస్టులు అనుమతించరు. ప్రభుత్వ పథకాలేవీ అడవిబిడ్డలకు చేరవు. ఈ గ్రామాలలోని పిల్లలకు ఎర్ర, నల్ల జెండాలు తప్ప, త్రివర్ణ పతాకం ఉందన్న విషయం కూడా తెలియదు.
సుకుమా జిల్లా మొత్తం అటవీ ప్రాంతం. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతం ప్రజలకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. ఇక్కడి అమాయక గిరిజనులకు ప్రభుత్వం తమ సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నదన్న విషయం కూడా తెలియదు. పిల్లలకు చదువు అంటే ఏమిటో తెలియదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం ద్వారా, గిరిజనులను మావోయిస్టుల చెర నుంచి విముక్తి కలిగించవచ్చనే ఆలోచన మన ఘనత వహించిన పాలకుల బుర్రలకు ఆలస్యంగా తట్టింది. సుకుమా జిల్లాలో 232 కిలోమీటర్ల మేరకు రోడ్లను 279 కోట్ల వ్యయంతో నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రోడ్ల నిర్మాణం పూర్తి అయితే, తమ ఆధిపత్యానికి గండిపడుతుందనే భయం మావోయిస్టులకు పట్టుకొంది. తొలినాళ్ళలో రోడ్ల నిర్మాణాలను మావోయిస్టులు అడ్డుకొన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో వాడే పరికరాలను, యంత్రాలను మావోయిస్టులు ధ్వంసం చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం భద్రతా బలగాల సహాయంతో ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇటీవల రోడ్డు నిర్మాణం పనుల సందర్భంగా పహారా కాస్తున్న 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను మావోలు దారుణంగా హతమార్చారు.
సుకుమా జిల్లా కేంద్రంలో పిల్లల కోసం ఎడ్యుకేషన్ సిటీని ఏ ర్పాటు చేసి, 5 వేలమంది పిల్లలకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక్కడ చదువుకొనే పిల్లలు తమ తల్లిదండ్రులకు నెలల తరబడి దూరంగా గడపాల్సి వస్తున్నది. కనీసం వారు తమ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం లేదు. దీనికి కారణం ఇక్కడి ప్రజలు ఎవరూ సెల్‌ఫోన్‌ను వినియోగించడానికి మావోయస్టులు అనుమతించరు. వారి ఆధార్ కార్డులు కూడా మావోయిస్టుల వద్దనే ఉంటాయి. పలు గ్రామాలకు ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళడానికి భయపడతారు. దీనికి కారణం మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెషర్ బాంబులే. అటవీ ప్రాంతంలో మద్యం తయారీకి వినియోగించే ‘మహూవా’ అనే పూలను గిరిజనులు సేకరించి విక్రయిస్తూంటారు. పూలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బులో కూడా కొంత భాగం మావోయస్టులు వసూలు చేస్తూ, తమ ఖర్చులకు నిధులు సమకూర్చుకొంటున్నారు. రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు అమాయక గిరిజనులకు మావోయిస్టుల చెర నుండి విముక్తి కలగదు, వారి ఆగడాలకు అంతు ఉండదు.

-పి.మస్తాన్‌రావు