సబ్ ఫీచర్

పర్యావరణ పరిరక్షణకు ట్రంప్ తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓంద్యౌ శాంతిః అంతరిక్షగ్‌ం శాంతిః ఫృథ్వీ శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః వనస్పదయః శాంతిః విశ్వదేవా శాంతిః బ్రహ్మ శాంతిః శాంతి రేవ శాంతిః సామా శాంతి రేధీ ఓం శాంతిః శాంతిః శాంతిః’’
ఇది అధర్వణ వేదం మానవ మనుగడకు మూలాధారంగా చెప్పిన సూక్తి. ప్రకృతితో మానవులకు గల సంబంధాన్ని తెలియజేయడమేకాక, సుఖమయ జీవనానికిగల పునాదులేవో నిర్వచించారు పూర్వ ఋషులు.
భారతీయులు ప్రకృతి తమకు ప్రసాదించిన సంపదను పదిలంగా కాపాడుకుంటూ తరువాతి తరాలకు అందిస్తూ వస్తున్నారు. భారతీయ సనాతన ధర్మం ప్రవచించిన ఈ వేదసూక్తి సమస్త ప్రపంచ దేశాలకు, ప్రపంచ మానవాళికి నిర్దేసించి చెప్పిన మాట.
దురదృష్టవశాత్తూ గత శతాబ్దం ఉత్తర భాగంలో మానవుడు గతి తప్పాడు. అంతవరకు ప్రకృతితో మమేకమై అన్నిటా జయించాడు. సుఖమయ జీవనానికి అలవాటుపడ్డాడు. అభివృద్ధికి బాటలు వేశాడు. అయితే దారి తప్పాడు. అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. సంపదగా భావించాడు. భోగలాలస కోసం యాంత్రికమైన వస్తూత్పత్తిని పెంచాడు. పరిశ్రమల స్థాపనకోసం యంత్రాగారాలను స్థాపించాడు. అవి పనిచేయడానికి ఖనిజ సంపదను కొల్లగొట్టాడు. అడవులను నేలమట్టం చేశాడు. ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతింది. ఆశలు నిరాశలయ్యాయి. అంతటా కాలుష్యం వ్యాపించింది. సుందరమైన ప్రపంచంలో ఆనందంగా జీవించాలనుకున్న మనిషికి శ్మశానం సాక్షాత్కరించింది. ఈ పరిస్థితి ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో కాక మొత్తం ప్రపంచం పర్యావరణ కాలుష్యానికి గురైంది. కాలుష్య మహమ్మారి నాలుకచాచి ప్రపంచానే్న కబళించడానికి సిద్ధపడింది.
అప్పటికే ఆలస్యమైనా, ప్రపంచ దేశాలు గుర్తించి పరిష్కార ప్రయత్నాలు ఆరంభించింది. పంచభూతాలు - ముఖ్యంగా గాలి, నీరు, ఆకాశం, భూమి కాలుష్యమయ్యాయని గుర్తించాయి. ఈ నాల్గింటి మధ్య ఒక చక్రం ఆవృతమై ఉంటుంది. ఒకటి మరొకదానితో ముడిపడి ఉంటుంది. ఇవి కలుషితమైతే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అందుకని ప్రపంచ దేశాలన్నీ పారిస్‌లో సమావేశమై జూన్, 2015లో సమావేశమై ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నాయి. పర్యావరణాన్ని రక్షించుకోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతను స్వీకరిస్తూ 196 దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా భారతదేశం కూడా సంతకం చేసింది. ‘‘ఈ తక్షణ రక్షణ కర్తవ్యం ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదు’’ అన్న నినాదంతో కదిలాయి.
పర్యావరణ కాలుష్యానికి ప్రతి దేశానికి అంతో, ఇంతో సంబంధం ఉంది. అగ్ర రాజ్యాలయిన అమెరికా, రష్యా, చైనా అనేకాక పెద్ద-చిన్న, ధనిక-పేద అన్న తేడా లేదు. అన్ని దేశాలు వాతావరణ కాలుష్య ప్రభావానికి లోనవుతూనే ఉన్నాయి. వాతావరణ కాలుష్యానికి చెప్పుకోవాల్సినవి గాలి, భూమి, నీరు. ప్రాణికోటికి జీవనాధారాలు. ఇవి విషతుల్యమైతే సమస్త జీవరాసులు అంతమవుతాయి. అందుకే ‘‘ఆరోగ్యవంతమైన జీవనానికి ఆరోగ్యవంతమైన పర్యావరణం అవసరం’’ అన్నారు శాస్తజ్ఞ్రులు.
అభివృద్ధి పేరుతో పరిశ్రమలు నెలకొల్పి, వాటి నుండి వెలువడే వ్యర్థాలతో గాలి విషతుల్యమైంది. అ వ్యర్థాలు భూమిలోనికి ఇంకి మట్టిని కలుషితం చేశాయి. రసాయన వ్యర్థాలు నదులు, సముద్రాలలోకి వదలటంతో నీరు కూడా కలులషితమైంది.
పర్యావరణ కాలుష్యంలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది నీటిని గురించి. మానవుని మనుగడకు నీరు అవసరమని వేరే చెప్పక్కరలేదు. భూగోళంపై మూడువంతులు నీరు, ఒక వంతు భూభాగం ఉన్నాయి. మూడువంతులు నీరున్నా మానవులకు ఉ పయోగపడేది ఒక్క శాతం మాత్రమే. అందులో ముప్పావు శాతం కలుషితమైపోతున్నది. పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాల కారణంగా సముద్రాల, నదులలోని జలచరాలు ఈ కాలుష్యానికి అంతరించిపోతున్నాయి. భూమిలోనికి ఇవి ఇంకడంతో, ప్రభుత్వాలు ఇస్తున్న జలమే కాకుండా, బావులు, బోర్ల నుండి వచ్చే నీరు కాలుష్య రహితంగా ఉండడం లేదు. ఆ కారణంగా ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. వీటికి శబ్దకాలుష్యం ఒకటి తోడై మానసిక ప్రశాంతను, ఏకాగ్రతను కబళిస్తోంది.
ఇన్ని కాలుష్యాలవల్ల వాతావరణం వేడెక్కింది. ఓజోన్ పొరలు తగ్గుతున్నాయి. ప్రపంచం అత్యవసర పరిస్థితి నెదుర్కొంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మించి పెరగకుండా అరికట్టడమే ఈ పారిస్ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అందుకు అన్ని దేశాల సహకారం అంతే అవసరం.
ఉష్ణోగ్రతను అరికట్టకపోతే సముద్రాలు చెరియల కట్టలు దాటి తీరాన ఉన్న పల్లెలు, పట్టణాలను తనలో లయం చేసుకుంటుంది. ఋతువులకు క్రమమంటూ ఉండదు. ఆహార, జల, సంక్షోభాలు తలెత్తుతాయి. అన్నింటికీ మించి కలుషిత వాతావరణం నివాస యోగ్యం కాకుండా పోతుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే తుఫానులు, ఉప్పెనలతోసహా ఎన్నో ప్రకృతికి సంబంధించిన ఉపద్రవాలు చోటు చేసుకుంటాయి.
ఈ తక్షణ సంక్షోభం నుండి తప్పుకోడానికి అన్ని దేశాలు నిధులందించాలి. ఇరువది తొమ్మిది శాతంతో చైనా, పదిహేను శాతంతో అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ కారణంగా పర్యావరణ రక్షణకు ఆ రెండు దేశాలు పెద్ద ఎత్తున, ఆర్థిక సహాయం అందించాలి. లక్ష్యాన్ని సాధించడానికి వాగ్దానమే కాని, నిర్బంధంకాదు ఐదేళ్ళ తరువాత సమీక్షిస్తారు.
పుడమి రక్షణ కోసం ప్రతిజ్ఞ చేసిన అమెరికా అధ్యక్షుడు అమెరికా వాగ్దానానికి తూట్లు పొడిచి ఇప్పుడు ఏకంగా పుడమికే నిప్పుపెట్టాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదలగుతున్నట్లు జూన్ 2వ తేదీన ప్రకటించాడు. అతని ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరచ లేదు. పైగా అమెరికాపై వైదొలగడంవల్ల ఏర్పడనున్న ఆర్థిక ఇబ్బందులను తామందరూ కలిసి పూరిస్తామని ముక్తకంఠంతో పలికాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచి తీసుకుంటున్న చర్యలు ఆ దేశవాసులకే ఇష్టంలేదు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య చైనా, భారత్‌ల ఎదుగుదలను సహించలేక ఈర్ష్యా సూయలతో చేసినది. తనకంటే అన్ని రంగాలలో చైనా అధిగమించడం ట్రంప్‌కు తలనొప్పిగా మారింది. భారత్ విషయంలో... ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో మునిగినా, ఈ దేశం ఆర్థికంగా నిలద్రొక్కుకోవడమే కాదు, బలపడింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్నది. రానున్న కాలంలో చైనాను కూడా అధిగమించగల సత్తా చాటుతున్నది.
ఈ పరిస్థితుల్లో - భారత ప్రభుత్వం తరఫున ప్రధాని పారిస్ సమావేశంతో మాట్లాడుతూ ‘‘పర్యావరణ పరిరక్షణకు భారతదేశం కట్టుబడి ఉంది. భూగ్రహాన్ని మెరుగుపరచడానికి ఈ దేశం ప్రజలు అంకితమై ఉన్నారు. మా నిబద్ధతను చాటి చెప్పుకోవడానికి ఎన్నో చర్యలు ఇంతకు ముందే తీసుకున్నాం. అవి ఇప్పటికే ఎన్నో ఫలితాలను అందించాయి. మా భావితరాలకు శాంతియుతమైన, ఆనందమయమైన, సుందరమైన, మంగళకరమైన ప్రకృతిని అందిస్తాం’’ అన్నారు.
ఆ లక్ష్యం కోసం స్వచ్ఛ్భారత్, పచ్చదనం - పరిశుభ్రత, అందరితో కలిసి అందరి నివాసానికి పాటుపడడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. వాతావరణ కాలుష్య నివాసణకు బొగ్గుకు బదులు జలవిద్యుత్తు, అణువిద్యుత్తు, సోలార్, గాలిమరల నుంచి విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు, గోబర్ గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తిని పెంపొందించడం, ‘నమో గంగా’ వంటి ప్రణాళికలతో నదుల కాలుష్యాన్ని నివారించడం, బొగ్గు ఆధారిత పరిశ్రమలు కాలుష్యాన్ని అరికట్టడానికి పటిష్టమైన చర్యలు చేపట్టి, భూ, వాయు, జల కాలుష్యాలను నివారించడానికి ఎన్నో చర్యలు చేపట్టింది. భూతలంపై మూడోవంతు పచ్చదనం ఉండేలా పచ్చదనాన్ని ఉండేలా అడవుల అభివృద్ధికై ఆ లక్ష్యసాధనతో ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అంకితమయ్యేలా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించడంలో కేంద్రం తన కర్తవ్యాన్ని పునరుద్ఘాటించింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ద్వారా భూమండలాన్ని రక్షించుకోవాలన్న తన బృహత్తర లక్ష్యాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించింది.
అధర్వణ వేదసూక్తి ‘విశ్వదేవా శాంతిః శాంతిరేవ శాంతిః అను భారతీయ సనాతన ధర్మం యొక్క ఉపదేశాన్ని ఆ దేశంగా తీసుకుని ప్రకృతితో మానవాళికిగల సంబంధాన్ని మరోమారు పునరుద్ఘాటించింది.

- ఎ.సీతారామారావు 89787 99864