సబ్ ఫీచర్

శిక్షలు లేకే నేరాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు ఏభై ఏళ్ల క్రితం ప్రఖ్యాత నటుడు ఎం.బాలయ్య నిర్మించిన చిత్రం పేరు ‘నేరము- శిక్ష’. అందులో విలన్ సత్యనారాయణ- ‘బ్యాంకుకు కన్నం వేస్తే మనకు డబ్బుకు కొదవే వుండదు, మనం పట్టుపడితే మాత్రం డబ్బు అవసరమే ఉండదు’ అంటాడు. అలాగే నేటి మన సమాజంలో పాశ్చాత్య వినిమయ మోజుతో నేర మనస్తత్త్వం, అరాచకాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు సర్వ సామాన్యమైపోయాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. నేరస్తులకు కఠిన శిక్షలు లేకపోవటం, వున్నా శిక్షలు కూడా సకాలంలో సక్రమంగా అమలు జరగకపోవటం. కోర్టు కేసులు తేలటానికి దశాబ్దాల కాలం పడుతోంది. నేరస్తులకు చట్టమంటే భయం లేదు. సమాజమన్నా, దేశమన్నా భక్తిలేదు. ప్రజాస్వామ్యం పేరుతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, దైనందిన పాలన పైనే గాక శాంతిభద్రతలు, సుపరిపాలనపై దృష్టి పెట్టాలి.
సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాల్లో సైతం నేరస్తులకు సత్వర కఠిన శిక్షలు వుంటాయి. గత సంవత్సరం తాగిన మైకంలో కన్నకొడుకు తన తల్లి పన్ను విరగ్గొడితే ఆమె తన ఖర్మ అనుకోకుండా న్యాయాధిపతికి ఫిర్యాదు చేయటం, ఆయన ‘పంటికి పన్ను’ తరహాలో శిక్ష విధించటం, ఆ కుమారుడి పన్ను వూడబెరికి అదే రోజు ఇంటికి పంపడం జరిగిందట. అందుకే అటువంటిచోట నేరాలు అరుదుగా జరుగుతాయి. మనకు హాని చేయకపోయినా పిల్లి వంటి సాధు జంతువులపైన మనం ప్రతాపం చూపుతాం. ప్రమాదమని తెలుసు గనుకనే పులి జోలికి వెళ్లం. అలాగే ఇక్కడ నేరాలు చేసినా తప్పించుకోవచ్చుగానీ, దొరికినా ప్రమాదం లేదనే ధైర్యంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. హత్యలు చేసి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇకనైనా ప్రభుత్వాలు తక్షణమే నేర విచారణ జరిగేలా చర్యలు చేపట్టాలి. న్యాయశాఖలో ఖాళీగా వున్న అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయటమే గాక, పెరిగిపోతున్న జనాభాకు తగిన నిష్పత్తిలో న్యాయ, పోలీసు, జైళ్ల శాఖల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాలి. హత్యలు, భారీ అవినీతి కుంభకోణాలు వంటి కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నాలుగైదు మాసాలలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. డబ్బు కోసమే హత్యలు చేసే కిరాయి హంతకులకు, ఉద్దేశ పూర్వకంగా హత్యలు చేసే భార్యాహంతకులకు కచ్చితంగా ఉరిశిక్షలు అమలు జరపాలి. నేడు అందుబాటులోకి వచ్చిన వీడియో, లై డిటెక్టర్ వంటి ఆధునిక పరికరాల ద్వారా సేకరించే సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని సాధ్యమైనంత తక్కువ వాయిదాలతో కేసులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి. అప్పుడే సమాజానికి అసలైన భద్రత లభిస్తుంది. నేరం చేసేవాడికి శిక్ష పడుతుందన్న భయం అందరిలో కలుగుతుంది.

-తిరుమలశెట్టి సాంబశివరావు