సబ్ ఫీచర్

వృత్తి నైపుణ్యంతో ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రామిక శక్తే సంపదకు మూలమని సూత్రీకరించిన అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ (1773-90) ఏ దేశానికైనా నె పుణ్యత గల శ్రామికులు అవసరమని కూడా అన్నాడు. శ్రమ విభజన (వివిధ వర్గాలకు చెందినవారు వివిధ వృత్తులు చేపట్టడం) మంచిదని, అందువల్ల నైపుణ్యత పెరుగుతుందని ఆయన భావించాడు. కాగా, ఇటీవలి కాలంలో జనాభా సమస్యను ఆర్థిక వేత్తలు వివిధ కోణాల నుంచి పరిశీలించి లోతుగా అధ్యయనం చేశారు. జనాభా పెరుగుదల ఒకప్పుడు మనమనుకున్నంత ప్రమాదం కాదని నివుణుల అభిప్రాయం. జనాభా పెరుగుదలతో వస్తు సేవలకు గిరాకీ పెరిగి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, ఒక దేశానికి అధిక జనాభా ఉందని గ్రహించడం అంత తేలిక కాదు. ప్రస్తుతం జపాన్, ఐరోపాలోని పలు దేశాలలో జనాభా తగ్గుముఖం పట్టింది. దీనివల్ల నష్టం కలగవచ్చని ఈ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జపాన్‌లో వృద్ధుల సంఖ్య వి పరీతంగా పెరుగుతోంది. ఒక దేశం ప్రత్యేక పరిస్థితుల్లో అధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించినప్పుడు అధిక జనాభా సమస్య కాదు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 734 కోట్లు. 2050 నాటికి ఇది 970 కోట్లకు పెరగవచ్చు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ధనిక దేశాల్లో జనాభా పెరిగినా అది నామమాత్రమే. 2015-2050 మధ్య కాలంలో వెనుకబడిన దేశాలలో జనాభా 200 కోట్ల మేరకు పెరగవచ్చని ఓ అంచనా. మన దేశం జనాభా విషయంలో చైనా తరువాత రెండవ స్థానంలో ఉంది. 2022 నాటికి భారత్ మొదటి స్థానాన్ని చేరుకుంటుంది. ప్రస్తుతం చైనా జనాభా 139 కోట్లు వుంటే, భారత్ జనాభా 131 కోట్లు వుంది. మనదేశంలో పనిచేసే వయసులో ఉన్నవారి సంఖ్య అధికంగానే ఉంది.
మన దేశ జనాభా 1961లో 68.33 కోట్లు వుంటే, 2011లో 121 కోట్లుగా ఉంది. 1991-2001 మధ్యలో జనాభా వృద్ధి రేటు 20.2 శాతంగా వుంటే 2001-2011లో అది 17.64 శాతానికి తగ్గింది. మన దేశ జనాభా విషయంలో కొన్ని ఆందోళనకరమైన ధోరణులున్నాయి. ప్రతి వెయ్యిమంది పురుషులకు 1961లో 976 మంది మహిళలుంటే, 2011 నాటికి మహిళల సంఖ్య 914కి తగ్గింది. అక్షరాస్యత విషయంలో మనం ఇంకా వెనకబడే ఉన్నాం. అక్షరాస్యత శాతం 1961లో 33.11 వుంటే, 2011లో 74.04గా వుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 24.48 నుండి 68.81కి పెరిగింది. అసలు సమస్య ఏమిటంటే- సరైన ప్రగతి లేని గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉంది. దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయి. గ్రామాలను ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలి.
అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తే జనాభా తగ్గుముఖం పట్టడం ఖాయం. 2001-2011 దశాబ్దంలో మన జనాభా పెరుగుదల రేటు 21.54 శాతం నుండి 17.64 శాతానికి తగ్గింది. గ్రామాల్లో కూడా జననాల రేటు తగ్గింది. మన దేశంలో సహజ సంపద బాగా ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. శ్రామికుల్లో ఎక్కువ మందికి నైపుణ్యం లేదు. ఫ్రభుత్వం ప్రజలకు అనుకూలమైన రంగాలపై దృష్టిపెట్టి ఉత్పత్తిలో వైవిధ్యత చూపితే వివిధ నైపుణ్యాలకు గిరాకీ పెరుగుతుంది. ఉపాధి ఆధారిత వ్యూహం అవసరం. విద్య,వైద్య రంగాలపై పెట్టుబడిని పెంచాలి. జనాభా ఎక్కువ కావడం వల్ల ప్రయోజనాలు వుండవు. శ్రామిక శక్తిని పూర్తిగా ప్రయోజనకరంగా సద్వినియోగం చేసుకోవాలి.

-ఇమ్మానేని సత్యసుందరం