సబ్ ఫీచర్

మువ్వనె్నల జెండాకు 70 ఏళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి ఘనమైన చరిత్ర ఉన్నట్లే మన జాతీయ పతాకానికి కూడా ఒక విశిష్టత ఉంది. విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ సూచనను అనుసరించి పింగళి వెంకయ్య ఒక పతాకాన్ని రూపొందించాడు. ఆ పతాకంలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు, మధ్యలో చరఖా ఉన్నాయి. గాంధీజీ సలహా ప్రకారం పతాకంలో తెలుపు రంగును చేర్చారు. ఆ జెండాను కాంగ్రెస్ సమావేశాలలో ఎగురవేస్తూ ఉండేవారు. స్వతంత్ర భారతదేశపు జాతీయ జెండాగా త్రివర్ణ పతాకాన్ని 22.7.1947న రాజ్యాంగ సభ ఆమోదించింది.
మన జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో చరఖాకు బదులుగా నీలిరంగులో ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. సారనాధ్ స్థూపం మీద గల చక్రాన్ని పోలిన చక్రాన్ని తెలుపు రంగు భాగంలో చిత్రించారు. తెలుపు రంగు వెడల్పును బట్టి ధర్మచక్రం కొలతలు ఉండాలి. జాతీయ పతాకం పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటాయి. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని జాతి యావత్తూ గౌరవిస్తోంది. స్వాతంత్య్ర దినం, గణతంత్ర దినం సందర్భంగా దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశాక జనగణమన గీతాన్ని ఆలపిస్తారు.
జాతీయ పతాకాన్ని అవమానించడం నేరం. దానిని తలక్రిందులుగా ఎగురవేయరాదు. ఏ పతాకానికి లేని పవిత్రత, ప్రాధాన్యత త్రివర్ణ పతాకానికి వుంది. భారతీయులలో దేశభక్తిని నరనరాన నింపుతూ జాతి గొప్పతనానికి ప్రతీకగా నిలిచింది. త్రివర్ణ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మూడు సమాంతర అడ్డపట్టీలుగా ఉంటాయి. కాషాయం త్యాగనిరతికి, తెలుపు-శాంతికి, ఆకుపచ్చ- సస్యశ్యామలానికి నిదర్శనం. జాతీయ పతాకాన్ని సూర్యోదయం తర్వాతనే ఎగురవేయాలి. సూర్యాస్తమయానికి ముందే అవనతం చేయాలి. ఆవిష్కరణ, తొలగించడం పద్ధతి ప్రకారం జరగాలి. జాతీయ పతాకాన్ని ఎలా పడితే అలా ఉండలా చుట్టకూడదు. జాగ్రత్తగా మడతపెట్టాలి. జెండాను కత్తిరించడం కానీ, మురికి చేయడం గానీ, ఫొటోను సైతం మురికిచేయడం, చించడం, నలిపివేయడం, నీటిలో వేయడం వంటివి చేయకూడదు. ఇళ్లమీద, వాహనాల మీద ఎగురవేయకూడదు. వ్యాపార ప్రకటనలకు వాడరాదు. జెండాను చించి సంచులుగా, డ్రెస్సులుగా కుట్టించకూడదు. జెండాను పట్టుకొని గాలిలో అటూ ఇటూ ఇష్టం వచ్చినట్లు ఊపకూడదు. ఇవన్నీ నేరాలే. ఇలా ప్రవర్తించినవారు శిక్షార్హులే. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. జాతీయ పతాక రూపశిల్పిగా ప్రఖ్యాతి గాంచిన వెంకయ్య 1963 జూలై 4వ తేదీన పరమపదించారు.

-కామిడి సతీష్‌రెడ్డి