సబ్ ఫీచర్

బ్యాంకుల్లో రోబో సేవలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానాటికీ విస్తరిస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి బ్యాంకులు ‘రోబో’లను వినియోగించుకుంటున్నాయి. దీంతో బ్యాంకులకు అనవసర ఖర్చు, ఖాతాదారులకు విలువైన సమయం ఆదా అవుతుంది. బ్యాంకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రోబో తలమీద ‘హై డెఫినిషన్’ కెమెరాలు, వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోబో బ్యాంకు ఆవరణలో తిరుగుతూ ఖాతాదారులకు కావాల్సిన సమాచారం అందచేస్తుంది. బ్యాంకుల వ్యాపార లావాదేవీలు, డిపాజిట్లు, వడ్డీరేట్లు తదితరాలకు సంబంధించిన ఐదు వందల ప్రశ్నలకు ఇవి సమాధానం చెబుతాయి.
ప్రస్తుతం మన దేశంలో కెనరా బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి, సిటీ యూనియన్ బ్యాంక్ కేంద్ర కార్యాలయాల్లో రోబోలను ఏర్పాటు చేసారు. కెనరా బ్యాంకు కేంద్రస్థానం అయిన బెంగళూరులోని ప్రధాన కార్యాలయంకు వెడితే అక్కడ ‘మిత్రా’ అనే రోబో ఖాతదారులకు స్వాగతం పలుకుతుంది. కన్నడ భాషలో ఖాతాదారులు అడిగే వివిధ ప్రశ్నలకు చక్కగా సమాధానం చెబుతుంది. పాస్‌బుక్ అప్‌డేట్ కూడా ఈ రోబో చేస్తుంది. ఏ కౌంటర్ ఎక్కడ ఉంది? తమకు కావాల్సిన సేవలు ఎక్కడ లభిస్తాయి? తదితర వివరాలను ‘మిత్రా’ అనే రోబో చక్కగా వివరిస్తుంది.
సిటీ యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాయలంలో ఏర్పాటు చేసిన రోబోకి లక్ష్మి అనే పేరు పెట్టారు. ఈ రోబో 30 నుంచి 40 మంది ఖాతాదారుతో మాట్లాడుతూ వారికి కావాల్సిన సమాచారం అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోబో పేరు ‘ఇరా’. ఇది రోజుకు సగటున 60 మంది ఖాతాదారులతో మాట్లాడుతుంది. ఒక్కొక్క రోబో విలువ 3.5 లక్షల రూపాయలు. ఇప్పటికే బ్యాంకులలో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగిపోయిన తర్వాత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. దాదాపుగా అన్ని బ్యాంకులలో హెల్ప్ డెస్క్ ఉంటుంది. హెల్ప్ డెస్క్‌లోని ఉద్యోగులు బ్యాంకుకు వచ్చేవారికి కావాల్సిన సమాచారం అందచేస్తారు. త్వరలో ఈ హెల్ప్ డెస్క్‌ల స్థానాన్ని రోబోలు భర్తీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే బ్యాంకుల్లో పలు ఉద్యోగాలు మాయమవుతాయి. వివిధ రకాల చార్జీల పేరుతో ఖాతాదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న బ్యాంకులు ఆధునికతను సంతరించుకోవడంలో కూడా పోటీపడుతున్నాయి.

- పి.భానుశంకర్