సబ్ ఫీచర్

భారత్‌తో చెలగాటం వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ దేశాలతో తన ఆర్థిక కార్యకలాపాలను నిర్వర్తించుకునే నెపంతో చైనా ‘సిల్క్‌రోడ్ ఎకనమిక్ బెల్ట్’, ‘మారిటైం సిల్క్‌రోడ్’లను నిర్మిస్తోంది. భూమార్గం గుండా వివిధ దేశాలను కలుపుకుంటూ ఎకనమిక్ కారిడార్లను ఏర్పాటు చేయడానికి ‘సిల్క్‌రోడ్ ఎకనమిక్ బెల్ట్’ రూపొందింది. పసిఫిక్, హిందూ, అరేబియా సముద్రాల్లోని దేశాలను మణిహారంలా కలుపుతు ఎకనమిక్ కారిడార్లు ఏర్పాటు చేయడానికి ‘మారిటైం సిల్క్‌రోడ్’ ఏర్పాటవుతోంది. దీనినే ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ (బిఆర్‌ఐ) అని కూడా పిలుస్తారు. వీటి వెనుక చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్ సామ్రాజ్య విస్తరణ ఎత్తుగడలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవహారాలపై ఓ కన్ను వేసి ఉంచాలని, ముఖ్యంగా భూ, గగన, సముద్ర మార్గాల్లో భారత్ కదలికలను కట్టడి చేయాలన్నది వీటి ఏర్పాట్ల వెనుకనున్న అసలు ఉద్దేశం.
ఇటీవల భారత్-్భటాన్-చైనా ఉమ్మడి సరిహద్దు ప్రాంతమైన డోక్లాం వద్ద భారత్, చైనాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ విషయంలో తొందరపాటు వలదనీ, భారత్ పట్ల దుందుడుకు వైఖరి సరికాదని చైనా ప్రభుత్వానికి ఆ దేశంలోని మేధావులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు ఈ విధమైన హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారి. ‘మకౌ’ దక్షిణ చైనాలోని ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం. ఇది 1999 వరకూ పోర్చుగీసు అధీనంలో ఉంది. ఇక్కడ చైనా సైనిక స్థావరం ఉంది. ఆంటోనీ వోంగ్‌డోంగ్ ఇక్కడ సైనిక నిపుణుడిగా పనిచేస్తున్నాడు. చైనా వత్తిడి రాజకీయాలు చేసినట్టయితే భారత్ శత్రుదేశంగా మారుతుందని అది చైనాకు మంచిది కాదని ఆయన సూచించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ)కి సముద్ర కార్యకలాపాలు నిర్వహించకుండా భారత్‌ను నిలువరించడం అసాధ్యమని అలా చేస్తే భారత్ చైనాకి ప్రత్యర్థి అవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. చైనా-్భరత్ సరిహద్దు ప్రాంతం ఏడాదిలో ఎనిమిది నెలలు మంచుతో గడ్డకట్టి వుంటుందని, అలాంటి చోట భారత్‌తో యుద్ధం చేయాలనుకోవడం నిరర్ధకమనీ ఝౌ చెన్మింగ్ అంటున్నారు. ఈయన చైనాలోని జియాంగ్పూ ప్రాంతంలోని ‘నోఫార్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ స్టడీస్’లో సైనిక నిపుణుడు. ‘చైనా భారత్‌తో మానసికంగా యుద్ధం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా వుంది. భూమిపై జరిగే యుద్ధంలో చైనా భారత్‌ను ఓడించినా, భారత సముద్ర బలగాలను ఢీకొట్టడం పిఎల్‌ఏ నేవీ తరం కాదు. ఎందుకంటే హిందూ మహాసముద్రం మీదుగా వివిధ దేశాల వ్యాపార కార్యకలాపాలు సాగుతుంటాయి కాబట్టి’ అని ఆంటోనీ వోంగ్ అంటారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్‌సిఎంపి)తో అన్నారు. ఇది హాంగ్‌కాంగ్ నుంచి వెలువడే ఆంగ్ల దినపత్రిక.
‘ప్రధానంగా చైనా చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడి ఉంది. అరబ్బు దేశాల నుండి 80 శాతం చమురు హిందూ మహాసముద్రం ద్వారానే చైనాకు రవాణా అవుతుంది’ అని చైనా స్టేట్ మీడియా ప్రచురించిన గణాంక వివరాలు తెలుపుతున్నాయి. ‘ఆగ్నేయాసియాలోని ఇతర దేశాల వలె భారత్ ఏనాడూ చైనా బెదిరింపులకు లొంగలేదు. చైనాకు చమురు రవాణా అయ్యే సముద్రమార్గంలో భారత్ సరిగ్గా మధ్యలో ఉంది. ఇది రక్షణ పరంగా కూడా ఎంతో కీలకమైనది. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ ఒక బలమైన ప్రత్యర్థి దేశం మారుతుంది. దీనివల్ల హిందూ మహాసముద్రంలో చైనా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది’ అని ఆంటోనీ వోంగ్ అంటారు. సన్ షిహాయ్ మీడియాతో మాట్లాడుతూ, ‘గత మూడు దశాబ్దాలుగా చైనా అవలంబిస్తున్న ధోరణి పట్ల భారత్‌లో చాలా వ్యతరేకత నెలకొని ఉంది. ఇప్పుడు చైనా భారత్‌తో యుద్ధం చేయాలనుకుంటే ఇరు దేశాల మధ్య పరస్పర అవిశ్వాసం నెలకొంటుంది. ఒకవేళ చైనా యుద్ధానికే సిద్ధపడితే అది తీవ్ర ఆర్థిక నష్టానికే దారితీస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో భారత్ కూడా ఒక భాగస్వామి అయ్యేలా చూడడమే అన్ని రకాలుగా మంచిది’ అంటారు. ఈయన చైనీస్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఏసియన్ స్టడీస్‌కి సలహాదారు. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులలో భారత్‌ను ఆకర్షించాలని చైనా ఇఫ్పటికే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు నెలకొన్న యుద్ధపరమైన ఉద్రిక్తతలు ఉభయ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి’ అని సన్‌షిహాయ్ అంటున్నారు. 2017 మే నెలలో బీజింగ్‌లో జరిగిన బిఆర్‌ఐ సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటువల్ల తమ సార్వభౌమత్వానికి భంగం కలుగుతుందని భారత్ ఆందోళన. ఎకనమిక్ కారిడార్ విషయంలో ఏమాత్రం పారదర్శకత లేదు.
జులై 31, 2017లో ఇండో-యుఎస్ ఫోరంలో బిఆర్‌ఐ గురించి ప్రస్తావిస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ‘ఏదేశమైనా వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రాజెక్టులు మొదలుపెట్టినపుడు ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, వాటి సమగ్రతను కూడా దృష్టిలో వుంచుకుని నియమావళిని రూపొందించుకోవాలి’ అని అన్నారు. ‘ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో తన సైనిక కార్యకలాపాలను పెంచడం చైనా ముఖ్యోద్దేశం. ఇందుకోసం చైనా తన సైనిక బలగాల ఆధునీకరణపై దృష్టి పెడుతోంది. దీన్ని ఎదుర్కోవడానికి భారత్ కూడా తన నావికాదళం ఆధునీకరణపై దృష్టి సారిస్తోంది. నావికాదళం బలం పెంచుకునేందుకు జలాంతర్గాములపై కూడా భారత్ దృష్టి పెడుతోంది. ఇటీవల ఆ దేశం మలబారు తీరంలో నిర్వహించిన సంయుక్త నావికా విన్యాసంలో ఇది స్పష్టమైంది’ అని ఎస్‌సిఎంపి దినపత్రిక పేర్కొంది.

-దుగ్గిరాల రాజకిశోర్