సబ్ ఫీచర్

గొర్రెల్ని పెంచేవారు సంపన్నులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొర్రెల పెంపకం అంటే మనలో చాలా మందికి ఇంకా సరైన అవగాహన లేనట్టుగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు ప్రకటించగానే ప్రతి అంశాన్ని రాజకీయంగా విమర్శించాలని అనుకునే కొందరు సరైన అవగాహన లేక విమర్శలు చేశారు. కానీ వివిధ దేశాల్లో గొర్రెల పెంపకం ఎంత లాభసాటిగా సాగుతోందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘గొర్రెల పెంపకం దారులు’ అంటే కొందరు నాయకులకు ఉన్న చులకన భావం, తప్పుడు అవగాహన సరికాదు. ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం దారులకు సొంత హెలికాప్టర్లు ఉన్నాయంటే మనకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ అక్కడి వారికి అది సాధారణం. ఇటీవల తెరాస ఎంపీ బి.వినోద్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు కొన్ని పర్యాటక కేంద్రాలను సందర్శించాలని అనుకున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన ‘గ్రేట్ ఓషన్ డ్రైవ్’ సందర్శనకు సిద్ధమవుతుండగా, మాటల మధ్యలో గొర్రెల పెంపకం ఆస్ట్రేలియాలో ఎంత లాభసాటిగా ఉంటుందో కొందరు వివరించారు. దీంతో అప్పటికప్పుడు వినోద్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని గొర్రెల పెంపకం దారులను కలిసి మాట్లాడదామని నిర్ణయించుకున్నారు.
ఆస్ట్రేలియాలో టామ్ డెన్నిస్ నిర్వహిస్తున్న గొర్రెల పెంపకం కేంద్రానికి చేరుకున్నాం. 1850 నాటి కాలంలో తమ పూర్వీకులు ఇక్కడికి వలస వచ్చారని, ఆరు తరాలుగా గొర్రెల పెంపకం వృత్తిపైనే జీవిస్తున్నట్టు డెన్నిస్ వివరించారు. అక్కడ గొర్రెల పెంపకం అంటే మన దేశంలో కనిపించే విధంగా వంద, రెండు వందల గొర్రెలు కావు. గొర్రెల పెంపకం దారుల జీవన స్థితిగతులు కూడా మన వారితో ఏ మాత్రం పోలిక లేకుండా ఉంటాయి. వేలాది ఎకరాల్లో లక్షలాది గొర్రెలను పెంచుతారు. ఆ సువిశాల ప్రదేశంలో ఎక్కడెక్కడ గొర్రెలు ఎలా ఉన్నాయో సొంత హెలికాప్టర్‌లో పరిశీలించి రేడియో ద్వారా కింద సహాయకులకు సమాచారం ఇస్తారు. తరలించాల్సిన గొర్రెలను గుర్తించి పెద్ద పెద్ద ట్రక్కులను తీసుకు వచ్చి గొర్రెలను ఎక్కించి సముద్ర కేంద్రానికి తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తారు. గొర్రెల పెంపకం కేంద్రంలో వీటన్నింటిని ప్రత్యక్షంగా చూసిన తరువాత ఆశ్చర్యం వేసింది. గొర్రెల పెంపకం అంటే అవగాహన లేకుండా చిన్న చూపు చూస్తున్నారు. ఏదో ఒకనాడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గొర్రెల పెంపకం బ్రహ్మాండమైన స్థాయిలో విస్తరించాలనే కోరిక కలిగింది. శాస్ర్తియ పద్ధతుల్లో ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఖర్చుతో నూతన పద్ధతులను పాటిస్తూ మంచి శుచికరమైన గొర్రె మాంసం అమ్ముతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు టామ్ డెన్నిస్ కుటుంబంతో గొర్రెల పెంపకం వృత్తిపై మాట్లాడారు.
ఆస్ట్రేలియా వంటి దేశంలో గొర్రెల పెంపకం దారులు సొంత హెలికాప్టర్లను ఉపయోగిస్తుండడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించింది. అదే సమయంలో మన దేశంలో గొర్రెల పెంపకం అంటేనే చిన్న చూపు చూడడం బాధ కలిగించింది. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పెంపకం పథకాన్ని ప్రకటించినప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. గొర్రెల పెంపకం అనేది కొత్తదేమీ కాదు. కానీ ఈసారి తెలంగాణలో అక్రమాలకు అవకాశం లేకుండా పకడ్బందీ విధానంతో గొర్రెల పెంపకం పథకం చేపట్టారు. గొర్రెల కొనుగోలు కాగితాలకే పరిమితం అయ్యే సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తెలంగాణకు చెందిన గొర్రెలను కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే వీటిని కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కో వ్యక్తికి 21 గొర్రెలు ఇస్తున్నా, కొంత కాలం గడిచిన తరువాత రాష్ట్రం నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు గొర్రె మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం ఖాయం. ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం కాసులు కురిపించే బ్రహ్మాండమైన వృత్తిగా మారింది. ఏటా ఐదు బిలియన్ డాలర్ల విలువైన మాంసం ఉత్పత్తులను ఆస్ట్రేలియా ఎగుమతి చేస్తోంది. ఆస్ట్రేలియాలో దాదాపు రెండు లక్షల మందికి గొర్రెల పెంపకం ఉపాధి కల్పిస్తోంది. తెలంగాణలో దీని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మంది గొర్రెల పెంపకం వృత్తిపై జీవిస్తున్నారు. అయితే చాలీచాలని ఆదాయంతో గొర్రె తోక బెత్తెడు అన్నట్టుగా వారి జీవితాలు సాగుతున్నాయి.
ఒకవైపు ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు ఆధునిక విధానాల పట్ల అవగాహన కలిగిస్తే రాష్ట్రంలో గొర్రెల పెంపకానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. విమర్శ కో సం విమర్శ అని కాకుండా గొర్రెల పెంపకం దారుల జీవన స్థితిగతులు మెరుగు పడేందుకు ఏం చేస్తే బాగుంటుందో విపక్షాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలో ఆస్ట్రేలియానే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో అపారమైన భూ సంపద ఉంది, ప్రభుత్వాలు చొరవ చూపితే ఆస్ట్రేలియాతో పోటీ పడే పరిస్థితి మనకూ వస్తుంది. ఆస్ట్రేలియా తరహాలోనే తెలంగాణలో కూడా గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా ప్రోత్సహించాలి. అక్కడ గొర్రెల పెంపకం జరిగే తీరు, వాటిపై ఆధారపడేవారి జీవితాలు ఎలా ఉంటాయి, వారెంత సంపన్న జీవితం గడుపుతారో డ్యాకుమెంటేషన్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో మంది గొర్రెల పెంపకం దారులకు ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది.

చిత్రం.. ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకందారు టామ్ డెన్నిస్‌తో భారతీయులు

- కాసర్ల నాగేందర్ రెడ్డి