సబ్ ఫీచర్

ఉసురు తీసిన ఉదాసీనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఉగ్రవాదం పొట్టన పెట్టుకున్న ప్రాణాల కన్నా ఉదాసీనత బలికోరిన ప్రాణాలే అత్యధికం. వివిధ సమస్యలపై బాధ్యుల నుండి జవాబుదారీతనంతో కూడిన ప్రతిస్పందన కన్నా- తప్పును నెట్టివేసే ధోరణి, తప్పించుకునే వైఖరి ప్రబలిపోవడం ఓ సామాజిక వ్యాధిలా ముదిరింది. దీనివల్ల సమస్య పక్కదోవ పట్టడమో, ముదిరిపోవడమో జరిగి మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. ప్రతి సమస్యనీ రాజకీయ కోణంలో చూసే జాఢ్యం విస్తరించి, ఉమ్మడి ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ గత వారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేక ఒకేరోజు ముప్పై మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం. వారం రోజుల వ్యవధిలో అరవై మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఒకేసారి అందులో ముప్పైమంది విగతజీవులవ్వడం ఎంత హృదయవిదారక దృశ్యమిది.
అతి తక్కువ ధరకే దొరికే అత్యంత అవసరమైన, విలువైన ప్రాణవాయువు అందుబాటులో ఉందా? లేదా? అన్నది నగరంలోనే పెద్దాసుపత్రి గమనించుకోలేదా? ఆ వాయువు అందుబాటులో లేకపోతే వెంటిలేటర్ మీద వున్న రోగులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్న విషయం సంబంధిత అధికారులకు తెలియనిదా? ముఖ్యమంత్రి యోగి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద నగరంలోనే పరిస్థితి ఇదైతే, మారుమూల పల్లెల పరిస్థితి ఏమిటి? కరుడుగట్టిన ఉదాసీనతకు ఇంతకుమించి రుజువేమిటి? పైగా ఈ ఉదంతంలో ప్రభుత్వం తప్పేమీ లేదని సాధారణ రోగాల వల్లనే మరణాలు సంభవించాయని ఆ ముఖ్యమంత్రి చెపుతున్నారు. అలా ఒక తప్పిదాన్ని వెనకేసుకు రావడం వల్ల ఆ తరహా తప్పిదాల్ని ప్రోత్సహించినట్టు కాదా? అయితే ఇది ఉత్తరప్రదేశ్‌కే పరిమితమైన రోగం కాదు. దేశవ్యాప్తంగా ఉంది. గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో ఒకే ఊరిలో రెండువారాల్లో పదిహేను మంది మరణించినపుడు సరైన కారణాలు తెలుసుకోకుండానే ప్రభుత్వం ప్రకటించింది- ‘అవి కలుషితాహారం వల్ల జరిగిన మరణాల’ని. అయితే వాస్తవానికి మన్య ప్రాంతంలో విష జ్వరాలు ప్రబలడం, రక్షిత నీరు, ఆహారం, వైద్యసేవలు అందుబాటులో లేక పరిస్థితి తీవ్రరూపం దాల్చడం నిత్యకృత్యమైంది. ఆరోగ్య సేవల్ని మెరుగుపరచడంలో వైఫల్యాన్ని ఒప్పుకోకుండా సాకులు వెదకడం కూడా అంతే రివాజుగా మారింది. ప్రాథమిక ఆరోగ్యరంగం పటిష్టం కానంత వరకు పరిస్థితిలో ఎటువంటి మార్పురాదు. అది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. నిధులు, ప్రణాళికలు, వాటి వెనుక చిత్తశుద్ధీ అవసరం. ముందుగా ప్రజల ప్రాణాల్ని విలువైనవిగా గుర్తిస్తే ప్రజారోగ్యం పట్ల ఉదాసీనత తగ్గుతుంది. ఇది దేశవ్యాప్తంగా రావాల్సిన మార్పు.

-డా. డివిజి శంకరరావు