సబ్ ఫీచర్

పెట్రోనీతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్పావలా సరుకు.. మూడు రూపాయల పన్ను అన్నదే పెట్రోనీతి. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజల పట్ల ప్రభుత్వం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తోందో తేటతెల్లమవుతోంది. ప్రపంచ విపణిలో ముడి చమురుతో, దేశీయ ఇంధన ధరలు ముడిపెట్టామని, అది రోజువారీగా మార్పులకు లోనవుతుందనీ ప్రభుత్వం చెప్పింది. ఆ రకంగా చూస్తే అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడల్లా ఇక్కడ వినియోగదారునికి ఆ మేరకు ఊరట కలగాలి. అయితే 2014లో ధరకన్నా నేడు సగం ధరకి ముడి చములు లభిస్తున్నా, వినియోగదారునికి ఏమాత్రం ఊరట లేదు. లీటరు ముప్పై రూపాయలకు దొరకాల్సిన పెట్రోల్ డెబ్బయి రూపాయలకు గానీ దొరకడం లేదు. డీజిల్‌దీ అదే తీరు. అంటే సరుకు అసలు ధరకి మించి కొసరు పన్నులు వడ్డిస్తున్నారన్నమాట. ముప్పై రూపాయల వస్తువుకి నలభై రూపాయల పన్ను వడ్డించడం బహుశా ప్రపంచంలో మరెక్కడా జరగదు. అటు పేద దేశాల్లో, ఇటు నియంతృత్వ దేశాల్లో జరగని దోపిడీ మన ప్రజాస్వామ్య దేశంలో జరుగుతోంది. నిత్యం సంక్షేమ మంత్రం జపిస్తున్న ప్రభుత్వ హయాంలో ఇలా జరగడం బాధ కలిగించే విషయం. ‘పెట్రోల్ కంపెనీల దైనందిక వ్యవహారాలలో కలుగజేసుకోం, వారి నిర్వహణ సామర్ధ్యంపై తప్ప’ ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఆయా సంస్థలు వినియోగదారులను ఎంతగా బాదుతున్నదీ పట్టించుకోరన్నమాట. ప్రభుత్వం కలుగజేసుకోకపోవడానికి ఇది వారి అంతర్గత వ్యవహారం కాదు. ప్రజలకు సంబంధించినది. పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది పెనుభారంగా మారుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గిస్తే వాటి ధరలు కిందకు దిగుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోకపోతే ప్రజలు ఇప్పటికి బాధలు మింగినా సమయం వచ్చినపుడు గుణపాఠం నేర్పుతారు. ప్రజారవాణా రంగానికి ఊతమిచ్చే చర్యలు ఆర్థికాభివృద్థికి కూడా కీలకం.

-డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపి, పార్వతీపురం