సబ్ ఫీచర్

కాలుష్యాన్ని చెప్పే ‘చాట్‌బాత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యనగరంలో ఏఏ ప్రాంతాల్లో వాయుకాలుష్యం ఏ పరిమాణంలో ఉందో తెలుసుకునే సౌలభ్యాన్ని ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ అందిస్తున్న ‘చాట్‌బాత్’ అనేది మెసేజింగ్ యాప్. ఫేస్‌బుక్ వినియోగదారుడు నగరంలో ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుపుతూ ఆ ప్రాంతంలో వాయుకాలుష్యం ఏ పరిమాణంలో ఉందో తెలుసుకునేందుకు ఈ చాట్‌బాత్ యాప్ ద్వారా ఓ మెసేజ్ పెడితే చాలు. ఆ యాప్ ఆ మెసేజ్‌ను సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్‌లో ఉండే సమాచారం ఆధారంగా విశే్లషించి ఆ నిర్ణీత స్థలంలో ధూళి, తేమ ఏ స్థాయిలో ఉన్నాయో, కాలుష్యం ఏ పరిమాణంలో ఉందో టెక్స్ట్ రూపంలో సమాచారాన్ని మెసేజ్ పంపుతుంది. ఇదంతా నిమిషాల్లో జరిగిపోతుంది. నగరంలోని ప్రధానమైన ఆరు ప్రాంతాల (జూపార్క్, సనత్‌నగర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ప్యారడైజ్, అబిడ్స్, జూబ్లిహిల్స్)లో మోనిటరింగ్ స్టేషన్ల ద్వారా ఈ గణాంకాలు అందిస్తారు. చాట్‌బాత్ ఇచ్చే సమాచారంలో నగరంలోని గాలిలో ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్ ఏ పరిమాణంలో ఉన్నాయోకూడా వివరాలు ఉంటాయి. యూఎస్ రాయబార కార్యాలయం అందించిన మోనిటరింగ్ విధానంతో ఈ గణాంకాల విశే్లషణ జరుగుతుందని ‘ఎయిర్‌ఎయిర్‌ఎయిర్.ఆర్గ్ ఫౌండర్ అమృత్‌శర్మ తెలిపారు. ఇప్పటికి వెయ్యిమంది వినియోగదారులు ఖాతా తెరిచారని, పది భాషల్లో తమ చాట్‌బాత్ సమాచారాన్ని అందిస్తుందని, ఉదయం 6 గంటల నుంచి వివరాలు అందించగలమని, కాలుష్యం స్థాయిని బాగుంది, సంతృప్తికరం, అనారోగ్యకారకం, ఏమీ బాగోలేదు అన్న సంక్షిప్త సమాచారం కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

రవళి