సబ్ ఫీచర్

సాంకేతిక సాఫల్యతలో నవ్య భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత అధునాతన ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవ కాలగమనంలో పురోగమిస్తోంది. రెండు శతాబ్దాలలో సాధించిన శాస్ర్తియ జ్ఞానానే్వషణతో, అధునాతన నాగరికతా సమాజం సంతృప్తి చెందినా తన అనే్వషణ ఆపలేదు. మానవ మేధ సంపన్నత క్రమేపీ అంతర్జాల ప్రజ్వలనంతో సమ్మిళితమై దూసుకుపోతోంది. సాంకేతిక ప్రస్థానం సృష్టించే జీవనశైలిని అందుకోలేని దేశాలు వెనుకబడిపోతుంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశం డిజిటల్ ఇండియాగా రూపుదిద్దుకుంటోంది. యాంత్రికత, జన జీవనాన్ని శాసించడమే నవ్యతగా భావించిన రోజులనుంచి కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్ కొంగొత్త విప్లవీకరణను ఆహ్వానిస్తోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు సత్ఫలితాలు అందుకుంటున్న సాంకేతిక సమాజం, కార్పొరేట్ రంగం, విద్య వైజ్ఖానిక సంస్థల సంయుక్త కార్యాచరణతో పోటాపోటీగా దూసుకుపోతోంది. నిపుణత ప్రధాన లక్ష్యమైంది.
జాతిపిత గాంధీజీ నిష్క్రమించే నాటికి రేడియో, రాజీవ్ హయాంలో కంప్యూటర్లు ప్రవేశించాయి. నరేంద్రమోదీ హయాంలో మొబైల్ ఫోన్లు, డిజిటల్ రంగం ఊపందుకుంది. ప్రస్తుత మనదేశ జనాభా 134 కోట్లనుంచి 2030 నాటికి అంచనగా 150 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. స్వాతంత్య్రం సాధించిన తొలి దశాబ్దాలలో ఆకలి దప్పులు లేని సమాజమే లక్ష్యం. దస్తులు, వసతి సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాల్సి వచ్చింది. హరిత విప్లవం నాందిగా అధిక ఆహారోత్పత్తి సాధించినట్టే సాంకేతిక విప్లవం వినియోగించుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందింపచేసుకోవాలని మోదీ ఫ్రభుత్వం కృతనిశ్చయంతో వుంది.
ఇంటింటా ఇంటర్నెట్
జనాభాలో 25-35 సంవత్సరాల వయసున్న 65 శాతం యువశక్తి కలిగివున్న మన దేశం, డిజిటల్ నిరక్షరాస్యత ఎదుర్కొంటుండడం కారణంగా దాదాపు 95 కోట్ల మందికి అంతర్జాలం అందుబాటులో లేదని ఒక తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. విద్యాసంస్థలలో సంస్థాగత శిక్షణ నైపుణ్య కార్యక్రమాలు మరింత పెంపుచేసి డిజిటల్ అక్షరాస్యను పెంపొందించాల్సిన అవసరం వుంది. స్మార్ట్ఫోనుల ధరలు దిగివస్తున్నా, దేశంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య ప్రభుత్వం ఆశించినంతగా పెరగడంలేదు. దానితోపాటు సైబర్ నేరాల బెడద కూడా తట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కేవలం సుమారు 35 కోట్లమంది సాంకేతిక అంతర్జాలాన్ని ఉపయోగించుకుంటున్నట్టు అసోచాం డెలాయిట్ సంయుక్త అధ్యయన నివేదిక స్పష్టం చేస్తోంది. మారుమూల గ్రామాలకు కూడ డిజిటల్ సేవలు విస్తరింపచేసే లక్ష్యంతో పాఠశాలల్లోకూడా పెద్దఎత్తున శిక్షణ తరగతుల, నైపుణ్య భారత్ ద్వారా నిపుణుల ప్రతిభను సద్వినియోగం చేసుకునేందుకు, ప్రపంచస్థాయి కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్య అనుబంధం కోసం, పెట్టుబడుల ఆర్థిక వికాసం సాధించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. కంప్యూటింగ్ సామర్ధ్యం, మహానగరాల విద్యా వికాస సౌలభ్యం వున్న కుటుంబాలలోని బాల బాలికలకు, విద్యార్ధి, యువతరం, మహిళలు, వివిధ రంగాలలో పరిజ్ఞానం వినియోగ స్థాయిలో గర్వకారణంగా కనపడుతున్నా స్థానిక భాషలలో సాంకేతిక పరిజ్ఞానం లేదు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అంతంతమాత్రంగా అందుబాటులో ఉంది. నేషనల్ సాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) డేటా ప్రకారం మన దేశంలోని గ్రామీణ జనాభాలో 8.8 శాతం, నగర, పట్టణ ప్రాంత జనాభాలో 30.2 శాతం కంప్యూటింగ్ సామర్ధ్యం కలిగివున్నారు. డెస్క్‌టాప్, లాప్‌టాప్, పామ్‌టాప్, నోట్‌బుక్, స్మార్ట్ఫోన్, టాబ్లెట్స్ వినియోగ పరిజ్ఞానం ఈ సామర్ధ్యంగా నిర్వచింపబడుతోంది. ఆస్ట్రేలియన్ రీసెర్చ్ కౌన్సిల్ అధ్యయనం ప్రకారం, కంప్యూటింగ్ సామర్ధ్యం అంటే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇంటర్నెట్ పెనిట్రేషన్ సాంకేతిక ప్రక్రియతో లింక్ కాకుండా కేవలం గాడ్జెట్స్ వినియోగ సర్వేకి సంబంధించిన డేటాగా మాత్రమే పరిగణించారు. కేరళ 32,3 శాతంతో అగ్రస్థానంలో వుండగా చత్తీస్‌గఢ్ 2.9 శాతంతో అతి తక్కువగా వుంది. ఇక ది టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా తాజాగా నివేదిక ప్రకారం 2016 సెప్టెంబర్ నాటికి మన దేశంలో 36.74 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. టిఆర్‌ఎఐ డేటా ప్రకారం పట్టణ, నగర ప్రాంతాలకు సంబంధించి వంద మందికి 61.9 సంఖ్య కాగా గ్రామీణ భారతంలో 13.7 ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య వుంది. డిజిటల్ ఇండియా రూపకల్పన లక్ష్య సాధనలో భాగంగా భారత్ నెట్ ప్రాజెక్టు 2.5 లక్షల గ్రామ పంచాయితీలను డిజిటల్ అనుసంధాన కృషితో ముందంజ వేస్తోంది.
నవ్యాంధ్రలో...
నవ్యాంధ్ర నిర్మాణంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్, సైబరాబాద్ కోవలో అమరావతి నగరాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు ముందు వేస్తున్నారు. 2022 నాటికి దేశంలో 36 అగ్రగామి రాష్ట్రాలలో తలసరి ఆదాయం రు.2.95 లక్షలు, 2029 నాటికి రు.9.65 లక్షలు, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాల రాష్ట్రంగా రు.1.67 కోట్లు సాధించాలనే లక్ష్యంతో బహుశా అంత స్వాప్నిక విజయాన్ని అభిలషించే ముఖ్యమంత్రి కొనసాగే అవకాశం నవ్యాంధ్రకు దక్కింది.

-జయసూర్య.. 9440664610