సబ్ ఫీచర్

పోలవరం ఎంతెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా మూడేళ్లుగా ముందడుగులు వేస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పాలించిన అందరి ముఖ్యమంత్రులకంటే సుదీర్ఘ అనుభవం వున్న చంద్రబాబుకు దీక్షాదక్షతలకు కొదువలేదు. నదీ జలాల సద్వినియోగం, నగర నిర్మాణాలు ప్రధాన ఎజెండాగా పోలవరం, అమరావతి రెండూ రాష్ట్ర ప్రభుత్వ సామర్ధ్య ప్రచార లక్ష్యాలుగా పరిణమించాయి. కేంద్రంలో ఎన్‌డిఏ ఫ్రభుత్వ భాగస్వామ్యం వున్నా ధారాళంగా నిధులు సమకూర్చడంలో మోదీ ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోంది. కేంద్రప్రభుత్వ వైఖరి అనుమానాలకు తావు ఇస్తోంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్రావనికి ఒక వరంగా కేంద్రం పోలవరానికి జాతీయ హోదా ప్రసాదించింది. 2018 నాటికి పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తోంది. 2009-10 అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రు.16,100 కోట్లు కాగా 2019 నాటికి రు 50,000 కోట్లు అవసరం వుంటుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. తాజాగా మంజూరు చేసిన నిధులతో కలిపి కేంద్రం ఇప్పటికి కేవలం రు. 4,328 కోట్లు మంజూరు చేసినట్టయింది. గతంలో తాము ఖర్చుపెట్టిన మూడువేల కోట్లు విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విన్నపాలు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఈ ఏడు ఆగస్టులో మరో 979 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ హోదా ప్రతిష్ఠ కలిగిన ఈ ప్రాజెక్టు వేలాది కోట్లు విడుదల చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రు 100 కోట్లు మాత్రమే కేటాయించడం రాష్ట్రప్రభుత్వానికి విస్మయం కలిగిస్తోంది. జాతీయ హోదా దక్కించుకున్న ప్రాజెక్టుల నిర్మాణానికి 90 శాతం నిధులు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఎఐబీపి)నుంచే విడుదల చేయాలి. దీనికి భిన్నంగా పోలవరం నిర్మాణానికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రు 5700కోట్లు పైగా ప్రభుత్వమే ఖర్చు చేసింది. ఒప్పందం ప్రకారం సకాలంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడాదికి కనీసం అయిదువేల కోట్లు పైగా వినియోగించాలి. కానీ కేంద్రం వైఖరి ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకునే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని అనుమానం వస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ఫ్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకోవడం సందేహాలకు కారణమవుతోంది. 2018లోగా పూర్తి కాకపోతే కేంద్రం ఇచ్చే గ్రాంటు రుణం అవుతుందా? అనుమతి లేకుండా ఒకవేళ అదనంగా వ్యయం చేయవచ్చా? కేటాయింపులు నామమాత్రంగా ఎందుకు వుంటున్నాయి? భూసేకరణ పునరావాసానికే రు 32,000 కోట్లు ఆమోద యోగ్యమా? గుత్తేదారులపై తీవ్ర ఆరోపణలు, సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేసుకుంటోందా? గుత్తేదారుల రాజకీయ పలుకుబడి కారణంగా ఒత్తిళ్లకు జల వనరుల శాఖ అధికారులు గురి అవుతున్నారా? టిడిపి ప్రభుత్వం ఇందిరా సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుమార్చినప్పటినుంచి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలఎత్తుతున్నాయి. కేంద్రంనుంచి నిధులు రావడం ఆలస్యమైతే రాష్ట్రప్రభుత్వం వద్ద వున్న నిధులతో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి, కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపైసా ఖర్చు భరించదా? అసలు ఇది జాతీయ హోదా ప్రాజెక్టు అవునా కాదా? ఇలాంటి సందేహాలు ఎన్నో.

-జయసూర్య