సబ్ ఫీచర్

ఫ్రమాద ఘంటికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నప్పటికీ భారత్‌లో జాతీయ స్థాయిలో ఈ సంఖ్య తగ్గకపోగా ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంలో భారత్ ప్రపంచంలోనే ఆందోళన కలిగిస్తున్న దేశంగా ఉంది. ‘లానె్సట్’ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ -2016 నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. గడచిన ఐదు దశాబ్దాలలో జీవనప్రమాణాలు పెరగడం, వైద్యసేవలు, చికిత్సలు అందుబాటులోకి రావడం, అక్షరాస్యత మెరుగుపడటం వల్ల చిన్నపిల్లల మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మేలైన పరిణామాలు సంభవించి అన్ని వయసుల చిన్నారుల మరణాల రేటు గణనీయంగా తగ్గింది. అయితే భారత్‌లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. స్పష్టంగా చెప్పుకోవాలంటే 2016లో 0.9 మిలియన్ల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు భారత్‌లో మరణించగా చిన్నారుల మరణాలు రేటు ఎక్కువగా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో నైజీరియా (0.7 మిలియన్), డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (0.3 మిలియన్) మూడోస్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 1970లో 16.4 మిలియన్లమంది ఐదేళ్లలోపు చిన్నారులు మరణించగా 2016 నాటికి గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఆ ఏడాది 5 మిలియన్లకన్నా కాస్త ఎక్కువ సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాంతీయంగా చూస్తే దక్షిణాసియాలో 1.2 మిలియన్ల మంది అంటే 24.8 శాతం మంది చిన్నారులు మరణించారు. కాగా ప్రపంచవాప్యంగా ఆయుర్దాయం ఎక్కువగా ఉండేవారి సంఖ్య చెప్పుకోదగ్గరీతిలో పెరిగింది. అంటే అన్ని వయసులవారి పరంగా చూస్తే మరణాల రేటు బాగా తగ్గిందన్నమాట. ఎక్కువ ఆయుర్దాయం ఉన్నవారి విషయంలో మహిళల సగటు జీవనకాలం 75.3 సంవత్సరాలుకాగా పురుషుల్లో 69.8 సంవత్సరాలుగా నమోదైంది. అత్యధిక ఆయుర్దాయం కలిగినవారిలో జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ప్రజల సగటు ఆయుర్దాయం 83.9 సంవత్సరాలు. స్వల్ప ఆదాయం కలిగిన దేశాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడం మరో పరిణామం. 2016లో సంభవించిన మరణాల్లో 72.3 శాతం వివిధ రోగాల కారణంగా సంభవించాయి. ముఖ్యంగా గుండెలోని కండరాలకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను సరఫరా చేసే వ్యవస్థలో లోపాల కారణంగా ఎక్కువమంది మరణించారు. అదే సమయంలో అల్పాదాయ దేశాల్లో ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా అత్యధికంగా మరణాలు సంభవించాయి. 2016లో విశ్వవ్యాప్తంగా పైన పేర్కొన్న గుండెజబ్బు కారణంగా 9.48 మిలియన్ల మంది మరణించారు. 2006తో పోలిస్తే ఆ మరణాల సంఖ్య 19 శాతం పెరిగిందన్నమాట. అదే కాలంలో మధుమేహం వల్ల సంభవించిన మరణాల సంఖ్య 1.43 మిలియన్ కాగా 2016 నాటికి 31.1 శాతం ఎక్కువ అన్నమాట. ఔషధాలను తట్టుకొని పెరుగుతున్న క్షయ, డెంగ్యూ వ్యాధుల వల్ల కలిగే మరణాల సంఖ్య 2016లో గణనీయంగా అంటే 81.8, 67.6 శాతం మేరకు పెరగడం ఆందోళన కలిగించే అంశం. కాగా ఇన్‌ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల సంఖ్యమాత్రం గణనీయంగా తగ్గడం ఒక్కటే కాస్త చెప్పుకోదగిన అంశం.

-కృష్ణతేజ