సబ్ ఫీచర్

అభివృద్ధికన్నా బుల్లెట్ రైలు ముఖ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కాదు. అభివృద్ధి చెందుతున్న క్రమంలోను, దశలోను, మూల పెట్టుబడి (కాపిటల్ ఇనె్వస్ట్‌మెంట్) అంతా ఉత్పత్తి కారకమైన ప్రాజెక్టుల మీదనే పెట్టాలి. నీటిపారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, వౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ, విద్య మొదలైన ఉత్పాదక రంగాల్లోనే అత్యధిక మూల పెట్టుబడిని వినియోగించాలి. అందువలన దేశ స్థూల ఉత్పత్తి బాగా పెరిగి దేశ సంపద పెరుగుతుంది. అలా కాకుండా అనుత్పాదక పనులమీద ఎక్కువ పెట్టుబడిని వినియోగిస్తే దేశాభివృద్ధి మందగిస్తుంది.
అయితే ఇప్పుడు దేశంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్పాదక పెట్టుబడులకు (ప్రణాళికా వ్యయం) ఇంచుమించు సమానంగా ఉచితాలు, రాయితీలు, సంక్షేమ పథకాలు, ఇతర అనుత్పాదక పనులమీదనే (ప్రణాళికేతర వ్యయం) పెట్టుబడి ధనాన్ని వినియోగిస్తున్నారు. అటువంటివి చాలానే వున్నప్పటికీ ఇప్పుడు కేంద్రం తలపెట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టు అలాంటిదే అనిపిస్తున్నది. అహ్మదాబాద్‌నుండి బొంబాయికి దూరం 500 కిమీ. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గరిష్ఠ వేగం ఇప్పుడు వందనుండి 120 కిమీ వుంది. ఆ రెండు నగరాల మధ్య ఇప్పుడు ప్రయాణ కాలం 7 గంటలని చెబుతున్నారు. బుల్లెట్ రైలులో అయితే 3 గంటల్లో వెళ్లవచ్చంటున్నారు. ఇంత దూరం 7 గంటల్లో ప్రయాణించడం ఎక్కువ సమయం కాదు. సాధారణ ప్రయాణీకులెవరికీ ఇది ఇబ్బంది కాదు. ఇంతకు మించి మరీ బిజీగా వుండి తక్కువ సమయంలో వెళ్లాలనుకునే అతి కొద్దిమందికి విమాన ప్రయాణం వుంది. విమానంలో సుమారు రెండుగంటల్లో వెళ్లవచ్చును. అలాగైనప్పుడు మూడు గంటల్లో ప్రయాణించే అతి పెద్ద పెట్టుబడితో నిర్మించే బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎందుకు?
రెండేళ్ల క్రితమే ప్రధానమంత్రి ఈ బుల్లెట్ రైలు గురించి ప్రస్తావించారు. అప్పుడు దీని లైను నిర్మాణం అంచనా వ్యయం 80 వేల కోట్లు అన్నారు. ఇపుడు జపాన్‌తో ఒప్పందం తర్వాత ప్రకటనలో దీని అంచనా వ్యయం లక్షా పదివేల కోట్లని చెబుతున్నారు. అంటే రెండేళ్లలో దీని అంచనా వ్యయం 30వేల కోట్లు పెరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు ఐదేళ్లు పట్టవచ్చు అంటున్నారు. అప్పటికి ఈ నిర్మాణ వ్యయం 1 లక్షా 50 వేల కోట్లు కావచ్చును. 7 గంటల్లో రైలుమీద, రెండు గంటల్లో విమానం మీద ప్రయాణించే సదుపాయం ఇప్పటికే వున్నప్పుడు 1లక్షా 50 వేల కోట్ల పెట్టుబడితో మూడు గంటల్లో ప్రయాణించే బుల్లెట్ రైలు వేయడం అవసరమా? బొంబాయి-అహ్మదాబాద్ మధ్య విమాన సర్వీసులు ఇప్పటికే బాగా వున్నాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఎక్కువగానే వున్నాయి.
ఇంత పెట్టుబడి పెడితే పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు లాంటివి మూడు కట్టవచ్చును. వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది. లేదా దేశంలోని కరెంటు కష్టాలు తీరడానికి భారీ విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు కట్టవచ్చును. భారీ స్టీలు ప్లాంటులు గానీ, హెవీ మెషినరీ ప్రాజెక్టులు గానీ స్థాపించవచ్చు. లేదా దేశవ్యాప్తంగా పారిశ్రామిక వౌలిక సదుపాయాలు కల్పించవచ్చును. ఇటువంటి నిర్మాణాలవలన దేశం యొక్క ఉత్పాదన సామర్ధ్యం పెరుగుతుంది. మనదేశం రాష్ట్రాల సమాఖ్య. అనేక రాష్ట్రాల్లో సరిపడిన పెట్టుబడులు లేక, అభివృద్ధి పథకాలు చేయలేకపోతున్నాయని రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించుకుంటున్నాయి. కేంద్రానికి లభించే ఆదాయం ముఖ్యంగా రాష్ట్రాలనుండే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతాన్ని రాజధాని లేకుండా నిలబెట్టారు. ఇప్పుడు ఆంధ్ర రాజధాని నిర్మాణం కోసం నిధులు సరిగా అందక గిజగిజలాడుతున్నది. కేంద్రం వాగ్దానం చేసిన నిధులనే కొసరి కొసరి ఇస్తున్నది. అలాగే ఇతర రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం ప్రదర్శించవలసి ఉంది. అందుకోసం దేశవ్యాప్తంగా సమర్ధవంతమైన రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నిధుల పంపిణీ జరగాలి. లేకపోతే కొన్ని రాష్ట్రాలు ముందుకెళతాయి, కొన్ని వెనకబడతాయి. స్పర్ధలేర్పడతాయి.
ఇప్పటికే రైలు ప్రయాణీకులపై చార్జీలు బాగా పెంచారు. మళ్లీ పెంచబోతున్నారు. సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే రాయితీలు తొలగిస్తారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకంటే రైల్వేలను అభివృద్ధి చేయడం కోసమంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో మనది ఒకటి. ఇంత పెద్ద వ్యవస్థ మీద వచ్చే ఆదాయం, లాభాలు దాని అభివృద్ధికి చాలడం లేదని, ప్రయాణీకుల మీద చార్జీల భారం వేస్తున్నది. అలాంటప్పుడు ఈ సూపర్ లగ్జరీ బుల్లెట్ రైలు, ఇంత పెట్టుబడితో ఎందుకు? చార్జీలుపెంచడమే కాకుండా, ఇతర పద్ధతుల ద్వారా ప్రయాణీకులనుండి డబ్బు గుంజుతున్నారు. ఇందుకు ఉదాహరణ తత్కాల్ రిజర్వేషన్! ఒకే రైలులో ఒకే పెట్టెలో అదనపు సదుపాయాలు లేకుండానే రైల్వేవారు నిర్ణయించిన చార్జీలకంటే ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికి, ప్రయాణం రోజునే రిజర్వేషన్ ఇస్తారు. ఇదే తత్కాల్! అలా ఎక్కువ డబ్బు కట్టలేక, అసలు చార్జీతో టికెట్టు తీసుకునే ప్రయాణీలకు 20 రోజుల ముందు వెళ్లినా రిజర్వేషన్లు లభించడంలేదు. ఈ పద్ధతి రాజ్యాంగం పౌరులకు దఖలు చేసిన సమానత్వ హక్కుకు విరుద్ధం కాదా? 125 కోట్లమంది ప్రజల్లో ఒక్కరు కూడా ఈ పద్ధతిని ఎందుకు ప్రశ్నించడంలేదు? ఇదంతా రాజ్య గుత్త్ధాపత్యం (స్టేట్ మోనోపలీ)! ప్రైవేటు గుత్త్ధాపత్యం కంటే రాజ్య గుత్త్ధాపత్యం ప్రజలకు ఎక్కువ నష్టం కలిగిస్తుందని ఒక ఫ్రెంచి ఆర్థిక శాస్తవ్రేత్త తన సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నారు. ఈ గ్రంథానికే ఆయనకు, క్రితంసారి, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమానమిచ్చారు. ఎందుకంటే ప్రభుత్వ గుత్త్ధాపత్యాన్ని ప్రజలు నియంత్రించలేరు. ప్రైవేటు గుత్త్ధాపత్యాన్ని ప్రభుత్వము, ప్రజలు నియంత్రించగలరు.
బుల్లెట్ రైలుగానీ, అటువంటి లగ్జరీ ప్రాజెక్టులు గానీ ‘గజమాల’ వంటివి. ఒక నాయకునికి వేల రూపాయల ఖర్చుతో వేసే గజమాల ఎంత ప్రయోజనం కలిగిస్తుందో ఇటువంటి లగ్జరీలు కూడా దేశానికి అంతే ప్రయోజనాన్ని కలిగిస్తాయి! కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు, ఇతర రాజకీయ నేతలూ దేశ సంపదకు ‘్ధర్మకర్తలు’ (ట్రస్టీలు) మాత్రమే! సొంతదారులు కారు. ప్రజలే సొంతదారులు! దేశ సంపదను అవినీతిపాలు కాకుండా కాపాడడం ఎంత ముఖ్యమో దానిని సమర్ధవంతంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వాలకు. ఒక్కరోజు ఓటుతో అయిదేళ్ల అధికారాన్ని ప్రజలు నమ్మకంతో వారికి అప్పచెపుతారు.

-మనె్న సత్యనారాయణ సెల్: 99890 76150