సబ్ ఫీచర్

ప్రాణాలు తీస్తున్న లిఫ్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుళ అంతస్తుల భవనాలు, అపార్టుమెంట్లలో ఇటీవలి కాలంలో జరిగిన ‘లిఫ్ట్’ల ప్రమాదాలలో మరణాలు సంభవించాయి. గత నెలలో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో జీవితభీమా ఉద్యోగి ఒకరు మరణించిన తీరు విషాదానికి కారణమైంది. నిజానికి ఆయా భవంతులు, అపార్టుమెంట్లలో లిఫ్ట్‌ల నిర్వహణపై అటు బిల్డర్లకు, ఇటు నివాసం ఉంటున్నవారికి శ్రద్ధ లేదు. పర్యవేక్షించే అధికారులు లేరు. అసలు లిఫ్ట్‌ల నియంత్ర బాధ్యత ఎవరిదంటే ఎవరికీ తెలియదు. దక్షిణాది రాష్ట్రాలలో లిఫ్ట్‌ల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని అమలు చేసి పర్యవేక్షించేందుకు చట్టాలు, యంత్రాంగం ఉన్నాయి. కాని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రం లిఫ్ట్‌ల నియంత్రణ చట్టాలు లేకపోవడం విషాదం. దక్షిణాది రాష్ట్రాలలో చెన్నై, బెంగళూరు తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. గడచిన మూడేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. ఎక్కడికక్కడ బహుళ అంతస్తుల భవనాలు, అపార్టుమెంట్లు పెరిగిపోయాయి. అయితే లిఫ్ట్‌ల నిర్వహణపై శ్రద్ధ లేక, జిహెచ్‌ఎంసి అధికారులు పట్టించుకోక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్త అపార్టుమెంట్లు, భవనాలు నిర్మించేటపుడు లిఫ్ట్‌లు పెట్టుకునే వెసులుబాటుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే లిఫ్టులను పెట్టుకునేందుకు ఎవరు అనుమతి ఇవ్వాలన్నది ప్రత్యేకంగా లేదు. అందువల్ల ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. లిఫ్ట్ యాక్ట్ వస్తే తప్ప ప్రమాదాలు తగ్గవని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు విద్యుత్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. జి-3 నిర్మాణాలకు లిఫ్టుల ఏర్పాటు తప్పనిసరి అని నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బిసి) స్పష్టం చేస్తున్నది. ఒకవేళ లిఫ్టులు లేకపోయినా ‘ఎలివేటర్’ సౌకర్యం అయినా ఉండాల్సిందే. నిజానికి లిఫ్ట్ సౌకర్యం ఉందా లేదా అన్నది జిహెచ్‌ఎంసి అధికారులు చూడాలి. అయితే దాని నిర్వహణ జరుగుతున్నదా లేదా అన్నది వారికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇదే సమస్యకు కారణం. లిఫ్ట్‌ల నాణ్యత లోపం, నిర్వహణ లోపం, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ప్రమాదానికి ప్రధాన కారణాలు. 2015 నవంబర్‌లో దిల్‌సుఖ్‌నగర్ శ్రీ చైతన్య కళాశాలలో నర్సరీ చదువుతున్న జైనాబ్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటన గుర్తుండే ఉంటుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అదే ఏడు డిసెంబర్‌లో ఎర్రగడ్డలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో లిఫ్ట్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ సుచిత్ర ప్రాంతంలోని ఒక హోటల్‌లో ముగ్గురు మహిళలు లిఫ్ట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘటన గత ఏడాది మార్చిలో జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

-కృష్ణతేజ