సబ్ ఫీచర్

‘అంతర్జాతీయ ప్రభుత్వం’ ఆచరణ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణుయుద్ధాన్ని నివారించడానికి, తద్వారా మానవజాతి హననాన్ని ఆపడానికి అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడాలని ఱఉ్గ్గ గశ్రీడడఉజ అనే ఆంగ్ల రచయత ళ్జ్జో డఉ్ళఉ శ్రీ్ళజఉ్గ అనే గ్రంథంలో 60 ఏళ్ల క్రితమే చెప్పాడు. సుస్థిర ప్రపంచశాంతి నెలకొల్పడానికి ప్రాక్పశ్చిమ దేశాల మధ్య వైరభావాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడాలన్నాడు. ఇదెంతో మానవీయ భావన. అప్పుడు ప్రపంచం కేవం రెండు శిబిరాలుగా మాత్రమే వుండేది. ఒకటి క్యాపిటలిస్టు శిబిరం, రెండవది సోషలిస్టు శిబిరం. ఇంకో విధంగా చెప్పాలంటే ఒకటి పశ్చిమ దేశాల శిబిరం, రెండవది తూర్పు దేశాల శిబిరం. అమెరికా, రష్యాల మధ్య అగ్రదేశాధిపత్యం కొరకు బలమైన పోటీ వుండేది. ఆయుధాలు సమకూర్చుకోవడంలో, అణుబాంబుల తయారీలో రెండు దేశాల నడుమ తీవ్రమైన పోటీ ఉండేది. మూడవ ప్రపంచ యుద్ధ భయమూ ఉండేది. అణ్వాయుధాలను ప్రయోగించడంలో తయారు చేయడంలో ప్రాథమిక దశలోనే వున్న రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆ యుద్ధం వల్ల జరిగిన అపార నష్టం అప్పటికి ప్రపంచ దృష్టిని దాటిపోలేదు. ఇక మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అది అణుయుద్ధమేనని, దానివల్ల జరిగే నష్టం అపారమని, దాన్ని నివారించాలంటే అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడాలని రస్సెల్ చెప్పాడు. కాని అదిప్పటికీ సాధ్యం కాలేదు. పైగా అణ్వాయుధ పోటీ ప్రపంచ దేశాల మధ్య విపరీతంగా పెరిగింది. ప్రపంచమంతా ఆయుధ భాండాగారమైంది. ప్రపంచమే ఒక నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుంది. అన్ని దేశాలూ కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధ భయాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. సరిహద్దు తగాదాలు, ఆక్రమణలు, ఆధిపత్యాలు, అగ్రరాజ్యాధిపత్య పోటీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ప్రపంచం ప్రమాదపుటంచుకు చేరుకుంది. రష్యా, చైనా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సులతో పాటు పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయిల్, ఉత్తరకొరియా దేశాలు న్యూక్లియర్ ప్రయోగాలు చేసామని వేలమైళ్ల దూరంలోని లక్ష్యాలను నిముషాల్లో భస్మీపటలం చేస్తామని జబ్బలు చరుచుకుంటున్నాయి. ఈ దేశాలు 15,000 న్యూక్లియర్ యుద్ధ పరికరాలను తయారు చేసుకుని ప్రపంచాన్ని శవాల కుప్పలుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ యుద్ధం వస్తే జరిగేది మానవజాతి వినాశనమే. రస్సెల్ చెప్పినట్టు అప్పుడే అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడి అణుయుద్ధాన్ని నివారించడానికి, నిరాయుధీకరణకొరకు పాటుపడుంటే ప్రపంచం ప్రమాదటంచుపై నిలబడేది కాదు గదా! మనిషి తన మరణ శాసనాన్ని తానే లిఖించుకునే వాడు కాదు గదా!
హాకింగ్ మాట అదే... బ్రిటన్‌కే చెందిన మరో భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఇటీవలి కాలంలో వరల్డ్ గవర్నమెంట్ ఏర్పడాలన్నాడు. అది నేటి తక్షణావసరంగా పేర్కొన్నాడు. వరల్డ్ గవర్నమెంటు అంటే రస్సెల్ చెప్పిన అంతర్జాతీయ ప్రభుత్వం లాంటిదే. అయితే హాకింగ్ అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పడానికి కారణం రస్సెల్ చెప్పిన కారణం కంటే బలమైనది. భూతాపం పెరగడంవల్ల, ప్రకృతి విధ్వంసం వల్ల ప్రపంచ మానవాళి ఎదుర్కోబోతున్న పెను ప్రమాదాన్ని నివారించడానికి ప్రపంచ ప్రభుత్వం ఏర్పడడం ఒక్కటే మార్గమన్నాడు. అతడు ఏళ్ల తరబడి చేసిన ఫలితాల వల్ల తేలిన విషయాలను బయటపెట్టాడు హాకింగ్. క్రమక్రమంగా పెరుగుతున్న భూతాపం వల్ల అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమిపై జీవరాశులు, మనుషులు వుండలేని పరిస్థితులు దాపురిస్తున్నాయని హాకింగ్ పరిశోధనలో తేలింది. మరో రెండు డిగ్రీలు భూమి ఉష్ణోగ్రత పెరిగితే మంచు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వల్ల అనేక నగరాలు సముద్రం పాలవుతాయి. మిగతా చోట్లలో వరదలు కరువు బీభత్సం సంభవిస్తుంది. భూతాపం ఇలాగే పెరిగితే వందేళ్లలో ప్రపంచంలోని మనుషుల జనాభా సగం ఖాళీ అవుతుంది. ఏటా యాభై కోట్లమంది భూమిని ఖాళీ చేయాల్సి వస్తుంది. భూగర్భ జలాలు లభ్యం కాకుండా పోతాయి. 2100 సంవత్సరం నాటికి ఉష్ణోగ్రత 8 డిగ్రీలు పెరిగి వేడి భరించలేనంతగా అవుతుంది. వరద బీభత్సంలో 50, 60 కోట్ల మంది వెళ్లిపోవాల్సి వస్తుంది. వేడిని భరించలేక కోట్లమంది చనిపోతారు. వందేళ్ల తరువాత భూమిపై ఉండలేని పరిస్థితులు మరీ తీవ్రమై మరికొన్ని వందలేండ్లలో జీవరాశులు, మనుషులు మొత్తం మృత్యువాత పడతాయి. అందువల్ల వచ్చే వెయ్యేళ్ల లోపు మనిషి జీవించడానికి అనువైన మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సి ఉంది. వందేండ్ల లోపునే ఆ పని ప్రారంభం కావాలి. లేకుంటే మానవ జాతి మొత్తం ఈ విశ్వంలో ఉండకుండాపోతుంది. ఇది నూట యాబయి ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మానవ తప్పిదాల వల్ల, అంతులేని పారిశ్రామీకరణ వల్ల, విస్ఫోటనాల వల్ల, అణు ప్రయోగాల వల్ల ప్రకృతి విధ్వంసం వల్ల జరుగుతుంది. దీన్నుండి మానవ జాతిని కాపాడుకోవాలంటే తీవ్రమైన ప్రకృతి రక్షణ చర్యలు తీసుకోవాలి. అందుకే ఏ ఒక్క దేశమో, లేదా కొన్ని దేశాలో కృషిచేస్తే సరిపోదు. ప్రపంచ దేశాలన్నీ కలిసి వరల్డ్ గవర్నమెంట్‌గా ఏర్పడి తద్వారా చర్యలు తీసుకోవాలి. ఇవీ హాకింగ్ చెప్పిన మాటలు. అంతేకాదు ఏ చర్యలు తీసుకోకుండా ఇప్పటిలాగే ప్రపంచదేశాలుంటే భూతాపం పెరిగి భరించలేని ఉష్ణోగ్రతలతో భూమి కూడా మండిపోగలదని హాకింగ్ చెప్పాడు. అంతేకాకుండా పారిస్ ఒప్పందంనుండి అమెరికా దూరంగా వుండడం పెద్ద చారిత్రక తప్పిదమని నిర్భయంగా చెప్పాడు. ప్రపంచ ప్రభుత్వం ఏర్పడి భూమాత రక్షణకు ప్రపంచ దేశాలన్నీ సీరియస్‌గా చర్యలు తీసుకుంటే తప్ప భూమిని, భూమిపై వున్న మానవ జాతిని, జీవరాశులను రక్షించడం అసాధ్యమని హాకింగ్ సోదాహరణంగా వివరించాడు.
రస్సెల్ చెప్పింది అరవై సంవత్సరాలకు ముందయితే, హాకింగ్ చెప్పింది ఇటీవలే. ఈ రెండు సమస్యలూ అతి ముఖ్యమైనవే. ఈరోజు ప్రపంచాన్పి పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలు అవి. పాలకుల అధికార దాహం, దురాక్రమణ కాంక్ష, ఆధిపత్య ధోరణి, సామ్రాజ్యవాద వైఖరి, సుఖవాంఛ, బాధ్యతా రాహిత్యం, సంకుచిత జాతీయ భావజాలం మానవజాతి మనుగడనే ప్రశ్నార్ధకంగా చేస్తున్నాయి. యుద్ధ కాంక్ష, ప్రకృతి విధ్వంస తాత్కాలిక సుఖ వాంఛ మానవ జాతినే నిర్మూలించబోతున్నాయి. శాశ్వత దుఃఖాన్ని తెప్పిస్తున్నాయి. ఈ మారణ, మానవ హోమాలను నివారించాలంటే అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడి తగినన చర్యలు తీసుకోవడమొక్కకే మార్గమని ఆ ఇద్దరు మేధావులూ చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజూ వివిధ మాధ్యమాల ద్వారా మనం చూస్తున్న ఉద్రిక్తతల, యుద్ధ వాతావరణం, ప్రకృతి విధ్వంసం భూతాపంతో జరుగుతున్న ప్రకృతి విపరిణామాలు గమనిస్తే వరల్డ్ గవర్నమెంట్ ఏర్పాటు కావాల్సినఅవసరమెంతుందో అర్ధమవుతుంది.
స్వరూపం ఇదీ..
ఇంతకీ వరల్డ్ గవర్నమెంట్ అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక్కో ప్రభుత్వమున్నట్టే ప్రపంచమంతటికీ ఒకే ప్రభుత్వముంటుంది. ఈ ప్రభుత్వంలో అన్ని దేశాలకూ ప్రాతినిధ్యముంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానం లాగే, ఈ అంతర్జాతీయ ప్రభుత్వం ప్రపంచ మానవాళికి సంబంధించిన సమస్యల గురించి ఆలోచిస్తుంది. ఈ భూగోళం, భూగోళంపైనున్న మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రపంచ దేశాలు ఏ పనులు చేయకూడదో, ఏ పనులు చేయాలో ఈ ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ భూగోళంపై మానవజాతి, జీవరాశులు ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఉండగలిగే పరిస్థితులను కల్పించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏం చేయాలో ఈ ప్రభుత్వం చెబుతుంది. ప్రపంచ ప్రజలను, మానవ మనుగడను ప్రమాదపుటంచుల్లో నిలబెడుతున్న యుద్ధాలను, ప్రపంచ యుద్ధాలను, ఓజోన్ పొర రంధ్రాలను, భూతాపాన్ని, ప్రకృతి విధ్వంసాన్ని ఆపడానికేం చేయాలో ఈ ప్రపంచ ప్రభుత్వం ఆదేశిస్తుంది. యుద్ధరహిత, ఉద్రిక్త రహిత, కాలుష్య రహిత భూగోళాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని దేశాలు చేపట్టాల్సిన చర్యలను వరల్డ్ గవర్నమెంట్ నిర్దేశిస్తుంది. సైన్స్ విత్ హ్యూమన్ టచ్, ఎర్నింగ్స్ విత్ హ్యూమన్ టచ్‌గా ఉండే విధానాలను ప్రోత్సహిస్తుంది. మానవజాతి వినాశనానికి ప్రకృతి విధ్వంసానికి దోహదం చేసే పేలుడు పదార్ధాలను, న్యూక్లియర్ ప్రయోగాలను నిషేధిస్తూ ఆయుధరహిత ప్రపంచానికి దోహదం చేసేదే ప్రపంచ ప్రభుత్వం. స్వచ్ఛమైన గాలి, నీరు, కల్తీలేని ఆహారం ప్రకృతిలో ప్రకృతియై బతికే స్వచ్ఛమైన జీవితాన్నివ్వడానికి ప్రభుత్వాలేం చేయాలో నిర్దేశిస్తుంది. కార్బన్ ఉద్గారాలను వాతావరణంలోకి వదిలే అన్ని పరిశ్రమలను, యంత్రాలను వాహనాలను నియంత్రించడమో నిషేధించడమో తప్పదు.
ఇలా వరల్డ్ గవర్నమెంట్ మనిషిని కేంద్రంగా తీసుకుని ఈ భూగోళంపై మానవ జాతి మనుగడను శాశ్వతం చేయడానికి, సుఖ సంతోషాలతో బతకడానికి, ప్రేమమయంగా విశ్వమానవ దృక్పథంతో బతకడానికి ఏ కావాలో, ఏం చేయాలో చెబుతుంది. ప్రపంచ మానవాళి శాశ్వత మనుగడ, శాశ్వత సుఖ సంతోషాలు, ద్వేషం, అసూయ, యుద్ధాలు, ప్రకృతి ధ్వంస రచన లేని భూగోళం కోసం అంతర్జాతీయ ప్రభుత్వానే్నర్పరుచుకుని సీరియస్ చర్యలు తీసుకుంటారో తాత్కాలిక సుఖాలు భోగాలు, ఆధిపత్యాలకోసం భూగోళంపై మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం, తుదకు నాశనం చేసి శాశ్వత దుఃఖాన్ని కలిగించి చరిత్ర హీనులవుతారో 200 పైగా దేశాధినేతలు తేల్చుకోవాలి. ఏదేమైనా యుద్ధ నివారణ, గ్లోబల్ వార్మింగ్ నివారణ, ప్రకృతి సంరక్షణ నేడు ప్రపంచదేశాల ముందున్న సవాళ్లు. ఈ పెను ప్రమాదాలను నివారించడానికి వరల్డ్ గవర్నమెంట్ ఏర్పడడమే ఏకైక పరిష్కారం. అయతే ఆచరణలో అది సాధ్యమా అన్నది ప్రశ్న.

-డా.కాలువ మల్లయ్య 9849377578