సబ్ ఫీచర్

పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూ వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పరిమాణం అమాంతం పెరిగిపోతోంది. లక్షలాది సంవత్సరాల తరువాత ఈ మార్పు కనిపించింది. గడచిన ఏడాది గణాంకాల ప్రకారం భూ ఆవరణంలో లక్షలాది సంవత్సరాలలో పెరిగిన కాలుష్యం కారణంగా 20 మీటర్ల మేర సముద్ర మట్టాలు, మూడు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు సాంద్రత పెరిగిందని, మానవులు ఉత్పత్తి చేస్తున్న గ్రీన్‌హౌస్ వాయువుల పరిమాణం గడచిన సంవత్సరం 403.3 పిపిఎంగా నమోదైందని, 2015తో పోలిస్తే ఇది 3.3 పిపిఎం అధికమని ఐక్యరాజ్య సమితి ప్రపంచ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ తన వార్షిక గ్రీన్‌హౌస్ గాస్ బులెటిన్‌లో పేర్కొంది. గడచిన దశాబ్దంలో కర్బన ఉద్గారాల ఉత్పత్తి పెరుగుదల రేటు 50 శాతం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో బాన్‌లో జరిగే సమావేశంలో ప్రపంచంలోని వివిధ దేశాల పర్యావరణ మంత్రులు సమావేశం కానున్నారు. 2015లో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం అమలు, తీరుతెన్నులపై వారు చర్చిస్తారు. భూతాపాన్ని రెండు డిగ్రీల మేరకు తగ్గించేందుకు ఉపకరించే చర్యలు తీసుకునేందుకు ఈ పారిస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా ఈ ఒప్పందం నుంచి తప్పుకున్న నేపథ్యంలో బాన్ సమావేశంపై ఆసక్తి పెరిగింది. అమెరికావంటి అగ్రరాజ్యం లేకుండా మిగతా దేశాలు ఈ ఒప్పందాన్ని ఏ మేరకు గౌరవిస్తాయి, అమలు చేస్తాయన్నది ఇప్పుడు అందరి సందేహం. మానవుల వల్ల జరుగుతున్న అడవుల నరికివేత, సిమెంట్, బొగ్గు, చమురు ఉత్పత్తులు పెరగడం వల్ల కర్బన ఉద్గారాల పెద్దఎత్తున వెలువడుతున్నాయి. 2016లో వీటి స్థాయి రికార్డు స్థాయిలో నమోదైంది. ఎల్‌నినో పరిస్థితులవల్ల ఇది మరింత పెరుగనుంది. గత దశాబ్దంతో పోలిస్తే అంతకు ముందు దశాబ్దాలలో ఇంత భారీగా కర్బన ఉద్గారాలు పెరిగిన దాఖలాలు లేవు. ఐస్‌ఏజ్‌తో పోలిస్తే వందరెట్లు వేగంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. 1990 నుంచి గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదల దాదాపు 40 శాతంగా ఉంది. కర్బన ఉద్గారాలతోపాటు మిథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ల పరిమాణం కూడా బాగా పెరగడం వల్ల భూతాపం మరింతగా పెరుగుతోంది. వీటి పరిమాణం పెరుగుదల రేటు కూడా రికార్డు స్థాయిలోనే ఉంది. అయితే బొగ్గుపులుసు వాయువు పెరిగిన స్థాయిలో ఇవి పెరగలేదు. అంటార్కిటికాలోని పురాతన మంచుదిబ్బల్లో ఏర్పడుతున్న గాలిబుడగలను పరిశోధిస్తే ఐస్‌ఏజ్ నాటి విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. పారిశ్రామికీకరణ తరువాత భూ వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు వెల్లువెత్తాయి. ఫలితంగా వాతావరణం వేడెక్కుతోంది. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటోంది. ధ్రువాలవద్ద మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. పంటల ఉత్పత్తి దెబ్బతింటోంది. జీవరాశి మనుగడ ప్రశ్నార్ధకమవుతోంది. ఈ పరిస్థితులు ఇలాగే సాగితే మానవ మనుగడ కష్టమే. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తే మంచిది.

-రవళి