సబ్ ఫీచర్

పరీక్షల లోపభూయిష్ట సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రమాణాలను గుర్తించేందుకు విద్యాత్మక పరీక్షలు, అర్హులను గుర్తించేందుకు ఎంపిక పరీక్షలు జరుగుతుంటాయి. తరగతులు దాటేందుకు విద్యాత్మక పరీక్షల్లో, ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకునేందుకు ఎంపిక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడటం భారతదేశ చరిత్రలో కొత్తేమీ కాదు, గోడల వెనుక దాక్కుని చిన్నచిన్న కాగితాలపై సమాధానాలు రాసి అందించే దశ నుండి సమాచార సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అని బ్లూటూత్‌లు, నానో హియరింగ్ రింగ్‌లు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఉపకరణాలు వినియోగించుకోవడం మొదలైంది. నీట్ పరీక్షలోనూ, ఎయిమ్స్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్షలోనూ, తర్వాత జరిగిన ఎమ్సెట్ పరీక్షలో ఇలాంటి అత్యాధునిక ఉపకరణాలను వినియోగించి అక్రమాలకు పాల్పడిన ఘటనలు చూశాం. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల్లో ఐపిఎస్ అధికారి సాబిర్ కరీం అక్రమాలతో మరో మారు దేశంలో పరీక్షల సంస్కరణలు- చట్టాలు, శిక్షల అంశంపై చర్చ మొదలైంది. కేరళకు చెందిన సాబిర్ కరీం 2015లో యుపిఎస్‌సి పరీక్షలు రాశారు. 112వ ర్యాంకు వచ్చింది. శిక్షణ అనంతరం ఆయన తిరునల్‌వేలి డివిజన్, నంగునేరి సబ్‌డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఎలాగైనా సివిల్స్‌లో ఇంకా మంచి ర్యాంకు సాధించి ఐఎఎస్‌కు ఎంపిక కావాలనుకున్న సాబీర్ కరీం 2016లో ప్రిలిమ్స్ రాశారు. మంచి ర్యాంకు వచ్చింది. మెయిన్స్‌కు హాజరయ్యారు. చెన్నై ఎగ్మోర్‌లోని ప్రిసిడెన్సీ గర్ల్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్‌లో వైర్‌లెస్ బ్లూటూత్ ద్వారా సమాధానాలను వింటూ జవాబులు రాయడంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన ఆయన భార్య జాయిస్ , ఎల్ ఎక్స్‌లెన్సియా అధిపతి రాంబాబులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంత ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసు ఐపిసి -420 కేసు. ఇదీ భారత్‌లో పరీక్షల అక్రమాలకు సంబంధించి ఉన్న చట్టం. ప్రతి రాష్ట్రంలో పరీక్షల అక్రమాలకు సంబంధించి చట్టాలు ఉన్నాయి. కేంద్రం కూడా పరీక్షలలో అక్రమాల నియంత్రణకు చట్టాలు చేసింది. ఇవేవీ విద్యారంగానికి సంబంధించి ప్రత్యేకంగా లేకపోవడం, కఠినంగా లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా నడుస్తోంది. తెలంగాణ ఎమ్సెట్ పరీక్షల అక్రమాల్లో గురివిరెడ్డి బృందం, ఆయన సోదరి పుష్పగిరి పద్మజ, స్నేహితుడు రాజమోహన్‌రెడ్డి, ప్రభాకర్‌లను అరెస్టు చేసినపుడు వారు ఇదే తరహా ఇతర ప్రవేశపరీక్షల్లో కూడా అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. ఎంబిబిఎస్, బిడిఎస్, పిజి చేస్తున్న 50 మంది విద్యార్ధులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా తమ గొప్ప భవిష్యత్‌ను ఈ అక్రమాల కారణంగా కోల్పోయారు. దాంతో పరీక్ష కేంద్రాల వద్ద అనుమానం వచ్చి అభ్యర్ధులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం కూడా వివాదాస్పదమైంది. నీట్ యుజి ప్రవేశపరీక్ష సందర్భంగా కేరళలో ఒక అమ్మాయి లోదుస్తులను తొలగించమని కోరడం గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-2 పరీక్షల్లో కొంత మంది మహిళల మంగళసూత్రాలను పరీక్షించడం కూడా చాలా మంది తప్పుపట్టారు. ఎమ్సెట్ సందర్భంగా క్షుణ్ణంగా అనువనువు తనిఖీ చేయడాన్ని తల్లిదండ్రులు, అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
విలువలకు పట్టం
ప్రాచీనకాలం నుండి సంప్రదాయ విద్య, ప్రామాణిక విద్యా విధానాలకు, పట్టం కట్టిన భారతీయ విద్యాలయాలు రోజురోజుకూ రూపాన్ని మార్చుకున్నా వినయం, విధేయత, సంస్కారం, శీలం, జ్ఞాన కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న పోకడలకు అనుగుణంగా విద్యాలయాలు పరఢవిల్లినా ప్రమాణాలలో రాజీ పడటం మొదలైంది. ప్రాచీన కాలంలో చిట్టడవులే విద్యాలయాలకు కేంద్రంగా ఉండేవి, రుషి పుంగవుల నివాస గృహాలే గురుకులాలయ్యాయి. ధర్మం, గ్రంథం , హిందూ తత్వం, సంస్కృతం, సాహిత్యం, యుద్ధ విద్యలు, రాజకీయాలు, గణితం, వైద్యం, ఖగోళం, జ్యోతిష్యం, చరిత్ర, ఇతి హాసం మొదలైనవి నేర్పించేవారు. బ్రాహ్మణులకు , క్షత్రియులకు మాత్రమే ఈ విద్య లభించేది. మొదటి వేయి సంవత్సరాల్లో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విద్యాలయాలు ఎంతో ప్రాశస్త్యం పొందాయి. కళ, వాస్తు శాస్త్రం, చిత్రలేఖనం, తర్కం, గణితం, వ్యాకరణం, తత్వం, బౌద్ధ్ధర్మం, హిందూ ధర్మం, అర్థశాస్త్రం, న్యాయశాస్త్రం, వైద్య శాస్త్రం మొదలైనవి బోధించేవారు. ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో అంశానికి ప్రాముఖ్యాన్నిచ్చేవి. తక్షశిల వైద్య శాస్త్రానికి, ఉజ్జయినీ ఖగోళ శాస్త్రానికి, నలంద రాజనీతికి ప్రసిద్ధి చెందాయి. దాదాపు వీటిలో 10వేల మంది విద్యను అభ్యసించేవారు. తర్వాత ఈ విద్యాబోధనావిధానం అనేక రూపాలు సంతరించుకుంది. 18వ శతాబ్దంలో విద్యావ్యాప్తి చాలా ఉండేది. ప్రతి దేవాలయం, ప్రతి మసీదు, ప్రతి గ్రామం ఒక పాఠశాలను కలిగి ఉండేది. వీటిలో అన్ని జాతులకు, తెగలకు చెందిన పిల్లలకు విద్యాబోధన సాగేది. సార్వజనీన విజ్ఞానాలు, శాస్త్రాల్లో బోధన మొదలైంది. 1820 వరకూ ముద్రణ గ్రంథాలు భారత్‌లో అందుబాటులో లేవు, తర్వాత అవి అందుబాటులోకి రాగానే బ్రిటిష్ సామ్రాజ్య వలస వాదులు తమకు అనుకూలమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. 1976 వరకూ రాష్ట్రాల బాధ్యతగా ఉన్న విద్య, తర్వాత ఉమ్మడి జాబితాలో చేరింది. పరీక్షలు, విద్యాప్రమాణాలకు సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, నిధుల మంజూరుకు యుజిసి, పర్యవేక్షణ, అనుమతులకు ఎన్‌సిటిఇ, ఎఐసిటిఇ, అక్రిడిటేషన్లకు ఎన్‌బిఎ, అసెస్‌మెంట్‌కు నేక్ వంటి సంస్థలు ఉన్నా ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, కాంట్రాక్టు యాక్టు, ఎవిడెన్స్ యాక్ట్‌లలోని నియమనిబంధనలు మినహా అక్రమాలను అదుపుచేసేందుకు సంబంధించి స్పష్టమైన నియంత్రణ సంస్థ లేదా జాతీయ స్థాయి ప్రత్యేక చట్టాలు లేవు. ఏ విద్యాసంస్థకు వారు తమ స్టాట్యూటరీ బైలాస్‌లో నిబంధనలు చేర్చారు. కాని జాతీయ స్థాయిలో సమగ్ర చట్టాలు అమలు కావడం లేదు.
లోపభూయిష్టం
ఛండీఘడ్‌కు చెందిన డాక్టర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్ సంస్థలో చదువుతూ 2004-05లో ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన వైభవ్ సింగ్ చౌహాన్ 2005 ఏప్రిల్ 19న సమాధానాల స్లిప్‌తో దొరికిపోయాడు. సంస్థ ఏడాది పాటు ఆయనను డిబార్ చేసింది, దానిపై హైకోర్టుకు వెళ్లిన చౌహాన్ తను చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పడంతో హోటల్ మేనేజిమెంట్ సంస్థ విధించిన ఏడాది కాలం డిబార్‌ను కోర్టు కొట్టివేసింది. దానిపై సంస్థ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ముందను సవాలు చేసింది. దాంతో జస్టిస్ అల్తాస్ కబీర్, జస్టిస్ మార్కండేయ ఖట్జూలతో కూడిన బెంచ్ (సివిల్ అప్పీల్ 34/2008) క్షమాపణలతో ఇలాంటి తప్పిదాలను తోసిపుచ్చేది లేదని, పరీక్షల్లో అక్రమాలకు గట్టి శిక్ష విధించాల్సిందేనని అభిప్రాయపడింది. స్లిప్ ఉన్నపుడు దాంట్లో సమాధానాలు చూసి రాసినా లేకున్నా అది పరీక్షల అక్రమాల కిందకు వస్తుందని బెంచ్ అభిప్రాయపడింది. అంతకుముందు గురునానక్‌దేవ్ యూనివర్శిటీ వర్సస్ పర్మిందర్ కుమార్ బన్సాల్(1993), సిబిఎస్‌ఇ వర్సస్ వినీత్ మహాజన్ (1994), సిబిఎస్‌ఇ వర్సస్ పి సునీల్ కుమార్(1998) , రీజనల్ ఆఫీసర్ సిబిఎస్‌ఇ వర్సస్ షీనా పీతాంబరన్ (2003) కేసుల్లో కూడా వివిధ కోర్టులు చాలా స్పష్టంగా విద్యాత్మక అక్రమాలకు అడ్డుకట్టవేయాల్సిందేనని స్పష్టం చేశాయి. ఉత్తర ప్రదేశ్, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విద్యాత్మక అక్రమాల నియంత్రణ చట్టాలను చేశాయి. అక్రమాలకు ఆనవాలుగా ఆరోపణలు ఎదుర్కొనే నైజీరియా దేశం సైతం విద్యాత్మక అక్రమాలకు కఠినమైన చట్టాలను రూపొందించింది. ఆ చట్టాలను చూసే యుపి ఇక్కడ చట్టాన్ని తీసుకువచ్చింది. నైజీరియాలో అక్రమాలకు పాల్పడితే 50వేల నైరా(నైజీరియా కరెన్సీ)లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. కనీసం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాలి. కాని మన చట్టాలకు కోరలు లేకపోవడంతో అక్రమాల ఆటలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. అనుభవాలు సైతం ప్రభుత్వాలకు పాఠాలు నేర్పలేకపోతున్నాయి.

-బి.వి.ప్రసాద్