సబ్ ఫీచర్

ఢ్రగ్స్.. డ్రగ్స్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ చూసినా ఈ మధ్య డ్రగ్స్ గురించిన చర్చ జరుగుతోంది. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? అంతర్జాతీయ విశే్లషకుల అంచనాల ప్రకారం తూర్పు ఐరోపా దేశాలు ఆఫ్రికా నుండి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ఇవన్నీ నేపాల్, బంగ్లాదేశ్‌ల మీదుగా ఇండియాకు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ద్రవ్యాల డిమాండ్ తగ్గింపు, మత్తుమందులు, మానసిక ప్రభావం చూపే పదార్థాలు, ముడి రసాయనాలు తదితరాల అక్రమ రవాణా నిరోధం, సంబంధిత అంశాలపై అవగాహనా పూర్వక ఒప్పందానికి (ఎంఓయుకు) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాదక ద్రవ్యాల విషయంలో రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అంశాలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. అలాగే సమాచార ఆదాన్ ప్రధాన్ యంత్రాంగం గురించి కూడా ఒప్పందంలో పేర్కొన్నారు. దీంతోపాటు ఎంఓయు అమలు, సమాచార ఆదాన్ ప్రధాన్‌పై బాధ్యత వహించే సముచిత అధికార స్థానాలను కూడా వివరించారు. ఈ విధమైన సహకారం ద్వారా రెండు దేశాల మధ్య మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని రెండు ప్రభుత్వాలూ ఆశిస్తున్నాయి. ఈ ఒప్పందం కింద ఉభయపక్షాలు కృషి చేయాల్సిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
* మత్తుమందుల అక్రమ రవాణా సమస్యను సమర్థవంతంగా పరిష్కరించే దిశగా పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవడం, అలాగే మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గింపు లక్ష్యంగా నిరోధం, అవగాహన, విద్యా, సామాజిక ప్రాతిపదిక గల కార్యక్రమాలు, వ్యసనపరులకు చికిత్స, పునరావాసం తదితరాలపై సహకారం.
* మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రెండు దేశాలలో ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు, నిబంధనలు, విధానాలు, ఉత్తమ ఆచరణలు, పద్ధతులు సహా భవిష్యత్తులో ఏదైనా సవరణ చేస్తే సంబంధిత సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం.
* * *
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న కృషికి భారతదేశం సదా మద్దతు పలుకుతూ వస్తోంది. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని చర్యలతోపాటు అనేక బహుళ పక్ష ఒప్పందాలలోను, ద్వైపాక్షిక ఒప్పందాలలోను భాగస్వామిగా ఉంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాల స్ఫూర్తికి అనుగుణంగా ఇరుగుపొరుగు దేశాలతో పాటు మాదక ద్రవ్యాలకు సంబంధించి మన దేశంలో పరిస్థితులపై ప్రత్యక్ష ప్రభావం చూపే దేశాలతోనూ ద్వైపాక్షిక/ అవగాహన పూర్వక ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని దేశాలతో అటువంటి ఒప్పందాలు పూర్తయ్యాయి. మాదక ద్రవ్య సంబంధిత అంశాలలో ద్వైపాక్షిక సహకారం దిశగా నేపాల్‌తో ప్రస్తుతం కుదుర్చుకోనున్న ప్రతిపాదిత అవగాహనపూర్వక ఒప్పందం కూడా అలాంటిదే.