సబ్ ఫీచర్

పల్లెల ఆదాయంపై ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుతుపవనాల ప్రభావం వల్ల దాదాపు సాధారణ సగటు వర్షపాతం నమోదైంది. రైతులకు ఇది ఆశాజనక పరిణామమే. వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితి. వ్యవసాయాధారిత ఆదాయం ఒక మాదిరిగా సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది. అయితే నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధింపు వంటి చర్యల కారణంగా వ్యవసాయ వస్తువుల ధరలు బాగా తగ్గడం గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయంపై గణనీయ ప్రభావం చూపనుందని తాజా అధ్యయనం చెబుతోంది. మన దేశంలో వ్యవసాయ వస్తువులు అంటే పండ్లు, కూరగాయలు, పలు రకాల ధాన్యాలు, నూనె గింజలు వంటి వ్యవసాయ ఉత్పత్తులుగా భావించాలి. వీటి ధరలు తగ్గిపోవడం వల్ల పల్లెల్లో ఉండే రైతుల ఆదాయం పెద్దగా ఉండదని అర్థం. రుతుపవనాలు సాధారణంగానే ఉన్నప్పటికీ గ్రామీణుల ఆదాయం ఊహించనంతగా ఉండదని, ఒక మాదిరి పెరుగుదల మాత్రమే గోచరిస్తుందని ఆ అధ్యయనం అంచనా వేస్తోంది. ‘రూరల్ సఫారీ’ అన్న నివేదికలో జెఎమ్ ఫైనాన్సియల్ సంస్థ ఈ మేరకు వివరాలను పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంతో సంబంధంలేని ప్రజల ఆదాయం పెరుగుదల దాదాపు శూన్యమని తేల్చింది నోట్ల రద్దు వల్ల లావాదేవీలు నిర్వహించే పరిస్థితి పల్లె ప్రాంతాలలో లేదని, ఇసుక తవ్వకాల వంటి కార్యక్రమాలపై జిఎస్‌టి వ్యతిరేక ప్రభావం చూపుతోందని తెలిపింది. జిఎస్‌టి సంబంధమైన ఆటంకాలు, వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల తొలి అర్ధ సంవత్సరపు గ్రామీణ ప్రాంత ఆదాయం గణనీయంగా తగ్గిందని తేలింది. పూర్తి ఆర్థిక సంవత్సర ఫలితాలపై ఇది ప్రభావం చూపుతుందని దళారీ సంస్థల విశే్లషకుల బృందం సభ్యులు పర్వేజ్, సుహాస్ హరినారాయణన్ అంచనావేశారు. అయినప్పటికీ ఖరీఫ్ పంటల దిగుబడి ప్రభుత్వ అంచనాకన్నా ఎక్కువగానే ఉంటుందని, నీటిమట్టాలు తగినంతగా ఉండటం వల్ల రబీ దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని వారు చెబుతున్నారు. వ్యవసాయ వస్తువుల ధరల ప్రభావం కూరగాయల సాగుపై ఉంటుందని, నిజానికి గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వీటివల్లే కాస్తంత ఆదాయం లభిస్తుందని, ఇప్పుడు ఇది ప్రతికూల పరిణామాలు ఎదురవడం వల్ల వారి ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సంపాదించే ఆదాయంలో 25 నుంచి 30 శాతం మేరకు కూరగాయల సాగువల్లే వస్తుంది. చివరకు తృణధాన్యాల ధరలు కూడా తగ్గిపోతున్నాయి. ఫలితంగా వారి ఆదాయంపై పెను ప్రభావం పడుతోంది. వారి ఆదాయంలో వీటి భాగం దాదాపు 20 శాతం వరకు ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది ప్రభావం చూపుతుంది. పప్పు, నూనె గింజల ధరలను బట్టి పరిస్థితుల్లో మరిన్ని మార్పులు కనిపిస్తాయి. వీటి ధరలు తగ్గితే రైతులు ఆందోళనకు దిగే అవకాశాలు ఉంటాయి. జూన్, జులై నెలల్లో ఇది ఎదురయ్యే సమస్య. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది. రుతుపవనాలు సహకరించినప్పటికీ జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్కరణల వల్ల నగదు లావాదేవీలు పూర్వంలా సులువుగా జరగకపోవడం గ్రామీణ ప్రాంత రైతులు, ప్రజల ఆదాయంపై గణనీయమైన ప్రభావమే చూపుతోంది.

-రవళి