సబ్ ఫీచర్

సైన్స్‌తో శాంతి.. అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ మనుగడ సాఫీగా సాగిపోవడానికి సైన్స్ ఎంతో దోహదపడుతోంది. విజ్ఞానశాస్త్రం సాధించిన అద్భుతాలవలన తగ్గని రోగం నుండి రోగరహిత సమాజ దిశగా, అనంత అంతరిక్షానికి వెళ్లే దిశగా మానవ ప్రయత్నాలు జరిగి మంచి ఫలితాలిస్తున్నాయి. సైన్స్ సాధించిన విజయాలకు గుర్తుగా ఏటా నవంబర్ 10న ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఐ.రా.స (యునెస్కో) నిర్వహిస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో నినాదంతో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘సైన్స్ ఆఫ్ గ్లోబల్ అండర్‌స్టాండింగ్’ అనే నినాదంతో కార్యక్రమాలు రూపొందించారు. ‘శాంతి- అభివృద్ధి’లో సైన్స్ పాత్రని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రాంత - దేశ - ఖండాలవారీగా వారధిని నిర్మించి ఓ మంచి ప్రశాంత ప్రపంచాన్ని ప్రజలకి దగ్గర చేయాలని యునెస్కో భావిస్తున్నది. 2001వ సంవత్సరం నుంచి ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సమాజాల మధ్య సంఘీభావం పెంచడం, విజ్ఞాన శాస్త్ర ఫలాలను పరస్పరం అందిపుచ్చుకోవడం వంటి ఆశయాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సమాజాలను ఐక్యం చేసి ప్రపంచ స్థిరత్వాన్ని పొందాలని యునెస్కో ముందుకు కదులుతున్నది. ఇంతటి కార్యం ఏ ఒక్క దేశమో అనుకుంటే కాదు, అందుకే ఈ సంస్థ అనేక సవాళ్లని ఎదుర్కొంటున్నా ప్రజలని భాగస్వామ్యం చేసి ప్రజా చైతన్యంతో ముందుకు కదులుతున్నది. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఐరోపా, ఓసియానా ఖండాల్లో వున్న గ్లోబల్ అండర్‌స్టాండింగ్ రీజినల్ యాక్షన్ సెంటర్‌లు పరస్పర సహకారంతో తమ కార్యాచరణ ప్రణాళికని అమలు చేస్తున్నాయి. దక్షిణ ఆసియా ప్రధాన కార్యాలయం ఢిల్లీ కేంద్రంగా తమ చైతన్య కార్యక్రమాలని నిర్వహిస్తున్నది. వీరు ప్రపంచ బాగుకోసం చేసే చైతన్య సదస్సులని మనం గమనించి మన మన ప్రాంతాల్లో జరిగే వివిధ కార్యక్రమాలను సైన్స్‌తో అనుసంధానం చేసి సైంటిఫిక్ లైఫ్‌ని లీడ్ చేసి అనేక ఒడిదుడుకులని అధిగమించే ప్రయత్నాలు జరగాలి. దీనికి సరైన విద్యని ప్రభుత్వాలు ప్రజలకు కల్పించాలి. సైన్స్ అభివృద్ధికి నిధులు సమకూర్చిన సైన్స్ అండ్ టెక్నాలజీలో శిక్షణ పొందిన వారిని ప్రభుత్వాలు చేరదీయాలి. అనుక్షణం సైన్స్‌లో జరిగే పరిణామాలని ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మీడియా తమదైన శైలిలో సరళీకృతమైన భాషలో ప్రజలకి అర్థమయ్యేలా అనువదించి చేరదీయాలి. సైన్స్‌పై అవగాహన ఉంటే పరిసరాల శుభ్రత పెరుగుతుంది. కాలుష్యం తగ్గుముఖం పడుతుంది, వాతావరణం బాగుపడుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది. అనారోగ్యం దరికిరాదు, జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతుంది, పని గంటలు పెరుగుతాయి, ఆర్థిక పటుత్వం వృద్ధి చెందుతుంది. ప్రపంచం బాగుపడుతుంది. అందులోనే సైన్స్ అభివృద్ధి చెందుతుంది. ఇవే ప్రజానీకం ‘వరల్డ్ సైన్స్ డే’ రోజున ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు!

-పోటు భగత్‌కుమార్