సబ్ ఫీచర్

చర్చల్లోనే సృజనకు వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కా ల్పనిక శక్తిని తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా కలిగించగలుగుతాడు. ఇదొక ప్రయోగం.
6వ తరగతిలో చుట్టుకొలతలు (పెరిమీటర్), వైశాల్యం అనే అంశం సిలబస్‌లో వుంది. 9, 4 సెంటీమీటర్ల గల దీర్ఘచతురస్రాన్ని గీయమని విద్యార్థులకు చెప్పాం. అందరూ చాలా హుషారుగా గీశారు. దీని చుట్టుకొలత ఎంత? అని అడిగాను. 26 అన్నారు.
ఎట్లా వచ్చిందని ప్రశ్నించాను.
9, 4 కలిపితే 13 కదా, మళ్లా 9 కదా, మళ్లా 4 కదా మొత్తం కలిపితే 26 అని ఒక విద్యార్థి చెప్పాడు.
ఇంకో విద్యార్థి లేచాడు.
9 రెండుసార్లు, 4 రెండు సార్లు వచ్చింది. అందుకే 24 అని మరో విద్యార్థి చెప్పాడు.
సమస్యను అందరూ విశే్లషించగలుగుతారనే ధైర్యం ఉపాధ్యాయునికి కలుగుతుంది.
26 చుట్టుకొలతలలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు గీయగలుగుతారో గీయండి అన్నాను. పిల్లలు గీయగలుగుతారనే నమ్మకం కలిగింది కాబట్టి దీన్ని హోంవర్క్ అని చెప్పాను.
తెల్లారొచ్చేసరికి ప్రతి విద్యార్థి 20 నుంచి 30 బొమ్మలు గీసుకొచ్చారు. ప్రతిదాని చుట్టుకొలత కూడా 26నే. ఈ భాగాన్ని యాక్టివిటీ అంటారు. అంటే ప్రయోగం. ప్రతి విద్యార్థి ఎన్నో దీర్ఘ చతురస్రాలు గీశారు. దీనిలో పూర్ణాంక అంకెలు ఎన్నింటికున్నాయని ప్రశ్నించాను.
పూర్ణాంక అంకెలున్నటువంటిదాన్ని వేరు చేయండన్నాను.
అన్ని దీర్ఘచతురస్రాలే కదా అంటుండగానే ఒక విద్యార్థి లేచి ‘అన్నింటి వైశాల్యాలు ఒకలాగా లేవు. చుట్టుకొలత ఒకటే’ అన్నాడు.
అంటే చుట్టుకొలతకు, వైశాల్యానికి సంబంధం పెట్టాలనే ఆలోచన ఆ విద్యార్థికి వచ్చింది.
క్రియేటివ్ థింకింగ్ అంటే రెండు అంశాలకు మధ్యన సంబంధం పెట్టడం.
కొన్నిసార్లు ఒకే అంశం ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది అన్నాను.
అదెట్లా? అని కొందరు, ఎందుకు కాదు? అని కొందరు పిల్లలు ప్రశ్నించారు. దీనే్న లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. ఒకదానికన్నా ఎక్కువ దానితో సంబంధాలు పెట్టడం. క్రియేటివిటీ అంటే అంశాలకు మధ్య సంబంధాలు కలిగించటం.
తరగతి గదిలో ఈ అంశం పూర్తికాగానే ఉపాధ్యాయుడు కొత్త ఆలోచనలను రగిలిస్తాడు. ప్రతి విద్యార్థి తాను చేసిన లెక్కలను కాగితాల్లో చూసుకుంటూ పోతారు.
చివరకు ఒక విద్యార్థి నిలబడి చతురస్రమే అయితే వైశాల్యం ఎక్కువ ఉంటుందంటారు. దీర్ఘచతురస్రాల నుంచి ఒక దీర్ఘ చతురస్రం చతురస్రంగా మారుతుందంటాడు.
దీర్ఘచతురస్రం చెప్పమంటే చతురస్రం గురించి చెబుతున్నావెందుకని ప్రశ్నించాను.
‘చతురస్రం కూడా ఒక దీర్ఘచతురస్రం కదా సార్’ అని ఒక విద్యార్థి అన్నాడు.
అదెట్లయితది అన్నాను.
పొడవు, వెడల్పు సమానంగా ఉంటే అది చతురస్రం అయిపోతది సార్ అంటారు.
ఇలాంటి రసవత్తరమైన చర్చలు క్రియేటివ్ థింకింగ్ చర్చల్లో జరుగుతాయి.
ఒక బొమ్మను విద్యార్థి వివిధ కోణాల్లో చూస్తాడు. దానితో సబ్జెక్టుపైన పట్టు పెరుగుతుంది.
‘‘పొడవు, వెడల్పు సమానం’’ అన్న విద్యార్థి డైలాగ్‌ను అందరూ గమనిస్తారు. దీన్నుంచి ఒక విద్యార్థి ఒక ప్యాట్రన్‌ను తీస్తాడు.
అదెట్లా చెప్పమంటాను.
‘‘మా ఊర్లో అందరూ వ్యవసాయం చేస్తారు. దానిలో ఊరి పెద్ద పొలంలోనే ఎక్కువ పంట ఎందుకొస్తది సార్’’ అంటాడు. అది ఆయన అదృష్టం అన్నాను.
ఆయన చెరువులో మట్టి తెచ్చుకుని తన పొలానికి వేసుకున్నాడు. నేను ఆ మట్టి తెచ్చుకుంటే ఊరుకుంటారా సార్? అందుకే ఆయన పంట ఎక్కువగా పండుతుందని విద్యార్థి చెప్పాడు.
పిల్లల పరిసరాల నేపథ్యం ఒక క్రియేటివ్ థింకింగ్‌లో ఎలా ఉపయోగపడింది? అన్ని అంశాలు కూడా ఒకే మనిషిలోపల ఉండగలిగితే గరిష్ఠ ఉత్పత్తి జరుగుతుంది సార్ అంటాడు.
అంటే ఒక అంశం ఎన్నింటిమీదనో ఆధారపడి ఉన్నా, అవన్నీ ఒక మనిషిలో కేంద్రీకృతంగా సమానంగా ఉంటే అక్కడ గరిష్ఠ ఉత్పత్తి జరుగుతుంది.
దీన్ని విద్యార్థులు చెబుతుంటే, ఈ విశే్లషణలో పిల్లలు చేస్తుంటే ఉపాధ్యాయుడు తన్మయత్వం చెందుతాడు.
దీనే్న క్రియేటివ్ థింకింగ్ అంటారు. దానే్న ‘ఎక్స్‌ట్రీమ్ కేసు’ అంటారు.

-డా.చుక్కా రామయ్య