సబ్ ఫీచర్

రాహుల్‌కు రాచబాట ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం 132 సంత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి, ఐరిష్ జాతీయుడైన ఎ.ఒ. హ్యూమ్ స్థాపించిన నూరేళ్ల తరువాత ఒక విదేశీయ మహిళ సారథ్యం వహించడం కాకతాళీయం కావచ్చు. తొలుత ఎన్నో విమర్శలకు గురైనా తరువాత క్రమేపీ రాజకీయ అంతర్వాహినిలో మమేకమై, 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వ చట్టం ప్రకారం సోనియా భారత పౌరసత్వం పొందారు. ఆమెకు భారత పౌరసత్వం లభించిన ఇరవై ఏళ్ల తరువాత అందుకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలను, పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొట్టేసింది. సోనియా విదేశీయత, ఎన్నిక అర్హతపైన దాఖలైన రెండు సివిల్ అప్పీళ్లను కోర్టు కొట్టేసింది. తదనంతర దేశ రాజకీయ పరిణామాల్లో 17 ఏళ్లపాటు అధ్యక్ష సారధ్యం వహించిన సోనియా, ప్రధాని పదవిని ఆశించకుండా మన్మోహన్‌సింగ్‌కు దేశ ప్రధాని బాధ్యత అప్పగించటం, దేశ రాజకీయాలలో అరుదైన సంఘటనగా గుర్తించబడుతోంది. జాతిపిత గాంధీజీ, తొలి ప్రధానిగా నెహ్రూ అవ్వాలని అనుకొన్నట్లు స్పష్టమైన ఆధారం లేనట్టే, తన కుమార్తె ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ ఆశించిన ఆధారం లేదు. ఇందిర హత్యానంతర పరిణామాలలో, రాజీవ్ ప్రధాని కాగలగడం యాదృచ్ఛికం. రాజీవ్ హత్యానంతరం, 23 సంవత్సరాల పాటు భార్యగా బాంధవ్యం వున్న సోనియా, ఆరు సంవత్సరాలపాటు రాజకీయాలకు దూరంగా వుండగా 1998లో కాంగ్రెస్‌ను బతికించడానికి, పార్టీలో ప్రవేశించి 13వ లోక్‌సభలో ప్రతిపక్ష సారధ్య బాధ్యత చేపట్టారు. 2004 సార్వత్రిక ఎన్నికలలో నెగ్గినా దేశ ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత ఆమెను వరించింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు ఉపాధ్యక్షునిగా వుంటూ డిసెంబర్ నెలాఖరులో అధ్యక్ష పదవి స్వీకరించనున్న రాహుల్‌గాంధీ, నాయనమ్మ, నాన్న వారసత్వంగా ప్రధాని అవ్వాలనే తహతహ ప్రదర్శించిన దాఖలాలు లేవు. సోదరుడు సంజయ్ మరణించిన 11 నెలల తరువాత పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, 1981 జూన్ ఉప ఎన్నికలలో విజయం పొంది 37వ ఏట లోక్‌సభలో ప్రవేశించిన రాజీవ్, తల్లి హత్యానంతరం 1984లో భారతదేశ ప్రధాని అయ్యేటప్పటికి అతడి వయసు 40 సంవత్సరాలు. పార్టీ అధ్యక్ష స్థానాన్ని అధిష్టించనున్న రాహుల్ ప్రస్తుత వయస్సు 47 సంవత్సరాలు. ప్రస్తుతం అవివాహితుడు కావడంతో వారసత్వంగా పిల్లలు ఎదిగే అవకాశం ఇప్పట్లో లేదు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ యింటి పేరిట ఒక కుటుంబంలో వారికి రాజ్యాధిపత్యం వరిస్తూనే ఉంది. దేశానికి, స్వాతంత్య్ర సముపార్జన లక్ష్యంగా నాటి జాతి నేతలు సారధ్యం వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సుదీర్ఘంగా దశాబ్దాల పర్యంతం పరిపాలించి ప్రస్తుతం ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తిస్తున్న తరుణంలో రాహుల్‌కు ఉన్నతాసనం, లభించే అవకాశాలు కనపడుతున్నాయి. నెహ్రూ మరణానంతరం, రాజకీయాలలో ప్రవేశించిన ఇందిరకు, ద్వితీయ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మంత్రివర్గంలో వుంటూ అనుభవం సాధించినట్లు రాహుల్‌కు ఏ అవకాశం రాలేదు. కామరాజ్ ప్లాన్‌లా, ప్రధాని పదవికి పోటీ వచ్చే సీనియర్ వృద్ధ నేతలను తొలగించే మార్గదర్శకం లేదు. భారతీయ జనతా పార్టీ ఒక్కటే కాదు, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని ఎన్.డి.ఎ. హయాంలోని ప్రాంతీయ, ఇతర రాజకీయ పార్టీలు నేతలు కంకణం కట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్, ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే విజయం సాధించడం ప్రజల ఆకాంక్షలు, అభిమానం, ఆదరణపై ఆధారపడి వుంది.

-జయసూర్య