సబ్ ఫీచర్

జమిలి ఎన్నికలతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి సాధారణ ఎన్నికలు జరిపాలన్న ఆలోచన మంచిదే. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నికల సంస్కరణలు, చట్టసభలకు సభ్యుల ఎన్నికకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంది. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో, తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. పెద్దఎత్తున ధనవ్యయమూ జరిగిపోతోంది. జమిలి ఎన్నికలవలన సమయం, ధనం ఆదా అవుతాయి. ఐదేళ్లపాటు ఎన్నికలు లేకుండా ఏకాగ్రతతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సుస్థిర ప్రభుత్వం, సుస్థిర పాలన సాధ్యమవుతుంది. అయితే ఇలా దేశమంతటా ఒకేసారి లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడానికి ముందు ‘పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని’ మరింత కఠినతరం చేసేలా సవరించాలి. ఒక పార్టీ తరపున పోటీ చేసి నెగ్గిన వ్యక్తి మరో పార్టీలోకి మారితే తక్షణం అతడి సభ్యత్వం రద్దయ్యేలా చట్ట సవరణ తీసుకురావాలి. లోక్‌సభ, శాసనసభలకుప్రతీ ఐదేళ్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జరిగితే జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి కూడా ఐదేళ్లకే వీటితో పాటు జరపాలి. ప్రస్తుతం అక్కడి శాసనసభ కాలపరిమితి ఆరేళ్లుగా ఉండటం గమనార్హం. ఈ ఎన్నికలు ఐదేళ్లకోమారు ప్రతి డిసెంబరులో నిర్వహించాలి. జనవరిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. ఫిబ్రవరిలో బడ్జెట్టుపై చర్చ జరిపి ఆమోదం పొందాలి. ఏప్రిల్ 1 నుండి బడ్జెట్‌ను అమలు పరచాలి. ఐదేళ్లకోమారు జరిగే ఎన్నికల పద్ధతిని పాటిస్తే తొలిసారిగా ఏర్పడిన ప్రభుత్వం మెజారిటీ ఉంటే సరే, లేనిపక్షంలో కొన్ని పక్షాల కలయికతో ఏర్పడేలా చూసి సుస్థిర పాలన చేయాలి. రాజకీయ కారణాల రీత్యా ప్రభుత్వాలు కూలిపోతే మధ్యంతర ఎన్నికలకు బదులు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలా చట్టం చేయాలి. లోక్‌సభలో సంఖ్యాబలాన్ని బట్టి మొదటి రెండు పార్టీల నుంచి తొలి రెండు పెద్దపదవులకు అభ్యర్థులను ఎంపిక చేసేలా రాష్టప్రతి చర్యలు తీసుకోవాలి. వారి మధ్య ప్రధాని పదవికి పోటీ నిర్వహించాలి. రాష్ట్రాల్లోనూ ఇదే తరహా విధానం పాటించవచ్చు. మధ్యంతర ఎన్నికలు లేని విధంగా కొత్త విధానాలను, ఆలోచనలు ప్రభుత్వాలు ఆహ్వానించి విస్తృచ చర్చకు అవకాశం ఇవ్వాలి. కామన్ అజెండాతో అభివృద్ధి పనులు చేపట్టాలి. రాజ్యసభ లేదా శాసనమండలి సభ్యులు ప్రధాని, ముఖ్యమంత్రి పదవులకు పోటీ చేయకుండా చూడాలి. అలాగే లోక్‌సభలో 545 మంది సభ్యులు వున్నారు. కేంద్ర మంత్రివర్గంలో పది శాతం మందికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. అంటే దాదాపు 55 మందికి మంత్రులుగా అవకాశం ఇవ్వొచ్చు. లోక్‌సభలో ఉన్న ఎంపీలలో పార్టీల వారీగా ప్రతి పదిమందికి ఒకరికి అవకాశం ఇచ్చి మంత్రివర్గాన్ని సిద్ధం చేయాలి. అంటే మంత్రివర్గంలో అన్ని పార్టీలకూ అవకాశం కల్పించాలన్నమాట. మంత్రులు కానివారంతా ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలి. రాష్ట్రాల్లోను ఇదే తరహాలో విధనాలు రూపొందించాలి. ఈ తరహా ఎన్నికలు నిర్వహించే పద్ధతిని ఎంచుకున్నప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. రాజకీయ కుప్పిగంతులకు వీరిలో ఎక్కువమంది కారణమవుతున్నారు. ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాన్ని మాత్రమే కల్పించేలా చట్టాన్ని తీసుకు రావాలి.

-ఎం.సి.నాగిరెడ్డి