సబ్ ఫీచర్

దేశం ఎటుపోతున్నది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళ కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మహారాజ్‌గంజ్ ప్రాంతంలో రాజాసింగ్ అనే ఎంఎల్‌ఏ ఉన్నాడు. బిజెపికి చెందిన ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. ‘‘డ్రగ్స్ కేసులోని నిందితులు తప్పించుకోవటం కోసం 1500 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు’’ అని. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దీనిని రాజాసింగ్ నిరూపించవలసి ఉంది. లోగడ నరుూం అనే దుర్మార్ముడు చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. నరుూంతో అటు పాలకపక్షం వారితోబాటు ఇటు కొందరు పోలీసు అధికారులకు కూడా సన్నిహిత సంబంధాలున్నట్టు ప్రచారమైంది. క్రమంగా ఇదంతా మీ నిర్వాకమే అంటూ కాంగ్రెస్ టిఆర్‌ఎస్ పార్టీలు పరస్పర నేరారపోణలు చేసుకున్నాయి. ఆరోపణలు ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రజలు నరుూం కేసును గురించి మరచిపోయారు.
ఎక్సైజ్‌శాఖ అధికారి అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ‘‘తనపై డ్రగ్స్ విచారణ సందర్భంలో ఒత్తిడులు, బెదిరింపులూ వస్తున్నాయి’’ అని వెల్లడించాడు. ఒత్తిడులు రాజకీయ సినీ పారిశ్రామిక ప్రముఖులనుంచి కావచ్చు. బెదిరింపులు నెదర్లాండ్స్, నైజీరియా, జర్మనీలలోని మాఫియా డాన్‌లనుండి కావచ్చు. మాదాపూర్‌లో భూకబ్జాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. వాటిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి దోషులను శిక్షిస్తాము అని ప్రతిజ్ఞ చేసింది. ఈలోపల హైదరాబాదు మాదకాబాదుగా మారిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎటు చూచినా ఈ డ్రగ్స్ వార్తలే. దానితో (నరుూం కేసులవలెనే) మాదాపూర్ లాండ్ గ్రాబింగ్ కేసు వెనుకపడింది. ఇప్పుడు డ్రగ్స్ కేసును కూడా జనం మరచిపోయారు. డ్రగ్స్ బాధితులు నేరం చేసినట్లు కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. బహుశా ఇది అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని కార్పొరేటు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ధనమదాంధులైన చిత్ర వృషభులకు వర్తించదు. రాంగోపాల్‌వర్మ అనే ఒక ఫిలిం డైరెక్టర్ అయితే మరో అడుగు ముందుకు పోయి డ్రగ్స్ విచారణను ఎదుర్కొంటున్న నటిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చారు. ఇదంతా దేనిని తెలియజేస్తుంది? గుజరాత్ తీరంలో 1500 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది. నగరంలోని పబ్‌లల్లోని రహస్య మందిరాలల్లో డ్రగ్స్ వాడకం- అమ్మకం రెండూ జరుగుతున్నాయి. సినీ రంగంలో గ్లామర్ వారి గ్రామర్. కాబట్టి అందరి దృష్టి వారిమీద వుంటుంది. ఐతే కేవలం ఐటి రంగానికి చెందినవారు చలన చిత్ర రంగానికి చెందినవారు మాత్రమే మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని చెప్పలేము. రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు తమ పలుకుబడిని ఉపయోగించుకొని నేరాలనుండి బయటపడగలరు. ఇది చైనాలోను అరబ్బు దేశాలలోను జరుగదు. చివరకు పాకిస్తాన్ వంటి దుర్మార్గపు దేశంలో కూడా. పనామా పేపర్స్ (బ్యాంక్ అక్రమ ఖాతాల) విషయంలో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు దోషిగా గుర్తించి పదవినుండి తప్పించింది. భారతదేశంలో మహాఘనత వహించిన ప్రజా న్యాయవ్యవస్థలో దోషులు శిక్షింపబడడానికి అన్నీ అడ్డంకులే. బొంబాయి మారణహోమానికి కారకుడైన వ్యక్తిని పాతికేళ్లు విచారించి చివరకు శిక్ష ఖరారు చేస్తే ఆయనను విడిపించవలసిందిగా సిపియం అగ్ర నాయకుడు ఏచూరి సీతారాం రాష్టప్రతి వద్దకు వెళ్లాడు. కేరళలో నిరంతరం రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. 1967లో జరిగిన రామకృష్ణన్ హత్య కేసులో స్వయంగా పినరాయ్ విజయన్ ప్రధాన ముద్దాయి. ఐనా ఆయనకు ఎట్టి శిక్షలూ లేవు. ఎందువల్ల? కేరళలోని తిరువనంతపురానికి చెందిన పార్లమెంటు సభ్యుడు శశిధరూర్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందులో సునంద పుష్కర్ వంటివారు హత్యకు గురి అయినారు. ఆ కేసు ఏళ్లతరబడి సాగుతున్నది. ఇది ఎలా జరిగింది? ఏపీ సీఎంపై ‘ఓటుకు నోటు’ కేసు ఏమైంది? తెలంగాణలో ‘్ఫన్ టాపింగ్ కేసు’ ఏమైంది? మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కాం ఏమైంది? మహారాష్టల్రో ‘పల్లీ చికీ’ కేసు ఏమైంది? లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ బీహారులో భూకుంభకోణాల్లో ఇరుక్కుంటే అక్కడి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ లల్లూ యాదవ్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాడు. దాన్ని మన రాజకీయ నాయకులు ముఖ్యంగా సెక్యులర్ పతివ్రతలు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా దేనిని తెలియజేస్తుంది?? ఒక జాతి యొక్క వర్తమాన స్థాయిని సూచిస్తుంది.
తమిళనాడులో వి.కె.శశికళ అనే మన్నారుగుడి మాఫియా లేడీ డాన్ రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవాలని విఫల ప్రయత్నం చేసి జైలుపాలైంది. ఐతే అక్కడ జైలునే స్వర్గ్ధామంగా మార్చుకున్నది. ఈ విషయం వెలుగులోకి తెచ్చిన పోలీసు అధికారిని దండించారు. ఎందుకని? సిద్ధరామయ్య తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నీతి - అవినీతి అనే ప్రశ్నలు వద్దు. బెంగాల్‌లో నారద స్టింగ్ స్కాం ఏమైంది? శారద చిట్‌ఫండ్ స్కాం ఏమయింది? హర్యానాలోని రాబర్డ్ వాద్రా భూకుంభకోణం స్కాం, రాయబరేలిలోని సమ్రాట్ సైకిల్ స్కాం ఏమయినాయి? పనామా పేపర్స్‌లో వెలికివచ్చిన పేర్లలో భారతీయ ప్రముఖులున్నారు. వారిపై చర్యలు లేవు. ఫిలిం నటుడు రవితేజ డ్రైవరు శ్రీనివాసరావును ఆటో రిక్షా యాదయ్యను మాత్రం విచారిస్తారు. ప్రజలకు రాజ్యాంగం పట్ల న్యాయవ్యవస్థ పట్ల ఇంకా గౌరవం మిగిలి ఉంది. దానిని ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నీరుకారిస్తే ఎలా? స్విస్‌బ్యాంక్ రహస్య ఖాతాల మొత్తాలు ఏమయినాయి? పి.చిదంబరం కొడుకు కార్తి ఎకౌంట్స్ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికీ తెలుసు కదా. మరి ఆ కేసు ఏమైంది? నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైంది? తమిళనాడు రాజకీయ నేతల ప్రత్యక్ష సహకారం లేకుండా శేషాచలం అడవులల్లోనుండి ఎర్రచందనం స్మగ్లింగ్ జరగటంలేదని అందరికీ తెలుసు. ఐనా ఎవరూ పట్టించుకోవటంలేదు. మన్మోహన్‌సింగ్ ధృతరాష్ట్ర పాత్ర పోషించినప్పుడు ములాయంసింగ్ శకుని పాత్ర పోషించలేడా ఏమిటి? అరుంధతీరాయ్, జాన్ దయాళ్ వంటివారు అమెరికా వెళ్లి ఇండియాలో మతసహనం లేదు, క్రైస్తవులను హింసిస్తున్నారు అని ప్రచారం చేసి వచ్చారు. మరి ఈ దేశద్రోహులమీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు? ఆర్టికల్ 370ని రద్దుచేస్తే కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలుపుతాము అని ముఫ్తి మహమ్మద్ సయ్యద్ బెదిరిస్తున్నది. అది సబబేనా?
చైనా అటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలతోబాటు ఇటు భూటాన్ (డోక్లామ్) భూభాగాలలోకి చొచ్చుకొని వస్తుంటే అసలు అది సమస్యే కాదనట్లు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నాయి. భారతీయులకు పుణ్యస్థలమైన మానస సరోవర్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకుంటున్నది. అమర్‌నాథ్ యాత్రికులపై జిహాదీ ఉగ్రవాదులు బాంబులు వేసి చంపుతున్నారు. ఇపుడు ఏ ‘సాకు’ చూపి మన ప్రభుత్వాలను భాధ్యతనుంచి తప్పించుకోగలవు?
కర్ణాటకలో డి.కె.శివకుమార్ కర్ణాటక విద్యుత్‌శాఖామాత్యుడు. ఆయనకు సంబంధించిన దాదాపు నలభై ప్రదేశాలపై 2 ఆగస్టు 2017 నాడు ఆదాయపు పన్ను శాఖ వారు దాడులు జరిపారు. ఫలితంగా మనీలాండరింగ్‌తోబాటు 12 కోట్ల బంగారం వజ్రాలు మరో పదిహేను కోట్ల నగదు రియల్ ఎస్టేట్ పట్టాలు ఇంకా చాలా పత్రాలు పట్టుబడ్డాయి. ఇప్పుడీ సమాచారం వెలుగులోకివచ్చాక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏం సమాధానం చెపుతారు? కక్ష సాధింపు చర్య అని ఒక పడికట్టు పారిభాషిక పదం అని ఊరుకుంటారా?? స్వాధీన పత్రాలను పరిశీలించిన మీదట డి.కె.శివకుమార్ అక్రమ ఆస్తుల విలువ 600 కోట్లు దాటినట్లు అధికారులు నిర్ణయించారు. దీనికి సోనియా గాంధీ ఏం సమాధానం చెపుతారు??
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నడిరోడ్డుమీద కాల్చిచంపండి’- ఈ ప్రకటన 3-8-2017 నాడు నంద్యాల బహిరంగ సభలో వై.జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికుమారుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు. తమకు కావలసినవారిని ఎన్నుకుంటారు. వారు ఐదేళ్లు ప్రజల అవసరాలు తీరుస్తారు. అందులో ఏమైనా లోపాలు ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎత్తిచూపుతూ ఉంటారు. దీనికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని పేరు. ఇందులో తిట్లకు అవసరమూ అవకాశమూ లేదు. భారత రాజ్యాంగం ఏ పౌరునికీ మరొకరిని కాల్చి చంపే హక్కు ఇవ్వలేదు. చంద్రబాబు పాలన జనానికి నచ్చకపోతే 2019లో ఆయన ఎన్నికలలో ఓడిపోతాడు. అంతేకాని మనకు నచ్చని నాయకుణ్ణి కాల్చి చంపాలని కోరటం క్రిమినల్ మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఇది తగునా?
పాలపర్తి సంగీత విజయవాడ వాస్తవ్యురాలు. భర్తను కోల్పోయి ఒక సంస్థలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసింది. తర్వాత ఫేస్‌బుక్ ద్వారా ఒక నైజీరియన్ వనితతో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌కు రావలసిందిగా ఈ నైజీరియన్‌ను ఆహ్వానించింది. అటు కస్టమర్లకు ఇటు డ్రగ్గిస్టులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించింది. అంటే ఈమె ఎకౌంట్ల ద్వారానే ద్రవ్య వినిమయం జరుగుతూ ఉండేది. క్రమంగా ఈమె అటు మాదకద్రవ్యాల వ్యాపారంతోపాటు వ్యభిచార గృహాల నిర్వహణ కూడా మొదలుపెట్టింది. రాచకొండ పోలీసు దళంవారి పరిశోధనలో ఈ వివరాలు క్రమంగా వెలుగులోకి వచ్చాయి. ఒక మాదకద్రవ్య వ్యాపారి నైజీరియన్ ఒజూకా కాస్మాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని అత్తాపూర్ ఏరియాలో ఉంటున్నది. దీనిని బట్టి బంగారు తెలంగాణ నిర్మించాలని అనుకున్న ఆదర్శానికి ఈ మాదక తెలంగాణా ఏర్పాటు చేస్తున్న మాఫియా ముఠాలు హాని చేస్తున్నాయని తెలియటంలేదా? అంటే ఇది శాంతిభద్రతల సమస్యగా అంతర్జాతీయ ఉగ్రవాదంలో భాగంగా మారిందని తెలుస్తున్నది. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఆగస్టు 6వ తేదీ మరో డ్రగ్స్ ముఠాను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. జాన్ బాస్కీ కొకైన్‌తో పట్టుబడ్డాడు. బొంబాయి కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతున్నది. కాకినాడ వాస్తవ్యుడు ప్రస్తుతం అమీర్‌పేట వాసి జానుల్లా. జహానుల్లా నైజీరియన్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఇక రైళ్లలో గంజాయి అక్రమ రవాణా యధేచ్ఛగా జరిగిపోతోంది. బంగారు తెలంగాణకు ఇవన్నీ అడ్డంకులే. సాధారణంగా ఇవి పెద్ద విషయాలుగా కనిపించవు. కానీ ఇవి దేశభద్రతకు సవాలు విసిరే అంశాలు. ఇక అసహనం అన్న కొత్త వాదన ఇటీవల మొదలైంది. మాజీ రాష్టప్రతి హమీద్ అన్సారీ వంటివారు కూడా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత మాటలు విసిరారు. ఇదంతా చూస్తే దేశం ఎటుపోతున్నదోనన్న ఆందోళన కలుగుతోంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్