సబ్ ఫీచర్

తరగతి గది సున్నితత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థితో సన్నిహిత సంబంధాలు పెంచుకోక పోవడం అన్నది పదునైన కత్తితో సమానం. అంటే విద్యార్థిని పదునుపెట్టే విధంగా చేయవచ్చు. అది బలుపుగా మారవచ్చు లేదా వాపుగా మారవచ్చు. అలాగే, విద్యార్థితో సన్నిహితత్వం పెంచుకుంటే తనకు తాను ఎక్కువగా అంచనా వేసుకుని నిర్లక్ష్యం కూడా వహించవచ్చు. అది ప్రోత్సాహకరంగా తీసుకుని ముందుకు నడవవచ్చు. చాలామంది విద్యార్థులు చురుకైన వారుగా తయారుకావటానికి ఉపాధ్యాయుని ప్రేరేణే కారణం.
విద్యార్థి చేసిన మంచి పనిని ఉపాధ్యాయుడు విధిగా మెచ్చుకోవాలి. విద్యార్థిని అతిగా పొగడకుండా సన్మార్గంలో పెట్టాలి. విమర్శిస్తే విద్యార్థులు నిరుత్సాహపడతారు. ప్రేరేపించి కొత్త సవాళ్లను పిల్లలముందుంచాలి. ఉపాధ్యాయుడు కూడా కొత్త సవాళ్ళు తెలుసుకోగలగాలి. అవి పాఠ్యపుస్తకాల్లో ఉండవు. ఉపాధ్యాయుడు బోధనకు సంబంధించి విద్యారంగంలో వస్తున్న మార్పులు అనునిత్యం గమనిస్తూ ఉండాలి. విద్యార్థితో ఉపాధ్యాయుడు సన్నిహితత్వం పెంచుకోవటం పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడాలి. ఈ సన్నిహితత్వంతో పిల్లల్లో కొత్త విషయాలు కనుక్కోవాలనే ఆసక్తిని పెంచాలి. జ్ఞానమనేది ఒక ఊట. ఎంత తీస్తుంటే దానిలోంచి అంత మంచి నీరు వస్తుంది. కొత్త సవాళ్లను పిల్లల ముందుంచటమే గాకుండా ఆ సవాళ్ళను వారు ఎదుర్కోగలుగుతున్నారా? లేదా? అని చూడటంలో ఉపాధ్యాయుడిలో వాత్సల్యత ఉండాలి. ఈ పని చేయకుంటే విద్యార్థి అక్కడనే ఆగిపోతాడు. సౌభాగ్యత అనేది తరగతి గదికి సున్నితమైన పరికరం. తరగతి గదిని సున్నితత్వంతో తీర్చిదిద్దండి.
కాల్పనిక ఆలోచనల కేంద్రం...
ఉపాధ్యాయుడు తనకున్న వ్యక్తిగతమైన ‘ప్యాషన్’ను కూడా విద్యార్థులకు చూపిస్తే వారు స్ఫూర్తి పొందుతారు. మాతో పనిచేసిన అసదొద్దీన్ హెడ్‌మాస్టర్‌గా ఉంటూ సాయంత్రం 4 గంటల తర్వాత క్రీడా ప్రాంగణానికి వచ్చి తాను ఆడేవాడు. ఆయన 50 సంవత్సరాల వయసులో వాలీబాల్ ఆడేవాడు. అతను ఆటలు ఆడటం వలన చాలామంది ఉపాధ్యాయులు కూడా గేమ్స్‌లో పాల్గొనేవారు. దీనివల్ల విద్యార్థుల్లో ఆటలపై అభిలాష పెంచడం జరిగేది.
ఉత్పల సత్యనారాయణాచారి తరగతి గదిలో పద్యం చదువుతుంటే మొత్తం ఆ ప్రాంగణమంతా పులకరించేది. కొందరు ఉపాధ్యాయులు తరగతి గదిలో వ్యక్తిగతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దీనివల్ల విద్యార్థులు అన్ని రంగాల్లో పాల్గొంటారు. వ్యక్తుల్లో ఉన్న కళలు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటాయి. ‘స్కూల్ డే’ సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. దీనివల్ల స్కూల్ కల్చర్ డెవలప్ అవుతుంది. విద్యార్థుల్లో వ్యక్తిత్వం ఏర్పడుతుంది.
తరగతి గదికి బహుముఖ పార్శ్వాలుంటాయి. అందుకే ఫలనా విద్యార్థులు ఏ స్కూల్లో చదువుకున్నారని కొందరు ఆరా తీస్తుంటారు. స్కూల్ పేరుతో ఆ వ్యక్తిలో దాగున్న గుణాలను అంచనావేసే దశ కూడా ఒకటుంది. తరగతి గది కేవలం సామూహికమైన ప్రతిఫలానికే వేదిక కాదు. వ్యక్తిగతమైన క్రియేటివ్ థింకింగ్‌కు కూడా వేదిక అవుతుంది. ఒకే విషయాన్ని ఎన్నో రకాలుగా విద్యార్థులపై ముద్ర వేయవచ్చు. తరగతి గది వైవిధ్యాలను కూడా ప్రోత్సహిస్తుంది. వైవిధ్యాల నుంచి వచ్చిన కాల్పనిక ఆలోచన కల్చర్‌గా మారుతుంది. ప్రతి స్కూలుకు ఒక ప్రత్యేక కల్చర్ వుంటుంది. తరగతి గది ఎంతో మంది ఉపాధ్యాయుల కాల్పనిక ఆలోచన- క్రియేటివ్ థింకింగ్‌కు ప్రతీకగా ఉంటారు. కేవలం అకడమిక్ సబ్జెక్టులే కాకుండా విభిన్న అంశాల్లో పిల్లల్లో కదలిక తీసుకురావాలి.

-చుక్కా రామయ్య