Others

బాధ్యత మనమే తీసుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియమైన శర్వాణి
ఉబయకుశోలపరి ..
నీవు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాను. మనమీద పెద్ద బాధ్యత ఉంది పద్మా . దాన్ని అందరూ పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు. నీవు ఇది చదువు. నీకేమనిపిస్తుందో నాకు చెబుదువుగానీ. ... నాడు అంటే
తంజావూరు రాజుల కాలంలో తెలుగు కావ్యాలకి, యక్షగాన, ప్రబంధం మొదలైన ప్రక్రియలకి, కవయిత్రులకీ సముచిత స్థానం లభించింది. రామభద్రాంబ, కృష్ణాజీ, మధురవాణి, రంగాజమ్మ, ముద్దుపళని వంటి కవయిత్రులు కవిత్వంలో తమ పాండిత్యాన్ని చూపించారు. వీరందరిలో రంగాజమ్మ మాత్రమే యక్షగానం రాసింది.
‘రఘునాథాభ్యుదయము’ పేరుతో రఘునాధుని నాయకుడుగా మలిచి ఆయన జీవిత వృత్తాంతాన్ని కావ్యంగా మలిచింది. ఈ కావ్యంలో 900 శ్లోకాలున్నాయి. రాజుల పరాక్రమాన్ని వర్ణించే తీరును చూసి రాజుల పరాక్రమాలకు పదును పెట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి వర్ణనల్లో
ఒక సంగీత సభలో ‘రారాజని యచ్యుతేంద్ర రఘునాథ నృపా..’ అనే తెలుగు సమస్యని రామభద్రాంబ పూరించిన తీరు చూడండి
‘‘ఏరి నీ సరి రాజులు?
భూరమణులు నిన్ను జాల బొగడుదురు భళీ!
స్వరాజని రేరాజని
రారాజని యచ్యుతేంద్ర రఘునాథ నృపా..’’ అని అందమైన కందంలో పూరించి ప్రశంసలు పొందింది. ఇది ఆనాటి కవయత్రులు తీరు.
మరి నేడు కూడా పుంఖాను పుంఖాను రాసే కవయత్రులు ఉన్నారు. వారంతా చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నారా, వారి రచనలవల్ల సమాజహితం జరుగుతోందా అంటే ఆలోచించవలసిందే. అందుకే నేటి రచయత్రులందరూ పక్కదారి పట్టిపోతున్న నేటి యువతను సరియైన దారిలోకి మళ్లించే శక్తి గల రచనలు చేయాలి. వారి ప్రోత్సాహంతో వారి రచనలతో యువతను మళ్లీ భారతదేశ కీర్తిని దశదిశలా చాటి చెప్పగలిగే వారిగా మార్చాలి. విదేశీ వ్యామోహంతోను, పాశ్చాత్చపోకడలు పోయే వారిని తిరిగి మన భారతదేశ ఖ్యాతికి వెనె్నముకల్లా చేయాల్సిన బాధ్యత నేటి మహిళలపైన అందులో రచయత్రుల పైన మరింత ఉంది. కదూ
ఇట్లు నీ..
పద్మ