సబ్ ఫీచర్

ప్రత్యేక రైళ్లు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పుతీర ప్రాంతవాసులకు ఉపయోగకరంగా ఉండేందుకు కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి హౌరా స్టేషన్‌కు ఈ వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపాలి. విశాఖ, విజయవాడ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ మీదుగా ఈ రైళ్లు నడిపితే తీరప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రస్తుతం నడుపుతున్న రైళ్లు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో పనులకోసం ఈ ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందువల్ల సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే జనరల్ బోగీలు ఎక్కువగా ఉండే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నించాలి.
-జె.సుధాకర రావు, కాకినాడ
రాహుల్‌కు తెలియదా?
జాతీయ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న తపనతో ఉన్న రాహుల్‌గాంధీ అందుకు తగ్గ రీతిలో సిద్ధం కావడంలేదనిపిస్తోంది. తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు, చర్యలు అతడి అపరిపక్వతను చాటిచెపుతున్నాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ దానిని బలపరుస్తోంది. పంజాబ్ యూనివర్శిటీలో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. వారిలో కొందరిపై దేశద్రేహం నేరం మోపారన్నది వార్తాంశం. ఇది అన్యాయమని రాహుల్ ట్వీట్ చేశారు. నిరసన తెలిపితే దేశద్రోహమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. నేరుగా ప్రభుత్వంతో మాట్లాడక ఇలా ట్వీట్ చేయడం ఏమిటన్నది ప్రశ్న. అసలు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం రాహుల్‌కు తెలుసా అన్నదే సందేహం.
-పి.చంపక్, తూర్పుగోదావరి జిల్లా
రైతులను ఆదుకోవాలి
రైతుల పెట్టుబడులకు సహకారం, ఉచితంగా ఎరువులు అందించడం వంటి నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వం వారిలో కొత్త ఆశలు చిగురింపచేసింది. అయితే నకిలీ విత్తనాలు, ప్రభావం చూపని పురుగుమందులతో ఇంకా రైతులను వ్యాపారులు మోసం చేస్తూనే ఉన్నారు. వ్యవసాయరంగానికి ఊతమిస్తామని చెబుతున్న ప్రభుత్వం తాజా నిర్ణయాలకు తోడుగా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులనూ వారికి అందుబాటులోకి తెస్తే ఎంతో మేలు జరుగుతుంది.
-వి.బాలకేశవులు, గిద్దలూరు