కడప

వరద అరాచకానికి పరాకాష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 5: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై ఎక్కడికక్కడ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి కడప మేయర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాష, జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాధరెడ్డి తమ సంపూర్ణమద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరులో మాజీ శాసన సభ్యుడు నంద్యాల వరదరాజులురెడ్డి ఒక అరాచక శక్తిగా మారి శాసన సభ్యుడు రాచమల్లు ప్రసాదరెడ్డి చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. 25 సంవత్సరాల పాటు శాసన సభ్యుడిగా ఉన్న వరదరాజులురెడ్డి ప్రొద్దుటూరు అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పటివరకు పట్టణానికి తాగునీటి వసతి లేకపోవడమేనని ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రొద్దుటూరు తన సొంత ఆస్తిగా పరగణిస్తున్న వరదరాజులురెడ్డి వైకాపా శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడటమేగాక అక్రమకేసులు బనాయిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో అక్రమ కట్టడాలు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి కోరితే వరదరాజులురెడ్డి అలాంటి వారిపై అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు. రాష్టమ్రహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి మాట్లాడుతూ మున్సిపల్ టిపిఓ శివగురుమూర్తి నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాల యజమానుల నుంచి లక్షలరూపాయలు లంచాలు తీసుకుని వారిని ప్రోత్సహిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో తానుచేసిందే చట్టమని విధంగా వరదరాజులురెడ్డి వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాచమల్లు ప్రసాదరెడ్డి సమీప బంధువు బంగారుమునిరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డిలను అంతం చేస్తామని చెప్పడం ఆయన వ్యవహారశైలికి పరాకాష్ట అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో వారికి ఎలాంటి సంఘటనలు జరిగినా అందుకు వరదరాజులురెడ్డే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. ఫ్లోర్‌లీడర్ ముక్తియార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇవి సుధాకర్‌రెడ్డి...వరదరాజులురెడ్డి అక్రమాలపై దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో వైకాపా శ్రేణులపై జరుగుతున్న దాడులు , బెదిరింపులు మరెక్కడా జరగడం లేదని, ఇది వరదరాజులురెడ్డి అరాచకానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రసాద్, కౌన్సిలర్లు కందుకూరి అనసూయ, పూస వరలక్ష్మి, వరలక్ష్మిరామదాసు, శంకర్, రాగుల శాంతి, బాబయ్య, జెడ్పిటిసి రామలక్ష్మితోపాటు కడప మహిళా నాయకురాళ్లు వెంకటసుబ్బమ్మ, పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి, వసంత, కరీముల్లా, గౌస్‌ఖాన్,మున్నా, అల్త్ఫా, ఎంపి సురేష్ తదితరులతోపాటు రైతు విభాగం, విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,్ఫబ్రవరి 5: జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించే విషయంలో ఆయా మండలాలకు చెందిన పోలీసు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠి స్పష్టంచేశారు. జిల్లాలో వివిధ మండలాల్లో పర్యటన అనంతరం శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఉన్న అసాంఘిక శక్తులు, ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం వల్ల చాలావరకు ఫ్యాక్షన్, అసాంఘిక శక్తుల ఆగడాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొత్తగా తెరపైకి వచ్చిన కాపునాడు సమస్యకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతాఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం , ఆయన సతీమణి కాపులను బిసిల్లో చేర్చాలని ఆమరణనిరాహార దీక్ష చేపట్టిన నేపధ్యంలో కడప జిల్లాలోని కాపునాడు నాయకుల కదలికలపై నిఘా వేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఎర్రచందనం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ , చైన్‌స్నాచింగ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించారని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే కొంతమంది సీనియర్ విద్యార్థులకు ఆ బాధ్యతలు అప్పచెప్పేవారు. 100 శాతం విద్యార్థుల హాజరుచూపించి కోట్లరూపాయలకు పడగలెత్తారు. సంబంధిత అధికారులు అప్పచెప్పిన సరుకుల్లో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించి వారు సైతం అందినకాడికి దండుకునే వారు. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ తదితర వసతి గృహాలు 200లకు పైబడి ఉన్నాయి. బయోమెట్రిక్ విధానంతో వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వం నిర్ణయించిన సమయానికే హాజరుకావాల్సి వుంది. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల చేత వేలిముద్రలు సేకరించి ఆహారపదార్థాలు ఇవ్వాల్సివుంటుంది. గతంలో సెలవురోజుల్లో నెలకు రెండు,మూడు పర్యాయాలు పిల్లలను ఇళ్లకు పంపి వారికి హాజరువేసుకుని బొక్కేసేవారు. బయోమెట్రిక్ విధానంతో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే వెల్ఫేర్ అధికారులకు చిల్లిగవ్వ మిగిలే పరిస్థితి లేదు. దీంతో డిప్యుటేషన్‌మీద వచ్చిన అధికారులు రద్దుచేసుకుని తమ సొంతశాఖలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తమీద బయోమెట్రిక్ విధానంతో ప్రభుత్వం ఆశించిన క్రమశిక్షణతోపాటు అక్రమాలకు చాలావరకు చెక్‌చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ విధానం పూర్తిస్థాయిలో అమలుకావడానికి కొంత సమయం పడుతుంది.
హాస్టల్ అధికారులకూ బయోమెట్రిక్..!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 5: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఇప్పటికే విద్యార్థులకు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బందికి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. దీంతో పూర్తిస్థాయిలో వసతి గృహాల్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఉపాధ్యాయులుగా ఉంటూ వివిధ వసతిగృహాలకు డిప్యుటేషన్‌పైన, బదిలీ మీద వచ్చిన సుమారు 30మంది ఉపాధ్యాయులు సొంత గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరంతా వసతిగృహాల్లో ఆదాయం ఉంటుందని లక్షల రూపాయలు వెచ్చించి పెద్దఎత్తున సిఫార్సులు చేసుకుని డిప్యుటేషన్‌పై వచ్చారు. బయోమెట్రిక్ విధానం ద్వారా తు.చ తప్పక ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపే వసతి గృహం అధికారులు, సిబ్బంది విధులకు హాజరుకావాల్సి వుంటుంది. గతంలో వీరిలో చాలామంది పట్టణాల్లో నివాసం ఉంటూ మొక్కుబడిగా విధులు సాగిస్తూ పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారపదార్థాలు , వివిధ వస్తువులు రెండు లేక మూడురోజులకు సరిపడేలా వర్కర్లకు అప్పచెప్పి వెళ్లేవారు. ముఖ్యంగా తమిళ కూలీలపై కూడా నిఘా ఏర్పాటుచేసి తమిళకూలీలు, ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. జిల్లాలో అసాంఘిక శక్తులు ఏ రూపంలో ఉన్నా వారిని అణగదొక్కేందుకు పోలీసు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రశాంతవాతావరణం నెలకొల్పేందుకు తమశాఖ అప్రమత్తంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు.

కాపులను బిసి జాబితాలో చేర్చితే సహించం
కడప (కల్చరల్), ఫిబ్రవరి 5: కాపులను బిసి జాబితాలోచేర్చితే తాము సహించబోమని, అలాచేస్తే తమకు తీరని అన్యాయం జరుగుతుందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శంకర్‌రావు పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం బిసి నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను బిసిలకు నష్టం లేకుండా చేర్చడమనేది అవాస్తవమని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో వర్గీకరణ లేనందు వల్ల బిసి-ఇగా 4శాతంకు పరిమితమైన ముస్లింలు 33శాతం సీట్లలో పోటీ చేసే హక్కును పొందారని గుర్తుచేశారు. రేపు కాపులు కూడా 33శాతం బిసి కోటాలో రాజకీయంగా పోటీ చేస్తే నిజమైన బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా , ఉద్యోగ రంగాల్లో బిసి రిజర్వేషన్ ఏ,బి,సి,డిలుగా వర్గీకరించి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బిసిలకు మంజూరు విషయంలో సబ్‌ప్లాన్ నిధులు కేటాయించాలని వారు పేర్కొన్నారు. బిసిలకు రాజకీయ పార్టీలు ఇచ్చే నామినేటెడ్ పదవులకోసం, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు కాపు కులస్తులు పోటీకి వస్తారని, కాపులను బిసిల్లో చేర్చితే నిజమైన బిసిలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చిదానందగౌడ్, బాలకృష్ణయాదవ్, బాలయ్య యాదవ్, గురుమూర్తి, నరసింహులు మాట్లాడుతూ బిసిలకు ఎస్సీ, ఎస్టీల మాదిరి జనాభా ప్రకారం 50శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగానే రిజర్వేషన్ శాతం పెంచి బిసిలకు 50శాతం ఇవ్వాలన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చితే విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగానే కాకుండా సంక్షేమపథకాల పరంగా కూడా బిసిలు తీవ్రస్థాయిలో నష్టపోతారన్నారు. ప్రభుత్వం ఈప్రతిపాదనను విరమించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, నాగరాజు, కొర్రామణి, శివప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.
విద్యుత్ ఆదా కోసమే ఎల్‌ఈడి బల్బులు
ఖాజీపేట, ఫిబ్రవరి 5: ప్రతిఒక్కరూ విద్యుత్ ఆదా చేసుకునేందుకు ఎల్‌ఈడి బల్బులు ఎంతగానో ఉపయోగపడతాయని మండల విద్యుత్ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఖాజీపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి వినియోగదారుడు విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు వెంట తీసుకొని వస్తే రెండు బల్బులు ఇస్తామన్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఎల్‌ఇడి బల్బులు అందజేస్తామని అన్నారు. విద్యుత్ వినియోగదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యుత్ పొదుపునకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

శాంతిభద్రతలు గుడ్
వేంపల్లె, ఫిబ్రవరి 5: జిల్లా వ్యాప్తంగా చాలావరకు శాంతిభధ్రతలు అదుపులో వున్నాయని జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం బాగా పనిచేస్తోందన్నారు. దీంతో శాంతిభధ్రతలు అదుపులో వున్నాయన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకొస్తున్నారని, ఈ కెమెరాల ఏర్పాటుతో శాంతిభధ్రతలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్నారు. తుని సంఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా వుందన్నారు. తుని సంఘటనలో పాల్గొన్న వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించడం వుండదని, ఇటీవల సబ్‌జైల్ నుండి పరారీ అయిన ముగ్గురు ఖైదీలను పట్టుకొనేందుకు మూడు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. వేంపల్లె స్టేషన్ ఆవరణంలో శుభ్రంగా వుంచడంతోపాటు గ్రీనరీని ఏర్పాటుచేసిన వేంపల్లె ఎస్ ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డిని, సిబ్బందిని పులివెందుల ఎ ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల రూరల్ సి ఐ మహేశ్వర్‌రెడ్డి, వేంపల్లె ఎస్ ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సిక్కోలుకు తరలి రండి
కడప (రూరల్), ఫిబ్రవరి 5: ఈనెల 12న ఛలో సిక్కోలు (శ్రీకాకుళం)కు ఎన్‌జివోలు తరలిరావాలని జిల్లా అధ్యక్షుడు కెవి శివారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఎన్‌జివో హోమ్‌లో శుక్రవారం ఛలో సిక్కోలు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల డిమాండ్లను ఎన్‌జివో సంఘం సాధించుకుందన్నారు. డిఏ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం, మార్చిలో హెల్త్‌కార్డులు వంటివి ప్రధాన డిమాండ్లను సాధించుకున్నామన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు, కంటెంజెన్సీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో ఛలో సిక్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 12న శ్రీకాకుళంలో జరిగే ఎన్‌జిఓ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని , ఒకే ఒక డిమాండ్‌తో ముఖ్యమంత్రి ఎదుటకు వెళ్తున్నందున ఆ డిమాండ్ సాధించుకోవడం సులభమన్నారు. ఈనెల 10వ తేది ఉదయం 10గంటలకు రేణిగుంటలో పూరి ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా ఎన్‌జిఓలు సిక్కోలు చేరుకోవాలన్నారు. అన్నిశాఖల్లో ఉన్న కాంట్రాక్టు, కంటింజెన్సీ ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ను సాధిస్తామని వారు దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జిఓ సంఘం కోశాధికారి నిత్యపూజయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యక్షుడు తులసీ మనోహర్, శ్రీనివాసులు , అసోయేట్ అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బీమా చెల్లింపులో రైతులకు అన్యాయం చేయొద్దు
చెన్నూరు, ఫిబ్రవరి 5: రైతులు నష్టపోయిన పంటలకు బీమా పథకం కింద రైతులకు రావాల్సిన సొమ్ము ఇవ్వడం లేదని కమలాపురం శాసన సభ్యుడు పి.రవీంద్రనాధరెడ్డి పేర్కొన్నారు. చెన్నూరు గ్రామపంచాయతీ నిధుల కింద శివాలయం వీధిలో శుక్రవారం సిమెంట్‌రోడ్డుకు భూమిపూజ చేశారు. అనంతరం చెన్నూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు సాగుచేసిన పంటలకు బీమా చేసినప్పటికీ... రావాల్సిన పంటల బీమాను చెల్లించడంలో ఇన్సూరెన్స్ అధికారులు కాలయాపన చేస్తున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా వందలాదిమంది రైతులకు పంటల బీమా అందక బీమా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, ఈవిషయంపై తాము ఆందోళన చేపట్టాల్సివస్తుందని హెచ్చరించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజిలకు నిధులు అందించడం లేదన్నారు. కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులుతప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు ఎటువంటి నిధులు అందడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ రాజేశ్వరి, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ప్రభుత్వాధికారులు, వైకాపా నాయకులు పొట్టిపాటి ప్రతాప్‌రెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు.
సొసైటీ కాలనీ వాసుల ఆస్తులకు చట్టబద్దత కల్పించాలి
పట్టణంలోని సొసైటీకాలనీవాసుల ఆస్తులకు రెవిన్యూశాఖ చట్టబద్దత కల్పించాలని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి శుక్రవారం కడప ఆర్డీవో చిన్నరాముడును కోరారు. ఆ కాలనీకి చెందిన 400మందికి పైగా హౌసింగ్‌బోర్డు ద్వారా 1979లో కొనుగోలు చేసారని అన్నారు. ఈ తరువాత వందలసంఖ్యలోచేతులు మారి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయన్నారు. ఆ స్థలాలలో పెద్ద సంఖ్యలో భవంతులు నిర్మించుకున్నారన్నారు. గత 4 ఏళ్ల క్రితం రెవెన్యూశాఖ సొసైటీకాలనీ స్థలాలను డికెటిగా తెలియచేసి రిజిస్ట్రేషన్లు జరుపకుండా ఆపివేసారన్నారు. ఇందువల్ల ప్రజలు తమ ఆస్తులకు భద్రత లేక ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ దృష్టికి స్థానిక ప్రజలు తీసుకెళ్లినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రెవిన్యూశాఖ స్పందించి కాలనీ ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇదే విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే ద్వారా తహశీల్దార్ రామ్మోహన్‌కు కూడా వినతిపత్రం అందచేసారు.
చేనేత సంఘాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
ముద్దనూరు, ఫిబ్రవరి 5: మండల పరిధిలోని చేనేత సంఘాల్లో శుక్రవారం కడప ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. ముందుగా శ్రీకృష్ణా చేనేత సొసైటీలో రికార్డులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు. చేనేత సంఘాలపై వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా సంబంధిత సంఘాల్లోని సభ్యుల వివరాలు పూర్తిగా సేకరించి తప్పొప్పులపై నివేదిక తయారు చేయనున్నట్లు తెలిపారు. మండలంలో మరో మూడు సంఘాల్లో కూడా రికార్డులు తనిఖీ చేస్తామన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ సిఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ రామచంద్ర, ఎఓ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేగంగా ఆలయ అభివృద్ధి పనులు
ఒంటిమిట్ట, ఫిబ్రవరి 5:ఆంధ్ర భద్రాధిగా గుర్తింపు పొందిన ఏకశిల కోదండ రామాలయ అభివృద్ధి పనులు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. గత నాలుగు రోజులుగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్ పనులు చేపట్టిన విషయం విదితమే. బ్రహ్మోత్సవాల గడియలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు రోడ్డుపనులను జెసిబితో ప్రారంభించారు. ఆలయం చుట్టూ రోడ్లు వేయనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే నేమ్ బోర్డులు, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. నేడో, రేపో టిటి ఇఓ సాంబశివరావు రానున్న దృష్ట్యా ఈ పనులు వేగవంతం చేస్తున్నారు. ఏదీ ఏమైన రామయ్య బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటి నుంచే ముస్తాబవుతున్నారు. ఈ పనులను సూపరింటెండెంట్ నాగరాజు పర్యవేక్షిస్తున్నారు.