Others

‘‘బుల్లెట్’’లో పాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరే విమానాలు, పైగా ఎయిర్ ఇండియా విమానాలు నిర్లక్ష్యం అనుకుందామా అంటే అత్యంత ఆధునిక సాంకేతిక సదుపాయాలున్న జపాన్ దేశంలో బుల్లెట్ రైలు చాలా పేర్గాంచింది. సుఖం, క్షేమం, వేగం గల బుల్లెట్ రైలు పోయిన సోమవారం టోక్యో నుంచి హిరోషిమాకు పరుగులు తీస్తున్న సమయంలో ఓ ప్రయాణీకుడు లేచి ‘పాము.. పాము..’ అంటూ గగ్గోలు మొదలెట్టాడు.
శరవేగంగా దూసుకుపోయే రైలునాపేశారు. పాముకోసం గాలించారు. సీట్లమధ్య ‘టిక్కెట్ లేని ప్రయాణీకుడు నక్కినట్లు’ ఆ సర్పం దాక్కొని వున్నది. దొరికింది గానీ బుల్లెట్‌లోకి యిది ఎలా వచ్చింది? అన్నది ప్రశ్న. ‘‘ఎవరేనా పాముల్ని స్మగ్లింగ్ చేస్తున్నారేమో?!’’ అన్న అనుమానంతో రైలు రైలంతా స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు. మనం అత్యంత ఆధునికం అనుకునే ప్రయాణాల్లోనే యిటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి!- జాగ్రత్త!

-వీరాజీ