పర్యాటకం

యశస్సునిచ్చే యాదగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తె లంగాణారాష్ట్రంలో అదిపెద్ద వైష్ణవ క్షేత్రంగా ప్రఖ్యాతి గడించిన క్షేత్రం యాదగిరి గుట్ట. నాడు ప్రహ్లాదునికి ఆనందాన్ని గూర్చిన ఉగ్రనరసింహుడు యాదర్షి కోరిక మేరకు ఈ యాదగిరి క్షేత్రాన ఐదురూపాల్లో వెలిశాడు. నాడు దుష్ట శిక్షణ కోసం శిష్టరక్షణకోసం ఎక్కడరా నీ హరి అని వెర్రిగంతులు వేసే హిరణ్యకశుపుని ఆటకట్టించడానికి, ఆ రాక్షసరాజు వల్ల పీడింపబడే హరి భక్తులను రక్షించడానికి ఉగ్రుడైన మహా విష్ణువు నరమృగ రూపంలో వికట్టాట హాసం చేస్తూ స్తంభంలోంచి మిక్కిలి భయంకరాకారుడై ఉద్భవించాడు.
ఎర్రని కన్నులతో, తెల్లని ద్రంష్టము లతో, సుడిగాలికి అల్లలాడే చెట్లకొమ్మల వలె ఉన్న రోమాలతో, వాడియైన గోళ్లతో సర్వలోకాలు గడగడ లాడించేలా ఉన్న ఉగ్రత్వంతో బయల్వెడిన నరసింహుడు హిరణ్యకశ్యపుడు కోరుకున్నట్టుగానే తన అంకంపై పరుండబెట్టుకుని హిరణ్యుని పొట్టను చీల్చి వేసాడు. వైరభక్తితో త్వర గా మహావిష్ణువును చేరుకోవాలనే ఉద్దే శంతో ఈ జన్మను చాలించుకున్న హిర ణ్యకశ్యపుడు వైకుంఠం చేరాడు. ఆ తరువాత ఆ ఉగ్రనరసింహ రూపాన్ని చూచి అందరూ భయభ్రాంతులవుతుం టే చిన్నవాడు, విష్ణ్భుక్తుడు అయన ప్రహ్లాదుడు ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహ రించుకోమని వేడుకున్నాడు. భక్తసులభు డు తన ఉగ్రత్వం కేవలం దుష్టులకు మాత్రమేనని తన భక్తులను కాపాడ డానికి ఎల్లవేళలా సంసిద్ధంగా తాను ఉంటానని అభయం ఇచ్చాడు. ఆ తరు వాత ఆ ఉగ్రనరసింహుడే ఈ తెలంగాణా ప్రాంత ప్రజలను కాపాడడానికి ఆంజ నేయుడు క్షేత్రపాలకునిగా ఉన్న ఈ యాదగిరి అన్న ప్రాంతంలో యాదర్షి కోరికపై కొలువైయ్యాడు నాటి నుంచి నేటి వరకూ తన భక్తులను కాపాడుతూ నిత్యమంగళునిగా కీర్తింపబడే స్వామిని దర్శించడానికి వేలకొలది మైళ్లదూరం నుంచి కూడా భక్తులు తరలి వస్తుం టారు. ఈ స్వామికి ఫాల్గున మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు.
పూర్వకాలంలోఈ స్వామిని కొలవ డానికి దివి నుంచి దేవతలు దిగి వచ్చేవారని ఇక్కడి స్థానికులు చెప్తుం టారు. ఇప్పటికీ రాత్రివేళ ఈ దివ్యుల సంచారం జరుగుతోందని భక్తుల విశ్వాసం. దివ్యులు రాత్రివేళ శివుని పూజించిన పూలు, చందనాదుల నైర్మ ల్యాలను ఇక్కడి వారెందరో చూచినట్లు చెబుతుంటారు ఇప్పటికీ. ఈ నరసింహ స్వామిని కొలిచిన వారికి ఏ కొరత ఉండదు. అంతేకాక సంతానార్థులు, అర్థమును కోరేవారు, విద్యను ఆకాం క్షించేవారు ఇలా ఎన్నో కోరికలతో ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని 41రోజులపాటు లేక 21 రోజుల పాటు ఇక్కడే ఉంటూ స్వామిని కొలుస్తారు. ఇట్లా చేయడం వల్ల స్వామి వారు భక్తుల కోర్కెలను సత్వరం తీరు స్తారని నమ్మకం భక్తులలో మెండు. ఈ యాదగిరి నరసింహుడు సర్వ జనావళికి మోదాన్ని గూర్చే సర్వేశ్వరునిగా దర్శన మిస్తాడు. సర్వాలంకారభూషితుడైన స్వా మి చెంత అమ్మ లక్ష్మీనిలిచి ఉంటుంది. స్వామిని దర్శించుకొన్నందరి ఈతి బాధలను తీర్చడానికేనన్నట్టుగా అమ్మ కరుణార్థపూరిత కన్నుల తో చిరునవ్వుతో భక్తులను వీక్షిస్తుంటుంది. ఈ యాదగిరీ శుని దర్శించుకున్న వారికి అనారోగ్యాలు దూరమవుతాయ. మానసికక్లేశాలు దరి చేరవు. హైదరాబాదుకు అతి సమీపం లోఉన్న ఈ యాదగిరి క్షేత్రానికి చుట్టు పక్కల రాష్ట్రాలనుంచి ఎంతో మంది భక్తులు తండోపతండాలు వచ్చి దర్శిస్తుం టారు. యాదగిరి క్షేత్రదర్శనం సర్వ పాపహరం.

- ఎస్.వి. ఎస్. సాయ