S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/09/2019 - 06:12

గచ్చిబౌలి, మార్చి 8: జన సంచారం లేకుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు దొంగిలించిన సొత్తును విక్రయించే మరొకరిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.10లక్షల విలువ చేసే 15తులాల బంగారు ఆభరణలు, రెండు ద్విచక్ర వాహనాలను, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు.

03/09/2019 - 00:11

హైదరబాద్, మార్చి 8: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి, తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన డేటా వివాదం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. మరో వైపుమాటకు మాట.. కేసుకు కేసు.. సిట్‌కు సిట్, డేటా ఫైట్‌లో ఎక్కడ కూడా వెనుకంజవేసేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

03/09/2019 - 00:11

హైదరాబాద్ / మెహిదీపట్నం, మార్చి 7: నగరంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక చిన్నారి ప్రాణం తీయగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మరో 32 మంది నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాంపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యుపీహెచ్‌సీ)లో చిన్నారులకు బుధవారం టీకాలు వేశారు.

03/08/2019 - 23:37

చింతకొమ్మదినె్న, మార్చి 8: వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ప్రియురాలు ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా అది చూసి భరించలేక ప్రియుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన కడప జిల్లా చింతకొమ్మదినె్నలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

03/08/2019 - 23:32

చెన్నూరు, మార్చి 8: అప్పులు, ఆస్తి గొడవల నేపధ్యంలో ఓ తండ్రి క్షణికావేశంలో ఏడేళ్ల కొడుకుకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కడప జిల్లా చెన్నూరులో శుక్రవారం జరిగింది. చెన్నూరు ముస్లిం మైనార్టీ కాలనీకి చెందిన ఫరూక్(30) తన కొడుకు ఇబ్రహీం(7)కు ఇంట్లో దూలానికి ఉరేసి, తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఫరూక్ ఆస్తి అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

03/08/2019 - 22:28

రాయిపూర్, మార్చి 8: తీవ్రవాద కార్యకలాపాలతో విధ్వంసం సృష్టించిన ప్రముఖ మావోయిస్టు నేత మడకం అర్జున్ శుక్రవారం ఇక్కడ సుక్మా జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు చెప్పారు. అర్జున్ తలకు గతంలో రాష్ట్ర పోలీసు శాఖ రూ.8 లక్షల వెల కట్టింది. దక్షిణ బస్తర్ జిల్లాలో 18 ఏళ్లుగా తీవ్రవాద కార్యకలాపాలకు అర్జున్ పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. చేతన నాట్యమండలిలో క్రియాశీల పాత్ర వహించాడు.

03/08/2019 - 03:54

నెల్లూరు, మార్చి 7: నిబంధనల మేరకు చేయాల్సిన పనికి లంచం స్వీకరిస్తూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి ఆంజనేయరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన గురువారం నగరంలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఇసనాక సురేంద్రరెడ్డి కార్పొరేషన్ పరిధిలో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటారు.

03/08/2019 - 03:53

దుబ్బాక, మార్చి7: నమ్ముకున్నన వ్యవసాయం నట్టేట ముంచింది. భూమిలో బోరు వేస్తే.. అప్పే మిగిలింది తప్ప నీరు మాత్రం రాలేదు. కాలం కలిసి రాక, దిగుబడిలేక ఏటా అప్పులు గుట్టలా పెరిగాయి. వాటిని తీర్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసి చేసిన ఫలితం లేకపోవడంతో ఇక చావుతప్ప పరిష్కారం లేదని భావించిన రైతు తనువు చలించాన విషాధ సంఘటన మండల పరిధిలోని ఆకారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..

03/08/2019 - 02:15

చెన్నై, మార్చి 7: మూత్ర పిండాలు పనిచేయడం మానేసి మృత్యుముఖంలో ఉన్న తల్లికి ఒక మూత్ర పిండాన్ని ఇచ్చేందుకు 36 సంవత్సరాల తనయుడికి అనుమతినివ్వాలని చెన్నై హైకోర్టు గురువారం సంబంధిత అధికారులను ఆదేశించింది. తల్లి ప్రాణాలు రక్షించుకునే ఆత్రుతలో సరైన డిక్లరేషన్ ఇవ్వలేకపోవడంతో ఆస్పత్రి అధికారులు పాండిచ్చేరికి చెందిన సెంధిల్‌కుమార్ మూత్రపిండం తీసుకునేందుకు అంగీకరించలేదు.

03/08/2019 - 02:09

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 7: స్థానిక రాడార్ కేంద్రం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతి చెందిన వైనం ఇది. సేకరించిన వివరాల ప్రకారం గుడివాడకు చెందిన మెరుసు జయలక్ష్మి (56) గత కొంత కాలంగా మానసిక వేదనకు గురవుతోంది.

Pages