S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/08/2019 - 02:08

కూచిపూడి, మార్చి 7: అదుపు తప్పిన ట్రాక్టర్ అవ్వారి సుబ్బారావుకు చెందిన వెల్డింగ్ దుకాణంలోకి దూసుకువెళ్లిన సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మొవ్వ మండలం పెదపూడిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

03/08/2019 - 01:56

బాలాపూర్, మార్చి 7: ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగలు పడి రూ.7లక్షల నగదు, 6.5 తులాల బంగారు ఆభరణాల చోరీ చేసిన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మేకుల మనోహర్ రెడ్డి అల్మాస్‌గుడ ఎంఆర్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో భోజనాలు అనంతరం నిద్రపోయారు.

03/08/2019 - 01:55

మహేశ్వరం, మార్చి 7: దివాస్ పైన ఆడుకుంటు కిందపడి రెండేళ్ల బాలుడు అనురాగ్ మృతి చెందిన సంఘటన మండలంలోని అమీర్‌పేట్ గ్రామంలో చోటు చేసుకుంది మహేశ్వరం సీఐ వెంకన్ననాయక్ కథనం ప్రకారం కంది వేణుగోపాల్, లాహస్యల రెండేళ్ల కుమారుడు అనురాగ్ ఇంట్లో దివాస్ పై ఆడుకుంటు కిందపడి తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం నగరంలోని నీల్‌ఫర్ ఆసుత్రికి తరలించారు. తలకు తీవ్రమైన గాయమైందని ఆసుప్రతిలో చికి త్స పొందుతూ...

03/08/2019 - 01:55

జీడిమెట్ల, మార్చి 7: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్‌లో నివాసముండే సంగమేశ్ (26) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తాడు. మానసికంగా బాధ పడుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సంగమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

03/08/2019 - 01:12

పూణె, మార్చి 7: గదిలో కొట్టిన పెస్ట్‌కంట్రోల్(పురుగుల మందు) ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. నగరంలోని ధన్‌కావాడీలో ఈ విషాదం చోటుచేసుకుంది. అజయ్ బెల్డార్(20), అనంత్ ఖేద్కార్(20) నగరంలోని ఓ కాలేజీ కేంటీన్‌లో పనిచేస్తున్నారు. కేంటీన్ మేనేజర్ వారిద్దరికీ సమీపంలోనే ఓ గది ఇచ్చాడు. పని అయిపోగానే గదికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆదివారం రాత్రి గదిలో పెస్ట్‌కంట్రోల్ కొట్టారు.

03/08/2019 - 01:11

భవానీపట్న (ఒడిశా), మార్చి 7: ఒడిశాలోని కలహండి జిల్లాలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారనే ఆరోపణపై ఒక సామాజిక కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. సీఆర్‌పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు ఈ పనులను నిర్వహిస్తున్నారు. లింగరాజ్ బాగ్ అలియాస్ ఆజాద్ అనే వ్యక్తి పనులను అడ్డుకున్నందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

03/08/2019 - 04:18

చిలకలూరిపేట: కన్న ప్రేమను మరచిపోయిన కసాయి తండ్రి తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా గొంతుకోసి హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. చిలకలూరిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లికి చెందిన గాదె రమణమూర్తి (35), కోటిలక్ష్మి కులాంతర వివాహం చేసుకున్నారు.

03/07/2019 - 22:38

కొత్తపట్నం, మార్చి 7: సముద్రంలో గల్లంతైన శవం గురువారం గవండ్లపాలెం సమీపంలోని రవి హేచరీస్ వద్ద లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మడనూరు గ్రామానికి చెందిన మార్టూరి రవిచంద్రారెడ్డి సముద్ర స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడని, గురువారం రవి హేచరీస్ సమీపంలో శవం లభించిందని ఎస్‌ఐ కె విజయకుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు.

03/07/2019 - 21:51

సారవకోట, మార్చి 7: మండలంలోని పెద్దగుజ్జువాడ కూడలి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలం గరాలి గ్రామానికి చెందిన జన్ని లక్ష్ముడు(49) సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగంలో చక్రతీర్ధ స్నానాలకు వెళ్లేందుకు గాను గరాలి గ్రామం నుండి ఆటోలో మృతుడు లక్ష్ముడుతో పాటు మరికొద్దిమంది వెళ్తున్నారు.

03/07/2019 - 04:40

మహబూబ్‌నగర్, మార్చి 6: కేవలం హత్యలు చేసి వారితో ఉన్న డబ్బును తీసుకెళ్లడానికి కోసం 12హత్యలు చేసిన ఓ నేరగాన్ని ఎట్టకేలకు పోలీసులు ఆరెస్టు చేశారు. బుధవారం నిందితుడిని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి విలేఖరుల ఎదుట హజరుపర్చారు.

Pages