S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/07/2019 - 04:27

కడప,మార్చి 6: అంతర్రాష్ట ఎర్రచందనం స్మగ్లర్ గురుస్వామి వీర్ రాజ్‌కుమార్(42)ను కడప పోలీసులు అరెస్టుచేశారు. ఇతనిపై సుమారు 40 వరకు కేసులు ఉన్నాయి. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన గురుస్వామికు నేపాల్, చైనా, సింగపూర్, మయన్మార్ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్లతో సంబంధాలున్నాయి.

03/07/2019 - 04:23

రంపచోడవరం, మార్చి 6: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఆటో లారీని ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం ఉదయం ఎటపాక మం డలం గన్నవరం గ్రామానికి చెందిన సూరిపాక లావణ్య (23), చిన్నబోయి న ప్రవల్లిక (24), గంజి వీరబాబు, గుండెపోటు రమేష్ ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు.

03/07/2019 - 02:10

న్యూఢిల్లీ, మార్చి 6: రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒప్పందానికి సంబంధించిన కీలకపత్రాలు అపహరణకు గురయ్యాయని, కాగా ఒక ఆంగ్లదినపత్రిక వీటిల్లోని సమాచారాన్ని అధికార రహస్య చట్టం ఉల్లంఘించి ప్రచురించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

03/07/2019 - 01:51

ఆమనగల్లు, మార్చి 6: కడ్తాల మండల ప్రభుత్వ పశువైద్యాధికారి రవిచంద్ర తన కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న పర్వీన్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాధిత రైతు హన్మంత్ రెడ్డి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం... కడ్తాల మండలం రావిచెడ్ గ్రామానికి చెందిన రైతు హన్మంత్ రెడ్డి ఇటీవల 12 పశువులను కొనుగోలు చేశాడు.

03/07/2019 - 01:50

గచ్చిబౌలి, మార్చి 6: బెల్ట్‌షాప్ నిర్వహకుడిపై కత్తులతో దాడి చేసిన సంఘటన మాదాపూర్‌లో సంచలన సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉవున్నాయి. మాహబూబ్‌నగర్‌కు చెందిన ఆంగోత్ రాములు(36) జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి మాదాపూర్‌లోని చంద్రానాయక్ తండాలో నివాసముంటున్నాడు. మాదాపూర్‌లోని నిరూస్ జంక్షన్ వద్ద మొదట్లో టీ స్టాల్‌ను నిర్వహించేవాడు.

03/07/2019 - 01:50

మేడ్చల్, మార్చి 6: లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా శివంపేట్ మండలం దొంతికుంట గ్రామానికి చెందిన వీ. కృష్ణారెడ్డి(45) వ్యవసాయదారుడు.

03/07/2019 - 01:49

మేడ్చల్, మార్చి 6: ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు లారీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని బండమాదారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 248 ప్రభుత్వ భూమిలో నుంచి మంగళవారం రాత్రి కొందరు అక్రమంగా టిప్పర్ లారీలతో మట్టిని తరలిస్తుండగా గ్రామస్థులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.

03/06/2019 - 23:31

న్యూఢిల్లీ, మార్చి 6: అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని మధ్యవర్తిత్వం, సంప్రదింపుల ద్వారా పరిష్కరించే అంశంపై త్వరలో ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. శాంతియుతంగా ఈ అంశాన్ని పరిష్కరించేందుకు వీలుగా అర్హులైన మధ్యవర్తుల పేర్లను కేసులోని పార్టీలు తమకు తెలియచేయాలని కోర్టు సూచించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

03/06/2019 - 23:37

దేవరకొండ / కొండమల్లేపల్లి, మార్చి 6: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం హైద్రాబాద్ - సాగర్ రహదారిపై చెన్నారం స్టేజీ సమీపంలో బుదవారం ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ మహేశ్ హైద్రాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.

03/07/2019 - 02:46

నెల్లిమర్ల, మార్చి 6: మహాశివరాత్రి జాతర విషాధాన్ని మిగిల్చింది. రామతీర్థం జాతరలో బోడికొండపై నుండి జారిపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం సోమవారం రామతీర్థం శివరాత్రి జాతరకు దాసన్నపేటకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారు.

Pages