S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/09/2016 - 22:03

మాస్, కమర్షియల్ సినిమాలకే పరిమితం కాదనని, సత్తా ఉన్న కథ ఉంటే క్లాస్ సినిమాలూ చేస్తానంటున్నారు జూనియర్ ఎన్టీఆర్.
నందమూరి బాలకృష్ణతో పోటీ ఏమీ లేదని, మా కుటుంబంలో ఎవరిమధ్యా అలాంటి వాతావరణం ఉండదని, ఎవరి సినిమాలు వారివని ఆయనంటున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఈనెల 13న విడుదల కానున్న నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి...
గెడ్డం తీశారు, ఎలా వుంది?

01/09/2016 - 22:00

ఆమధ్య మైనా సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అందాల భామ అమలాపాల్ ఆ తర్వాత వరుస అవకాశాలతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. పలు చిత్రాల్లో నటించి, మంచి గ్లామర్ భామగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈమధ్యే దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకుని, సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామ సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన మేము చిత్రంలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది.

01/09/2016 - 21:58

‘కర్తవ్యం’ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించి, ‘జెంటిల్‌మెన్’, ‘్భరతీయుడు’ వంటి సంచలన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తండ్రి అరణి మునుస్వామి (96) మృతి చెందారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటున్న ఆయన నిన్న మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పెద్దకుమారుడైన ఎ.ఎం.రత్నం నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. మరో తనయుడు దయాకర్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.

01/09/2016 - 21:57

ఆనంద్, రాజ్‌పాల్ ముఖ్యపాత్రల్లో విజయ్‌శేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7టు4’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో సెన్సార్‌కు సిద్ధమైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు విజయ్‌శేఖర్ మాట్లాడుతూ ‘ఈనెల 12న సెన్సార్ జరగనుంది. ఈ సినిమాను టీమ్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్‌పెట్టి పనిచేశారు. రాత్రి 7 గంటలనుండి ఉదయం 4 గంటల వరకు జరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది.

01/09/2016 - 21:56

విభిన్నమైన సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రం ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత ఆయన మరో విభిన్న కథాచిత్రంలో నటించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. సినిమా సినిమాకు డిఫరెంట్ జోనర్లను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్న శర్వానంద్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కే చిత్రంలో నటిస్తాడట.

01/09/2016 - 21:55

ఒకప్పుడు ప్రేమకథ అంటే మంచి కామెడీ, త్యాగం, ప్రేమయొక్క పవిత్రత వుండేలా సినిమాలు రూపొందించారు. మరోచరిత్ర, మజ్ను, అనార్కలి లాంటి గొప్ప గొప్ప చిత్రాలతోపాటుగా పెళ్లికానుక ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అవి ప్రేమకథా చిత్రాల విలువ.

01/09/2016 - 21:53

తరుణ్, ఓవియా జంటగా రమేష్ గోపి దర్శకత్వంలో రామ్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. ఎస్.వి.ప్రకాష్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో కథానాయకుడు తరుణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

01/08/2016 - 21:49

ఈమధ్య టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్. స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ బిజీగా వున్న ఈ భామ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దాంతోపాటు అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ‘సరైనోడు’? చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా తరువాత రకుల్ స్పీడు పెంచేందుకు రెడీ అయింది. ఇప్పటికే మరో మెగా హీరో సినిమాలో

01/08/2016 - 21:47

కొంత గ్యాప్ తర్వాత ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ, ప్రత్యేకంగా రూపొందించే 150వ చిత్రంపై నిర్ణయం కొన్ని రోజులుగా వాయిదా పడుతూనే వస్తోంది. మెగాస్టార్ 150వ సినిమాకోసం అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారుకూడా. మొత్తానికి 150వ చిత్రం దాదాపు ఖరారైనట్టే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి.

01/08/2016 - 21:46

క్రేజీ హీరోగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్‌తో మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే దిల్‌రాజు, వేణుశ్రీరామ్‌ల ఎవడోఒకడు, సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం, దాంతోపాటు నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నాడు.

Pages