S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/16/2018 - 19:37

ఏడాదికి అక్షయ్‌కుమార్ సినిమాలపై దాదాపు వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తికాదు. అంతేకాదు ప్రతి ఒక్కరూ చూసేలా నవ్యమైన కథాంశాలతో ఇన్‌స్పైర్ చేసేలా అక్షయ్ సినిమాలు వస్తున్నాయి. హాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ కంపెనీగా రాణిస్తున్న ఫాక్స్ స్టార్ స్టూడియోతోపాటు కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి అక్షయ్ మూడు సినిమాలు చేయనున్నారు. ఇందులో అక్షయ్ కుమారే హీరోగా నటించనున్నారు.

11/16/2018 - 19:36

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం టాక్సీవాలా. జిఏ 2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్‌కెఎన్ నిర్మించిన చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ టాక్సీవాలా ఓ సైన్స్ ఫిక్షన్ కామెడీగా అన్ని వర్గాలనూ అలరిస్తుందన్నారు.

11/16/2018 - 19:34

‘కబాలి, కాలా’లాంటి చిత్రాలను ప్రేక్షకులపైకి వదిలిన దర్శకుడు పా రంజిత్. వరుస అవకాశాలు తీసుకుని, రెండు చిత్రాల్లోనూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని కొత్త యాంగిల్‌లో చూపించాడు. మరోసారీ రజనితోనే సినిమా అనుకున్నారు కానీ, కుదరలేదు. అయితే, రజనీతో చాన్స్ దక్కకపోయినా పా రొట్టె విరిగి క్రేజీ నేతిలో పడిందట. ఈసారి ఏకంగా ఓ బాలీవుడ్ కార్పొరేట్ హౌస్ నుంచి క్రేజీ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించే ఆఫర్ వచ్చిందట.

11/16/2018 - 19:33

2012లో విడుదలైన సుడిగాడుతో సూపర్‌హిట్ అందుకున్న అల్లరి నరేష్ అప్పటినుంచి డజనుకుపైగా సినిమాల్లో నటించినా ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కలేదు. దీంతో కాస్త రిలీఫ్ కోసం మొదటిసారి హీరో పాత్రను వదిలి కీలక పాత్ర పోషించేందుకూ ఒప్పుకున్నాడు. ఆ చిత్రమే మహేష్‌బాబు మహర్షి. అల్లరి నరేష్ గతంలోనూ ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటకీ, హీరోగానే చేశాడు. హీరోకాని పాత్ర చేయడం ఇదే మొదటిసారి.

11/16/2018 - 19:32

యాక్షన్ హీరో గోపీచంద్‌ను కొంతకాలంగా పరాజయాలు వెంటాడుతున్నాయి. గౌతమ్‌నందా, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్, పంతం ఇలా ఉంది ఆ ఫ్లాపుల వరస. తన తరువాతి చిత్రానికి కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడట. అందులో ఇద్దరు తెలుగు దర్శకులు, ఒకరు తమిళ దర్శకుడు ఉండడం విశేషం. దర్శకుడు సంపత్ నందికి ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపీచంద్.

11/16/2018 - 19:31

ఎఆర్ మూవీ ప్యారడైజ్ పతాకంపై కిషోర్ కుమార్, యగ్నాశెట్టి హీరో హీరోయిన్లుగా శరణ్ కె అద్వైతన్ దర్శకత్వంలో ఎ రామమూర్తి నిర్మించిన చిత్రం ‘రణరంగం’. తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం త్వరలో తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మూడు దశాబ్దాల కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా చిత్రం తెరకెక్కిందన్నారు.

11/16/2018 - 19:30

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది నవంబర్ 24న తొలిసారి హైదరాబాద్‌లో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జోనితా గాంధీ, దివ్యాకుమార్ తదితరులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం సంగీత ప్రియులకు తప్పకుండా వీనులవిందుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంద్రధనుష్ ‘అమిత్ త్రివేది లైవ్ కాన్సర్ట్’ అనే పేరుతో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

11/15/2018 - 20:19

కీర్తిసురేష్ క్రేజ్ పీక్స్‌కు చేరుకుంటోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకబిగిన సినిమాలు చేసేస్తున్న కీర్తి -టాప్ హీరోయిన్ల రేంజ్‌కి దగ్గరదగ్గరగా వచ్చేసింది. తాజాగా ఎన్టీఆర్, చరణ్‌లతో దర్శకధీరుడు రాజవౌళి డిజైన్ చేస్తున్న మల్టీస్టారర్‌లో కీర్తి కన్ఫర్మ్ అయినట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

11/15/2018 - 20:17

పైరసీ ఎఫెక్ట్ -మా సినిమాపైనే కాదు, ఏ సినిమా పైనైనా తీవ్రంగానే ఉంటుంది. పైరసీ కారణంగా ఆడియెన్స్ థియేటర్లకు వస్తారా? రారా? అన్న టెన్షన్‌కు గురవుతాం. అంతెందుకు పెళ్లిచూపులు చిత్రం పైరసీకి గురైవుంటే, తరువాత నాకు సినిమాలు పడుండేవి కావు. ఇంతదూరం వచ్చే వాడ్నీ కాదు. ఏమైనా పైరసీని బ్యాన్ చేయాలి అంటున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ.

11/15/2018 - 20:13

ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేయబోయే కొత్త సినిమా మొదలైంది. గతంలో తన సినిమాల ద్వారా ఎంతోమంది హీరో హీరోయిన్లను పరిచయం చేసిన శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమాలో కూడా అంతా కొత్తవాళ్లనే నటింపజేయనున్నాడు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్‌బోర్డు కార్యక్రమాలు సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో జరిగాయి.

Pages