S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2018 - 20:10

టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ భామ నిత్యామీనన్ సెలెక్టివ్‌గా సినిమాలను చేస్తోంది. కమర్షియల్ పాత్రలకు దూరంగా నటనపై దృష్టి సారించిన నిత్య, మొదటినుంచీ గ్లామర్ పాత్రలకు ఆమడదూరంలోనే ఉంటోంది. తమిళ, మలయాళ భాషల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న నిత్య మొదటిసారి బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సరసన నటిస్తోంది. దాంతోపాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు ఓకె చెప్పిందట.

11/21/2018 - 20:08

పూర్ణ ప్రధాన పాత్రలో గౌరికృష్ణ నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొదలైంది. అన్నం చిన్నికృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాటల రచయిత మరుధూరి రాజా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా నిర్మాత తండ్రి ఇ.రమేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

11/21/2018 - 20:07

సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. విష్వంత్, పల్లక్ లల్వాని హీరో హీరోయన్లు. లిరికల్ వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

11/21/2018 - 20:04

ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ లక్కీ మీడియా బ్యానర్‌పై పలు విభిన్న కథాచిత్రాలను నిర్మిస్తున్నాడు బెక్కం వేణుగోపాల్.

11/21/2018 - 20:03

ప్రేమకథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సెస్‌ని సాధించిన ఆర్‌పిఏ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. ఈ చిత్రంతో హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు.

11/21/2018 - 20:01

ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం టైటిల్‌ను బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఆవిష్కరించారు. చిత్ర టైటిల్‌ను అల్లాణి శ్రీ్ధర్, లోగోను ఎవిఎ సుబ్బారావు, మోషన్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అల్లాణి మాట్లాడుతూ యువత ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడిందన్న ఇతివృత్తంతో చేస్తున్న సినిమా తప్పకుండా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

11/21/2018 - 20:00

మన దేశంలో ఆడవాళ్లమీద జరుగుతున్న అత్యాచారాలపై పలువురు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై హీరోయిన్ ప్రియమణి తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రియమణి చేసిన కామెంట్స్‌కు చాలా విమర్శలు ఎదురయ్యాయి. ఈ విషయంపై స్పందిస్తూ తాను దేశానికి వ్యతిరేకం కాదని, అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల గురించి చాలా బాధనిపించి అలా స్పందించానని పేర్కొన్నారు.

11/20/2018 - 19:51

దర్శకుడు శంకర్ సినీ కెరీర్‌లోనే అతి పెద్ద నిడివి సినిమా -ఐ. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం రన్‌టైం 188 నిమిషాలు. శంకర్ మార్క్ స్పష్టంగా కనిపించినా -ఆడియన్స్‌కి ఎక్కలేదు. ఎందుకంటే -అంతసేపు కూర్చుని సినిమాని ఎంజాయ్ చేసేంత ఓపిక ఆడియన్స్‌కి లేకపోవడం. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చు, కానీ ఓ సినిమా సక్సెస్‌ను నిర్ణయించే అంశమే. అందుకే ఈసారి శంకర్ కాస్త జాగ్రత్తపడ్డాడు.

11/20/2018 - 19:48

షకీలా. ఒకప్పటి శృంగార తార. ఏ టాగ్‌లైన్‌తో పెద్ద హీరోల చిత్రాలకు సైతం సవాల్ విసిరిందో, ఇప్పుడు ఆ టాగ్‌లైన్‌కు వ్యతిరేకంగా బయోపిక్ పోస్టర్లలో దర్శనమిస్తోంది. ఆ టాగ్‌లైన్ -పోర్న్ స్టార్ కాదన్నది. తన మార్క్ అడల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఒక వెలుగు వెలిగిన నటి -షకీలా. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా చేస్తోంది.

11/20/2018 - 19:47

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో జిఎ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్‌కెఎన్ నిర్మించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మాళవికా నాయర్ చెప్పిన విశేషాలు..

సక్సెస్ ఎంజాయ్

Pages